నిమ్‌సెట్ - 2019


Wed,March 13, 2019 01:21 AM

దేశంలో ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలుగా పేరొందిన నిట్‌లలో ఎంసీఏ చేస్తే కెరీర్‌కు గ్యారంటీ ఉంటుంది. సాధరణ కాలేజీలో చదివిన ఎంసీఏ కన్నా నిట్‌లలో చేసినదానికి వ్యత్యాసం ఉంటుంది. జాతీయస్థాయిలో నిర్వహించే నిమ్‌సెట్‌లో మంచిర్యాంకు సాధిస్తే ప్రవేశం దొరికనట్లే. ఉత్తమ బోధన, క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌కు నిట్‌లు పేరుగాంచినవి. నిమ్‌సెట్ ప్రకటన విడుదలైన నేపథ్యంలో వివరాలు సంక్షిప్తంగా..


నిమ్‌సెట్:


-జాతీయ ప్రాముఖ్యం కలిగిన సంస్థలైన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లలో మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ (ఎంసీఏ)లో ప్రవేశాల కోసం జాతీయస్థాయిలో ఏటా నిర్వహించే కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ నిమ్‌సెట్. ఏటా ఒక నిట్ ఈ పరీక్షను నిర్వహిస్తుంది. ఈసారి కర్ణాటకలోని సూరత్‌కల్ నిట్ నిమ్‌సెట్‌ను నిర్వహిస్తున్నది.
-ప్రవేశాలు కల్పించే నిట్‌లు: వరంగల్, అగర్తలా, అలహాబాద్, భోపాల్, కాలికట్, జంషెడ్‌పూర్, కురుక్షేత్ర, రాయ్‌పూర్, సూరత్‌కల్, తిరుచిరాపల్లి (తిరుచ్చి).
-మొత్తం సీట్ల సంఖ్య-827. నిట్‌ల వారీగా... అగర్తలా-30, అలహాబాద్-101, భోపాల్-102, కాలికట్-52, జంషెడ్‌పూర్-102, కురుక్షేత్ర-75, రాయ్‌పూర్-104, సూరత్‌కల్-51, తిరుచిరాపల్లి-115, వరంగల్-58తోపాటు కురుక్షేత్రలో (సెల్ఫ్ ఫైనాన్సింగ్)-37.
NIT

ఎవరు రాయవచ్చు..?


-కనీసం 60 శాతం మార్కులతో లేదా 6.5 సీజీపీఏ (10 పాయింట్ స్కేల్‌పై)తో కింది పేర్కొన్న ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులు. (ఎస్సీ, ఎస్టీలకు 55 శాతం లేదా 6 సీజీపీఏ)
-కనీసం మూడేండ్ల కాలవ్యవధిగల బీఎస్సీ/బీఎస్సీ (ఆనర్స్) లేదా బీసీఏ లేదా బీఐటీ, బీ.వొకేషనల్ (కంప్యూటర్‌సైన్స్/కంప్యూటర్ అప్లికేషన్స్) ఉత్తీర్ణత.
-బీఈ/బీటెక్ ఉత్తీర్ణత.
నోట్: డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షలు రాస్తున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

పరీక్ష విధానం:


-120 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఇస్తారు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌లో మాత్రమే ఉంటుంది. పరీక్ష కాలవ్యవధి 120 నిమిషాలు.
-పరీక్షలో మ్యాథ్స్-70, అనలిటికల్ ఎబిలిటీ & లాజికల్ రీజనింగ్-40, కంప్యూటర్ అవేర్‌నెస్-10, జనరల్ ఇంగ్లిష్-20 ప్రశ్నలు ఇస్తారు.
-ప్రతి ప్రశ్నకు నాలుగు మార్కులు. తప్పు జవాబు గుర్తిస్తే ఒకమార్కు కోత విధిస్తారు.
-జవాబులను బ్లాక్/బ్లూ పెన్‌తో ఓఎంఆర్ షీట్‌పై గుర్తించాలి.
-ఎంపిక: నిమ్‌సెట్‌లో వచ్చిన ర్యాంక్ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.

-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: మార్చి 31 (సాయంత్రం 5 గంటల వరకు)
-అడ్మిట్ కార్డుల డౌన్‌లోడింగ్: మే 13 నుంచి 24 వరకు
-పరీక్ష తేదీ: మే 26 (ఉదయం 10 నుంచి 12 గంటల వరకు)
-ఫలితాల వెల్లడి: జూన్ 5
-వెబ్‌సైట్: https://www.nimcet.in

-కేశవపంతుల వేంకటేశ్వరశర్మ

898
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles