ఉత్తమ విద్యాసంస్థల తెలంగాణ


Mon,April 15, 2019 12:58 AM

University-of-Hyderabad
-దేశవ్యాప్తంగా ఉత్తమ విద్యాసంస్థల్లో తెలంగాణ మరోసారి సత్తా చాటింది. ఉన్నత విద్యాసంస్థలకు ర్యాంకుల జాబితాలో రాష్ట్రంలోని యూనివర్సిటీలు మెరిశాయి. ఓవరాల్, యూనివర్సిటీ, ఇంజినీరింగ్ తదితర విభాగాల్లో జాతీయస్థాయిలో ఉత్తమ స్థానాలు లభించాయి. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (ఎంహెచ్‌ఆర్‌డీ) బోధన, వసతులు ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ ర్యాంకులను ప్రకటిస్తుంది. ఇందులో భాగంగా నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్-2019 ర్యాంకులను ఏప్రిల్ 8న ప్రకటించింది.


ఓవరాల్ కేటగిరీలో..

-హెచ్‌సీయూ 11వ స్థానంలో నిలిచింది. గతేడాది కూడా ఇదే స్థానంలో నిలిచింది. ఐఐటీ హైదరాబాద్ 22వ స్థానంలో, గతేడాది కూడా ఇదే స్థానంలో నిలిచింది.
-ఉస్మానియా యూనివర్సిటీ గతేడాది 45వ ర్యాంకులో నిలువగా, ఈ ఏడాది 43వ స్థానంలో నిలిచింది.
-ఎన్‌ఐటీ వరంగల్ గతేడాది 78వ స్థానంలో నిలువగా, ఈ ఏడాది 61వ స్థానానికి ఎగబాకింది.

యూనివర్సిటీల విభాగంలో..

-హెచ్‌సీయూ గతేడాది 5వ స్థానంలో నిలువగా, ఈ ఏడాది 4వ స్థానంలో నిలిచింది.
-ఉస్మానియా యూనివర్సిటీ గతేడాది 28వ స్థానంలో నిలువగా, ఈ ఏడాది 26వ స్థానంలో నిలచింది.
-ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర అగ్రికల్చరల్ యూనివర్సిటీ గతేడాది 82వ స్థానంలో నిలువగా, ఈ ఏడాది 79వ స్థానంలో నిలిచింది.
-ట్రిపుల్‌ఐటీ హైదరాబాద్ గతేడాది 98వ స్థానంలో నిలువగా, ఈ ఏడాది 82వ స్థానంలో నిలిచింది.

osmania-university

ఇంజినీరింగ్ విభాగంలో..

-ఐఐటీ హైదరాబాద్ గతేడాది 9వ స్థానంలో నిలువగా, ఈ ఏడాది 8వ స్థానంలో నిలిచింది.
-ఎన్‌ఐటీ వరంగల్ గతేడాది 25వ స్థానంలో నిలువగా, ఈ ఏడాది 26వ స్థానంలో నిలిచింది.
-ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ గతేడాది 38వ స్థానంలో నిలువగా, ఈ ఏడాది 39వ స్థానానికి చేరింది.
-ఓయూ ఇంజినీరింగ్ కాలేజీ గతేడాది 80వ స్థానంలో నిలువగా, ఈ ఏడాది 83వ స్థానానికి చేరింది.
-సీబీఐటీకి 100, వీఎన్‌ఆర్ విజ్ఞాన్‌జ్యోతి 109, సీవీఆర్ ఇంజినీరింగ్ కాలేజీ (ఇబ్రహీంపట్నం) 132, బీవీఆర్ ఐటీ 147, వర్ధమాన్ ఇంజినీరింగ్ కాలేజీ 152, బీవీ రాజు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 168, అనురాగ్ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ 169, వాసవి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ 170, కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ 181వ ర్యాంకులు వచ్చాయి.

మరికొన్ని విభాగాలు

-సాధారణ కళాశాలల విభాగంలో హైదరాబాద్‌లోని సెయిం ట్ ఫ్రాన్సిస్ మహిళా కాలేజీ 95వ స్థానం పొందింది.
-మేనేజ్‌మెంట్ విభాగంలో హైదరాబాద్ శివారులోని ఇక్ఫాయ్‌కు 26, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీ (ఎంఐటీ)కి 67వ స్థానాలు దక్కాయి.
-ఫార్మసీ విభాగంలో హైదరాబాద్‌లోని కేంద్రీయ సంస్థ నైపర్‌కు 60వ స్థానం లభించింది. సుల్తాన్ ఉల్ ఉలూమ్ కాలేజీకి 65వ స్థానం దక్కింది.
-న్యాయవిద్య విభాగంలో హైదరాబాద్‌లోని నల్సార్‌కు 3వ స్థానం లభించింది.
-ఐఐటీ హైదరాబాద్‌కు అటల్ ర్యాంకింగ్ ఆవిష్కరణలో 10వ ర్యాంకు దక్కింది.

574
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles