ఇఫ్లూలో ప్రవేశాలు


Thu,February 21, 2019 01:08 AM

హైదరాబాద్‌లోని ఇంగ్లిష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ) పలు యూజీ, పీజీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
EFLU--ADMISSIONS
-ఇఫ్లూ క్యాంపస్‌లు: హైదరాబాద్, షిల్లాంగ్, లక్నో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు:
-బీఏ (ఆనర్స్) - ఇంగ్లిష్ - హైదరాబాద్‌లో 40 సీట్లు, లక్నోలో 40 సీట్లు, షిల్లాంగ్‌లో 20 సీట్లు. కంప్యూటర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహించే పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.
-బీఏ (ఆనర్స్)- అరబిక్, ఫ్రెంచీ, జర్మనీ, జపానీస్, రష్యన్, స్పానిష్, జర్నలిజం అండ్ మాస్‌కమ్యూనికేషన్. ప్రతి ఒక్కదానికి 20 సీట్ల చొప్పున ఉన్నాయి. వీటన్నింటిని హైదరాబాద్ క్యాంపస్ మాత్రమే అందిస్తుంది.
-అర్హతలు: యూజీ కోర్సులకు కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత. ఇంగ్లిష్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి.
పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సులు:
-మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ (ఎంఏ): ఇంగ్లిష్, ఇంగ్లిష్ లిటరేచర్, లిటరేచర్స్ ఇన్ ఇంగ్లిష్, కంపారిటివ్ లిటరేచర్, లింగ్విస్టిక్స్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచింగ్, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, హిందీ, కంప్యూటేషనల్ లింగ్విస్టిక్స్, అరబిక్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్, ఫ్రెంచ్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్, జర్మన్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్, హిస్పానిక్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్, రష్యన్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్.
-ఎంపిక: పై పీజీ కోర్సులన్నింటికి కంప్యూటర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ టెస్ట్ ద్వారా 100 మార్కులకు పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు.
-అర్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
-టీచర్ ఎడ్యుకేషన్ కోర్సులు
-బీఈడీ- ఇంగ్లిష్
-సీట్ల సంఖ్య -50. కోర్సును హైదరాబాద్ క్యాంపస్ ఆఫర్ చేస్తుంది.
-పీజీడీటీఈ - ఇంగ్లిష్
-సీట్ల సంఖ్య- హైదరాబాద్-40, లక్నో-20 సీట్లు ఉన్నాయి.
-పీజీడీటీఏ - అరబిక్
-సీట్ల సంఖ్య - 20. హైదరాబాద్ క్యాంపస్ ఆఫర్ చేస్తుంది.
పీహెచ్‌డీ పోగ్రామ్స్:సబ్జెక్టులు: లింగ్విస్టిక్స్ అండ్ ఫొనెటిక్స్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్, ఇండియన్ అండ్ వరల్డ్ లిటరేచర్స్, ఇంగ్లిష్ లిటరేచర్, కల్చరల్ స్టడీస్, ఫిల్మ్ స్టడీస్ అండ్ విజువల్ కల్చర్, కంపారిటివ్ లిటరేచర్, ట్రాన్స్‌లేషన్ స్టడీస్, ఏస్థిటిక్స్ అండ్ ఫిలాసఫీ, అరబిక్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్, ఫ్రెంచ్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్, రష్యన్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్, జర్మన్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్, స్పానిష్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్.
-నోట్: టీచింగ్ కోర్సులు, పీజీడీ, పీహెచ్‌డీ కోర్సులకు ఆయా సబ్జెక్టులను బట్టి వేర్వేరుగా ఉన్నాయి. వివరాలు ప్రాస్పెక్టస్‌లో చూడవచ్చు.
-ఎంపిక: పీహెచ్‌డీ ప్రవేశాలు రెండుగంటల కాలవ్యవధిలో నిర్వహించే ఎంట్రెన్స్ టెస్ట్, ఇంటర్వ్యూల ద్వారా చేస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: ఫిబ్రవరి 26
-వెబ్‌సైట్: www.efluniversity.ac.in

1867
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles