సీటెట్ జూలై 2019


Wed,February 6, 2019 11:43 PM

న్యూఢిల్లీలోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎసీఈ) కెవీఎస్, ఎన్‌వీఎస్, సెంట్రల్ టిబెటన్ పాఠశాలల్లో టీజీటీ, పీఆర్‌టీ ఉద్యోగాల భర్తీకి నిర్వహించే సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (జూలై,2019)కు సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
ctet
-ఈ పరీక్షలో అర్హత సాధిస్తే కేంద్ర ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ఏనిమిదో తరగతి పాఠ్యాంశాలను బోధించడానికి టీజీటీ, పీఆర్‌టీ ఉద్యోగాల్లో చేరవచ్చు.
-పరీక్ష పేరు: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (జూలై, 2019)
-పేపర్ 1-ప్రైమరీ స్టేజ్ (1 నుంచి 5 తరగతులకు బోధించడానికి)
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 50 శాతం మార్కులతో డిగ్రీతోపాటు బీఈడీ లేదా ఇంటర్‌తోపాటు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్/ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (స్పెషల్ ఎడ్యుకేషన్) లో డిప్లొమా లేదా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో డిగ్రీ లేదా డిగ్రీతోపాటు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో డిప్లొమా ఉత్తీర్ణత.
-పేపర్ 2-ఎలిమెంటరీ స్టేజ్ (6 నుంచి 8 తరగతులకు బోధించడానికి).
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 50 శాతం మార్కులతో డిగ్రీతో పాటు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో డిప్లొమా/బీఈడీ లేదా 50 శాతం మార్కులతో ఇంటర్‌తోపాటు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో డిగ్రీ లేదా నాలుగేండ్ల బీఏ/బీఎస్సీ ఎడ్యుకేషన్, బీఏఈడీ, బీఎస్‌ఈడీ, డిగ్రీతోపాటు బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్) లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత.
-ఎంపిక: రాతపరీక్ష ద్వారా
-పేపర్-I-ప్రైమరీ స్టేజ్ (పీఆర్‌టీ): 6-11 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు (బోధించడానికి)
-రాతపరీక్ష సిలబస్: చైల్డ్ డెవలప్‌మెంట్&పెడగాగీ, లాంగ్వేజ్-1, లాంగ్వేజ్-2, మ్యాథమెటిక్స్, ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్ అంశాల నుంచి ప్రతి విభాగంలో ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 30 ప్రశ్నలు ఇస్తారు.
-పేపర్-II: ఎలిమెంటరీ స్టేజ్ (టీజీటీ): 11-14 ఏండ్ల పిల్లలకు బోధించడానికి.
-రాతపరీక్ష సిలబస్: చైల్డ్ డెవలప్‌మెంట్ &పెడగాగీ, లాంగ్వేజ్-1 , లాంగ్వేజ్-2 అంశాల నుంచి ప్రతి విభాగంలో ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 30 ప్రశ్నలు, మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ లేదా సోషల్ స్టడీస్/సోషల్ సైన్స్‌లో 60 ప్రశ్నలు ఇస్తారు.
-గమనిక: పేపర్-I-150 మార్కులు, పేపర్-II-150 మార్కులు. రాతపరీక్షకు కేటాయించిన సమయం: 180 నిమిషాలు.
-అప్లికేషన్ ఫీజు: జనరల్/ఓబీసీ అభ్యర్థులు-పేపర్-I లేదా పేపర్-II రూ.700/- (రెండు పేపర్లు-రూ.1200/-).
-ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులు-పేపర్-I లేదా పేపర్-II రూ.350/- (రెండు పేపర్లు-రూ.600/-)
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-రిజిస్ట్రేషన్‌కు చివరితేదీ: మార్చి 5
-అప్లికేషన్ ఫీజు చెల్లిండానికి చివరితేదీ: మార్చి 8 (మధ్యాహ్నం 3.30 గం॥ వరకు)
-పరీక్షతేదీ: జూలై 7 (పేపర్-I -ఉదయం 9.30 నుంచి 12 వరకు,
-పేపర్-II -మధ్యాహ్నం 2 నుంచి 4.30 వరకు)
-వెబ్‌సైట్: www.ctet.nic.in

1649
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles