ఐడీబీఐలో 620 పోస్టులు


Thu,April 4, 2019 12:57 AM

ఐడీబీఐలో అసిస్టెంట్ మేనేజర్, స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
idbi-bank
-పోస్టు: అసిస్టెంట్ మేనేజర్
-ఖాళీల సంఖ్య-500. వీటిలో జనరల్-228, ఎస్సీ-75, ఎస్టీ-37, ఓబీసీ-135, ఈడబ్ల్యూఎస్-25 ఖాళీలు ఉన్నాయి.
-అర్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.
-వయస్సు: 2019, మార్చి 1 నాటికి 21-28 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్, వ్యక్తిగత ఇంటర్వ్యూ ద్వారా
-ఆన్‌లైన్ టెస్ట్: ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు.
-పరీక్షలో లాజికల్ రీజనింగ్, డాటా అనాలిసిస్, ఇంటర్‌ప్రిటేషన్-60, ఇంగ్లిష్ లాంగ్వేజ్-40, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్-40, జనరల్/ఎకానమీ/బ్యాంకింగ్ అవేర్‌నెస్-60 ప్రశ్నలు ఇస్తారు. మొత్తం 200 మార్కులకు పరీక్ష ఉంటుంది.
-పరీక్ష కాలవ్యవధి 120 నిమిషాలు.
-పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు జవాబుకు 0.25 మార్కుల కోత విధిస్తారు.
-ఆన్‌లైన్ టెస్ట్‌లో అర్హత సాధించినవారిని ఇంటర్వ్యూకు పిలుస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: ఏప్రిల్ 15
-ఆన్‌లైన్ టెస్ట్ తేదీ: మే 17
-రాష్ట్రంలో పరీక్ష కేంద్రం: హైదరాబాద్
-పరీక్ష ఫీజు: ఎస్సీ/ఎస్టీ, పీహెచ్‌సీలకు రూ. 150/- ఇతరులకు రూ.700/-
-వెబ్‌సైట్: www.idbi.com.

329
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles