ఇంజినీరింగ్ విద్యకు విజ్ఞాన్ గని


Wed,February 13, 2019 01:30 AM

Engineering-Colleges
రెండున్నర దశాబ్దాలకు పైగా ఎంసెట్ క్రేజ్ నడుస్తున్నది. రెండు తెలుగు రాష్ట్రాల్లో వందల సంఖ్యలో ఇంజినీరింగ్ కాలేజీలున్నా అత్యున్నత్తమైన ప్రమాణాలు కలిగిన కాలేజీల సంఖ్య వేళ్ల మీద లెక్కించవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో నాణ్యమైన విద్యకు 41 ఏండ్లుగా చిరునామాగా నిలుస్తూ విజ్ఞాన్ ఇంజినీరింగ్ కాలేజీ విజ్ఞాన్స్ డీమ్డ్ యూనివర్శిటీగా రూపాంతరం చెందింది. అత్యుత్తమ విద్యను అందిస్తూ జాతీయ స్థాయిలో ఐటీలకు దీటుగా నిలుస్తున్నది. మెరుగైన విద్య కోసం, ఆధునిక సాంకేతికత కోసం పలు విదేశీ విశ్వవిద్యాలయాలతో ఒప్పందాలు, పరిశ్రమలతో టైఅప్, క్యాంపస్ ప్లేస్‌మెంట్స్, పత్రిభావంతులకు ఫీజు రాయితీలతో నాణ్యమైన విద్యను అందిస్తున్న విజ్ఞాన్‌లో ప్రవేశాల కోసం విశాట్ 2019 నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో యూనివర్సిటీ ప్రత్యేకతలు, కోర్సులు, ప్లేస్‌మెంట్స్‌పై ప్రత్యేక కథనం...

విద్యా బోధనలో ప్రత్యేకతలు

- బీటెక్‌తోపాటు సివిల్ సర్వీసెస్‌లో శిక్షణ
- పరిశ్రమల్లో ఉద్యోగాలు చేసేందుకు అనుకూలంగా ఆధునిక సాంకేతిక విద్య
- టెక్నాలజీ - మేనేజ్‌మెంట్ నైపుణ్యంలో శిక్షణ
- క్యాంపస్ ప్లేస్‌మెంట్స్
- బీటెక్ రెండో ఏడాది నుంచే మినీ ప్రాజెక్టులు
- బీటెక్ ఫైనల్ ఇయర్‌లో ఒక సెమిస్టర్‌తోపాటు ఇంటర్న్‌షిప్
- కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం సౌజన్యంతో ఆంగ్లభాష నైపుణ్యం పెంపొందించేలా ప్రత్యేక శిక్షణ
- విద్యార్థుల్లో సృజనాత్మక మెరుగుపర్చేందుకు ఆప్షనల్ క్లబ్స్
- అత్యుత్తమ పరిశోధనలకు ఏఐసీటీఈ, డీఎస్‌టీ, డీబీటీ వంటి సంస్థలతో అవగాహన ఒప్పందాలు
- పరిశ్రమలతో ఒప్పందాలు, ఇంటర్న్‌షిప్ అవకాశం
- ఐఐటీ, నిట్‌ల్లో ఎంటెక్/పీహెచ్‌డీ పూర్తిచేసిన ఫ్యాకల్టీ. విద్యారంగంలో అనుభవజ్ఞులచే జూనియర్ ఫ్యాకల్టీకి అవసరమైన తర్ఫీదు.
- డీమ్డ్ యూనివర్సిటీ హోదా వల్ల వేగంగా మారుతున్న టెక్నాలజీని వెంటనే సిలబస్‌లో చేరుస్తారు.
- ప్రత్యేక హాస్టల్ వసతి, లైబ్రెరీ, స్టడీ అవర్స్ (ఫస్ట్ ఇయర్‌కు మాత్రమే), క్యాంపస్ ప్లేస్‌మెంట్స్

ప్రతిభావంతులకు ఫీజు రాయితీలు

- వీశాట్‌లో తొలి 50 ర్యాంకులు సాధించిన వారికి 75శాతం
- 51 - 100లోపు ర్యాంకులు సాధించిన వారికి 50శాతం
- 100 - 200 వరకు ర్యాంక్ వచ్చిన విద్యార్థులకు 25 శాతం.
- 201-2000 వరకు ర్యాంక్ వచ్చిన విద్యార్థులకు 10 శాతం ఫీజు రాయితీ ఇస్తున్నారు.
- వీశాట్ అప్లయ్ చేసి ఐఐటీ జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్‌డ్‌లో ప్రతిభ చూపిన వారికి, ఇంటర్‌లో అత్యుత్తమ మార్కులు సాధించిన వారికి ఫీజు రాయితీ ఉంటుంది.
Engineering-Colleges1

బ్రాంచీలు-వివరాలు

జాతీయస్థాయిలో ప్రసిద్ధి చెందిన ఐఐటీ, ఎన్‌ఐటీలో ఉన్న ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్ తదితర సాంప్రదాయ కోర్సులతోపాటు నేటి ఆధునిక పరిశ్రమలకు అనువైన కోర్సులు.. ఆటోమొబైల్, కెమికల్, పెట్రోలియం, అగ్రికల్చర్, టెక్స్‌టైల్స్ టెక్నాలజీ అందించడంలో విజ్ఞాన్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ ముందంజలో ఉంది.

అగ్రికల్చరల్ ఇంజినీరింగ్:

- దేశంలో 70శాతం పైగా గ్రామీణ ప్రాంతంలో నివసిస్తున్న రైతాంగానికి ఆధునిక వ్యవసాయ పరికరాల తయారీకి అగ్రికల్చరల్ ఇంజినీర్ల ఆవశ్యకత ఎంతో ఉంది. ఈ విషయానికి అనుగుణంగా అగ్రికల్చర్ ఇంజినీరింగ్ కోర్సు డిజైన్ చేయబడింది. వ్యవసాయ సాంకేతిక విజ్ఞానంతో దేశయాంత్రీకరణ చేయడానికి, దేశంలో ప్రగతిపథంలో స్వచ్ఛమైన హరితవిప్లవం సాధించడానికి ఈ కోర్సు ఉపయోగపడుతుంది.

టెక్స్‌టైల్స్ ఫ్యాషన్ టెక్నాలజీ:

- నవ్యాంధ్ర రాజధాని సమీపంలో టెక్స్‌టైల్స్ పార్కు స్థాపించబోతున్నారు. దానితోపాటు స్పిన్నింగ్, వీవింగ్, మిల్లులు ఈ ప్రాంతంలో విస్తృతంగా ఉన్నాయి. ఈ ప్రాంత పరిసరాల్లో టెక్స్‌టైల్ టెక్నాలజీ గ్రాడ్యుయేట్స్‌కు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు చాలా ఎక్కువ.

పెట్రోలియం ఇంజినీరింగ్:

- భారతదేశంలో అతికొద్ది విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థలు మాత్రమే ఈ కోర్సును అందిస్తున్నాయి. ఈ కోర్సు చదివిన తరువాత పెట్రోలియం సంస్థలతోపాటు గ్యాస్, సహజవాయువు సంస్థల్లో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగావకాశాలుంటాయి. అదేవిధంగా గల్ఫ్, సౌదీ తదితర దేశాల్లో ఇంజినీర్లుగా, శాస్త్రవేత్తలుగా, కన్సల్టెంట్లుగా అనేక ఉద్యోగావకాశాలు ఉన్నాయి.

సివిల్ ఇంజినీరింగ్:

- రెండేండ్లుగా సివిల్ ఇంజినీరింగ్ ప్రాధాన్యత పెరిగింది. నాణ్యమైన విద్యతో ప్రతిభావంతులైన సివిల్ ఇంజినీర్లను తయారుచేయడమే విజ్ఞాన్ లక్ష్యం. ఈ బ్రాంచీ చదివిన వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కొలువులతోపాటు ప్రైవేట్ ఉద్యోగాలున్నాయి.
BHARGAVI

ఎన్. భార్గవి

151FA05033 (ఈసీఈ) ఖమ్మం
విజ్ఞాన్ యూనివర్సిటీలో ఈసీఈ బ్రాంచీలో సీటు రావటం నా అదృష్టం. మంచి ఫ్యాకల్టీ, ల్యాబ్ సౌకర్యాలు ఉన్నాయి. ఇంగ్లిష్‌లో ప్రావీణ్యం కోసం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. చక్కటి ఆహ్లాదకర వాతావరణం కలిగిన అద్భుతమైన క్యాంపస్ మాకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. చదువుకోవడానికి కావల్సిన సకల సౌకర్యాలు ఇక్కడ లభించడం మాకు వరం. నాకు ఫీజులో వందశాతం రాయితీ లభించింది. ప్రత్యేకించి ఆధునిక సాంకేతికను మాకు అందిస్తున్నారు. సందేహాల నివృత్తిలోనూ ఫ్యాకల్టీ చాలా స్ఫూర్తిదాయకంగా వ్యవహరిస్తున్నారు.
SUSMI

యు. సునీత

151FA04062 (సీఎస్‌ఈ) నల్లగొండ
నాకు వందశాతం ఫీజు రాయితీతో సీఎస్‌ఈలో సీటు వచ్చింది. విజ్ఞాన్‌లో మంచి ల్యాబ్, లేటెస్ట్ టెక్నాలజీని బోధిస్తున్న ఫ్యాకల్టీని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. మా భవిష్యత్‌కు భరోసా లభించింది. అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన పాఠ్యప్రణాళికలు, ప్రాజెక్టులతో మాకు భోదన చేస్తున్నారు.
క్యాంపస్ వాతావరణం మా సొంత ఇంట్లో ఉన్న విధంగా ఉంది. మంచి ఆహారం, వసతి ఇక్కడ ఉన్నాయి. నాతోటి మిత్రులు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. చదువులో ఎంజాయ్ చేస్తున్నాం.
SHIVABALU

టి. శివబాలు

151FA05055 (ఈసీఈ) కరీంనగర్
నాకు ఈసీఈ బ్రాంచ్‌లో వంద శాతం ఫీజు రాయితీతో సీటు లభించింది. మొదట్లో విజ్ఞాన్‌లో ఎలా ఉంటుం దో అని భయపడ్డాను. కానీ ఇక్కడ వాతావరణం చూస్తే చాలా మంది ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, హైదరాబాద్ విద్యార్థులు ఉండటం ఆనందంగా ఉంది. మంచి ఫ్యాకల్టీ ఉంది. అధునాతనమైన ల్యాబ్‌లు, రిసెర్చ్ సదుపాయాలున్నాయి. కేవలం అకడమిక్స్ మాత్రమే కాకుండా స్పోర్ట్స్‌లో ప్రత్యేక శిక్షణను ఇస్తున్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ఇతర స్కిల్స్‌ను ఇక్కడ వెలికితీయడానికి ప్రత్యేక కృషి చేస్తున్నారు. కరికులమ్, కో కరికులమ్ యాక్టివిటీస్ చాలా బాగున్నాయి.

వీశాట్ - 2019

- బీటెక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ప్రవేశపరీక్షే వీశాట్.
- బీటెక్‌లో ఈసీఈ, సీఎస్‌ఈ, మెకానికల్, ఈఈఈ, సివిల్, కెమికల్, పెట్రోలియం ఇంజినీరింగ్, ఐటీ, ఆటోమొబైల్, టెక్స్‌టైల్ టెక్నాలజీ, అగ్రికల్చరల్, బయోమెడికల్, బయోటెక్నాలజీ, ఫుడ్‌టెక్నాలజీ, బయోఇన్ఫర్మాటిక్స్ బ్రాంచీలు, బీ ఫార్మసీ కోర్సులు ఉన్నాయి.

ప్రవేశపరీక్ష ముఖ్యాంశాలు

- దరఖాస్తు: హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, ఏలూరు, రాజమండ్రిల్లోని అన్ని విజ్ఞాన్ కాలేజీలు, సంస్థలు, కార్యాలయాల్లో అందుబాటులో ఉన్నాయి.
- పూర్తిచేసిన దరఖాస్తులను ఏప్రిల్ 10వ తేదీలోగా అందజేయాలి.
- ప్రవేశపరీక్షలను ఏప్రిల్ 15 నుంచి 25 వరకు నిర్వహిస్తారు.
- తెలంగాణ, ఏపీల్లోని అన్ని ఇండియన్ బ్రాంచీల్లో దరఖాస్తులు లభిస్తాయి. యూనివర్సిటీ వెబ్‌సైట్ నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

Apply Online: www.vignan.ac.in ఫోన్స్: 0863 - 2344777, 9966010001

1676
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles