సివిల్ సర్వీసెస్- 2019 ఉన్నతోద్యోగాలకు నెలవు


Wed,February 20, 2019 02:38 AM

Civil-Services

దేశంలో అత్యున్నత ప్రభుత్వ ఉద్యోగాలుగా కీర్తించే ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్, ఐఆర్‌ఎస్ వంటి పోస్టులకు అభ్యర్థులను ఎంపికచేసే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సీఎస్‌ఈ) -2019 నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో సివిల్స్ పరీక్ష విధానం, పోస్టులు, పరీక్షతేదీలపై సంక్షిప్తంగా నిపుణ పాఠకుల కోసం...

- సివిల్స్: దేశంలో ఎన్నో పోటీ పరీక్షలు ఉన్నా దశాబ్దాలుగా క్రేజీ తగ్గని ఎగ్జామ్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్. కలెక్టర్ నుంచి సీఎస్, కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి వంటి ఉన్నత పదవులకు ఎదిగే అవకాశమున్న ఉద్యోగాలు సీఎస్‌ఈ ద్వారా భర్తీ అవడమే అందుకు కారణం. నిత్యం ప్రజలతో మమేకమై దేశసేవ చేసుకునే అవకాశం కొన్నింటికి, మరికొన్నింటికి కీలకమైన ప్రణాళికలు, విదేశీ వ్యవహారాల్లో భాగస్వామ్యం అయ్యే అవకాశం ఈ పోస్టుల ప్రత్యేకం. మంచి గౌరవం, హోదా, జీతభత్యాలు అన్నింటిని మించి వృత్తిలో సంతృప్తిల సమాహారం సివిల్ సర్వీసెస్‌లు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్‌ఎస్, ఐఎఫ్‌ఎస్, గ్రూప్-ఏ, బీ క్యాడర్ సర్వీసెస్‌లు (మొత్తం 24 రకాల సర్వీసెస్‌లు).

మూడంచెల్లో ఎంపిక

- మొత్తం 24 రకాల పోస్టులకు యూపీఎస్సీ మూడుదశల్లో ఎంపిక చేస్తుంది. మొదట ప్రిలిమ్స్ దీనిలో అర్హత సాధించినవారిని ఉద్యోగాల సంఖ్యను బట్టి 10 నుంచి 12 రెట్ల సంఖ్యలో మెయిన్స్‌కు ఎంపికచేస్తుంది. ఆ తర్వాత ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపిక చేస్తారు. దేశవ్యాప్తంగా గతేడాది సుమారు ఎనిమిది లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు. దీనిలో 10460 మంది ప్రిలిమ్స్‌లో అర్హత సాధించారు.
- అర్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులు.
- వయస్సు: 21- 32 ఏండ్ల మధ్య ఉన్నవారు అర్హులు. రిజర్వ్‌డ్ వర్గాలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
నోట్: గరిష్ఠంగా ఆరుసార్లు మాత్రమే సివిల్స్ రాయవచ్చు. రిజర్వ్‌డ్ వర్గాలకు నిబంధనల్లో సడలింపు ఉంది. వివరాలు అధికారిక ప్రకటనలో చూడవచ్చు.

ప్రిలిమ్స్ ప్యాట్రన్

- సివిల్ సర్వీసెస్‌లో మొదటి అంకం ప్రిలిమ్స్. దీనిలో రెండు పేపర్లు ఉంటాయి. జనరల్ స్టడీస్ పేపర్-1, 2. మొత్తం 400 మార్కులు. పేపర్-2 కేవలం క్వాలిఫయింగ్ పరీక్ష మాత్రమే. దీనిలో 33 శాతం మార్కులు సాధించాలి. అంటే 66 మార్కులు. ప్రిలిమ్స్‌లో వచ్చిన మార్కులను తుది ఎంపికలో పరిగణనలోకి తీసుకోరు. పోస్టుల సంఖ్యను బట్టి మెయిన్స్‌కు అభ్యర్థులను ఎంపికచేస్తారు. మెయిన్స్ తొమ్మిది పేపర్లు ఉంటాయి. దీనిలో పేపర్ ఏ (ఇండియన్ లాంగ్వేజెస్), పేపర్ బీ (ఇంగ్లిష్) కేవలం అర్హత కోసం నిర్వహిస్తారు. వీటిలో 25 శాతం మార్కులు సాధించాలి. పేపర్ -1 నుంచి 7 వరకు మార్కుల ఆధారంగా ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. మొత్తం ఏడు పేపర్లలకు 1750 మార్కులు. 1:2 నిష్పత్తిలో ఇంటర్వ్యూలకు అభ్యర్థులను ఎంపికచేస్తారు.

ప్రిలిమ్స్ కటాఫ్ ఎలా ఉంటుంది

- 2018లో సివిల్స్ ప్రిలిమ్స్ జనరల్ అభ్యర్థుల కటాఫ్ 116. ఓబీసీ-110, ఎస్సీ-99.34, ఎస్టీ-96, పీహెచ్‌సీ -1,2,3ల కటాఫ్ వరుసగా 75.34, 72.66, 40.00.
- 2017లో ప్రిలిమ్స్ కటాఫ్ పరిశీలిస్తే.. జనరల్-105.34, ఓబీసీ-102.66, ఎస్సీ-88.66, ఎస్టీ-88.66, పీహెచ్‌సీ 1, 2, 3ల కటాఫ్- 85.34,61.34, 40.

ముఖ్యతేదీలు

- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- చివరితేదీ: మార్చి 18
- ప్రిలిమ్స్ ఎగ్జామ్: జూన్ 2
- ఫలితాల వెల్లడి: జూలై
- మెయిన్స్ దరఖాస్తులు: జూలై/ఆగస్టు
- మెయిన్స్ ఎగ్జ్జామ్స్: సెప్టెంబర్ 20 నుంచి
- ఫలితాల వెల్లడి: డిసెంబర్
- పర్సనాలిటీ టెస్ట్- 2020, ఫిబ్రవరి
- ఫలితాల వెల్లడి: మార్చి/ఏప్రిల్ 2020
- వెబ్‌సైట్: https://upsc.gov.in

- కేశవపంతుల వేంకటేశ్వరశర్మ

2185
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles