ఎన్‌ఐఆర్‌టీలో ఖాళీలు


Wed,February 6, 2019 03:59 AM

nirt
చెన్నైలోని ఐసీఎంఆర్-నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ రిసెర్చ్ ఇన్ ట్యూబర్‌క్యులోసిస్ (ఎన్‌ఐఆర్‌టీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రాజెక్టు టెక్నీషియన్/అసిస్టెంట్
తదితర పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

- మొత్తం పోస్టులు: 575
- విభాగాలవారీగా : సైంటిస్ట్ సీ-23, ప్రాజెక్టు టెక్నికల్ ఆఫీసర్-69, ప్రాజెక్టు అసిస్టెంట్-46, ప్రాజెక్టు టెక్నీషియన్ (గ్రేడ్3)-161, డ్రైవర్ కమ్ మెకానిక్- 23, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ -46, ప్రాజెక్టు టెక్నీషియన్ (గ్రేడ్2)-161, సీనియర్ ప్రాజెక్టు అసిస్టెంట్-23 ఖాళీలు ఉన్నాయి.
- అర్హతలు: సైంటిస్ట్ సీ పోస్టులకు ఎంబీబీఎస్, ఎండీ/డీఎన్‌బీ/ఎంపీహెచ్/ఎంఏఈ లేదా ఎంబీబీఎస్+పీజీ డిప్లొమా, ప్రాజెక్టు టెక్నికల్ ఆఫీసర్/అసిస్టెంట్‌లకు సంబంధిత విభాగంలో డిగ్రీ/పీజీ, ప్రాజెక్టు టెక్నీషియన్ (గ్రేడ్2, గ్రేడ్3) పోస్టులకు పదోతరగతి/ఇంటర్, డీఎంఎల్‌టీ, బీఎస్సీ, డాటా ఎంట్రీ ఆపరేటర్/ సీనియర్ ప్రాజెక్టు అసిస్టెంట్ పోస్టులకు ఇంటర్‌తోపాటు టైపింగ్ నాలెడ్జ్. డ్రైవర్ కమ్ మెకానిక్ పోస్టులకు పదోతరగతి+డ్రైవింగ్ లైసెన్స్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు పదోతరగతి ఉత్తీర్ణత.
- వయస్సు: ప్రాజెక్టు టెక్నీషియన్ (గ్రేడ్2), డాటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు 28 ఏండ్లు, డ్రైవర్/ఎంటీఎస్ పోస్టులకు 25 ఏండ్లు, మిగతా పోస్టులకు 30 ఏండ్లకు మించరాదు.
- ఎంపిక: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా
- ఇంటర్వ్యూతేదీ: ఫిబ్రవరి 13 నుంచి 27 వరకు
- వెబ్‌సైట్: www.nirt.res.in

1102
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles