ఎస్‌బీఐలో 8653 పోస్టులు


Sat,April 13, 2019 10:46 PM

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)లో జూనియర్ అసోసియేట్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
SBI
-పోస్టు: జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్&సేల్స్)
-మొత్తం ఖాళీలు: 8653
-హైదరాబాద్ సర్కిల్ పరిధిలో- 425
-పేస్కేల్: ప్రారంభ వేతనం రూ.13,075/-
-అర్హతలు: 2019, ఆగస్టు 31 నాటికి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. ఫైనల్ ఇయర్ డిగ్రీ పరీక్షలు రాస్తున్నవారు/రాసినవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. సర్టిఫికెట్‌ను ఆగస్టు 31లోగా సమర్పించాల్సి ఉంటుంది.
-వయస్సు: 2019, ఏప్రిల్ 1 నాటికి 20-28 ఏండ్ల మధ్య ఉండాలి. అంటే 1991, ఏప్రిల్ 2 నుంచి 1999, ఏప్రిల్ 1 మధ్య జన్మించి ఉండాలి.
-ఎస్సీ/ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-ఎంపిక: ఆన్‌లైన్ టెస్ట్ (ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్)
-ప్రిలిమినరీ ఎగ్జామ్: ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. 100 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్ష కాలవ్యవధి 60 నిమిషాలు.
-పరీక్షలో ఇంగ్లిష్ లాంగ్వేజ్-30 (20 నిమిషాలు), న్యూమరికల్ ఎబిలిటీ-35 (20 నిమిషాలు), రీజనింగ్ ఎబిలిటీ-35 (20 నిమిషాలు) ప్రశ్నలు ఇస్తారు.
-నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు జవాబుకు 1/4 మార్కులు కోతవిధిస్తారు.
-ప్రిలిమినరీ ఎగ్జామ్‌ను జూన్ నెలలో నిర్వహిస్తారు.
మెయిన్ ఎగ్జామినేషన్:
-ఆన్‌లైన్‌లో ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు.
-జనరల్/ఫైనాన్షియల్ అవేర్‌నెస్-50 ప్రశ్నలు-50 మార్కులు- 35 నిమిషాలు
-జనరల్ ఇంగ్లిష్ -40 ప్రశ్నలు-40 మార్కులు- 35 నిమిషాలు
-క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్-50 ప్రశ్నలు-50 మార్కులు- 45 నిమిషాలు
-రీజనింగ్ ఎబిలిటీ&కంప్యూటర్ ఆప్టిట్యూడ్-50 ప్రశ్నలు-60 మార్కులు- 45 నిమిషాలు.
-మొత్తం 190 ప్రశ్నలు- 200 మార్కులు- 2 గంటల 40 నిమిషాల కాలవ్యవధి.
-నోట్: ప్రశ్నపత్రం ఇంగ్లిష్/స్థానిక భాషలో ఇస్తారు.
-తుది ఎంపిక: మెయిన్ ఎగ్జామ్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా చేస్తారు.
-పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: మే 3
-వెబ్‌సైట్: https://www.sbi.co.in

357
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles