బీఎస్‌ఎఫ్‌లో 1763 ఖాళీలు


Wed,February 6, 2019 02:04 AM

Army
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్) దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న ట్రేడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

- పోస్టు పేరు: ట్రేడ్ కానిస్టేబుల్
- మొత్తం ఖాళీల సంఖ్య - 1763 (పురుషులు-1761, మహిళలు-2)
- విభాగాల వారీగా ఖాళీలు: కానిస్టేబుల్ (కాబ్లర్)-32, కానిస్టేబుల్ (టైలర్)-36, కానిస్టేబుల్ (కార్పెంటర్)-13, కానిస్టేబుల్ (కుక్)-561, కానిస్టేబుల్ (డ్రాఫ్ట్స్‌మెన్)-1, కానిస్టేబుల్ (పెయింటర్)-1, కానిస్టేబుల్ (వెయిటర్)-9, కానిస్టేబుల్ (స్వీపర్)-389, కానిస్టేబుల్ (డబ్ల్యూ/సీ)-320, కానిస్టేబుల్ (డబ్ల్యూ/ఎం)-253 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులన్నీ పురుషులకు మాత్రమే. మహిళా కానిస్టేబుల్ (టైలర్)-2 ఖాళీలు ఉన్నాయి.
- అర్హత: పదోతరగతితోపాటు రెండేండ్లపాటు సంబందిత ట్రేడ్ రంగంలో అనుభవం ఉండాలి లేదా ఇండస్ట్రియల్ ట్రెయినింగ్ ఇన్‌స్టిట్యూట్ నుంచి సంబంధిత ట్రేడ్‌లో రెండేండ్ల డిప్లొమా ఉత్తీర్ణత.
- వయస్సు: 2019, ఆగస్టు 1 నాటికి 18 - 23 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
- పే స్కేల్: రూ. 21,700-69,100/-(పే మ్యాట్రిక్స్ లెవల్ 3 ప్రకారం)
- శారీరక ప్రమాణాలు: ఎత్తు: పురుషులు-162. సెం.మీ., ఛాతీ: 76 సెం.మీ., గాలి పీల్చినప్పుడు కనీసం 5 సెం.మీ. వ్యాకోచించాలి .

- మహిళలు-150 సెం. మీ ఎత్తు ఉండాలి.
- బరువు: వైద్య ప్రమాణాల ప్రకారం ఎత్తు, వయస్సుకు దామాషాగా ఉండాలి.
- ఎంపిక: రాతపరీక్ష, పీఎస్‌టీ/పీఈటీ, ట్రేడ్ టెస్ట్ ద్వారా
- ఎంపిక రెండు దశల్లో జరుగుతుంది. రాతపరీక్షలో మొత్తం 100 ప్రశ్నలు-100 మార్కులు.2 గంటల కాలవ్యవధిలో పూర్తిచేయాలి.
- మొదటి దశ రాతపరీక్షలో జనరల్ అవేర్‌నెస్/జనరల్ నాలెడ్జ్, నాలెడ్జ్ ఆఫ్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లిష్/హిందీ, అనలిటికల్ ఆప్టిట్యూడ్ సబ్జెక్ట్‌ల నుంచి ప్రశ్నలను ఇస్తారు.
- రెండోదశ-పీఎస్‌టీ/పీఈటీ, ట్రేడ్ టెస్ట్, ఫైనల్ మెడికల్ ఎగ్జామ్ టెస్ట్.
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- చివరితేదీ: ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ (ఫిబ్రవరి 2-8)లో వెలువడిన తేదీ నుంచి 30 రోజుల్లోగా దరఖాస్తులను పంపాలి.
- వెబ్‌సైట్: http://bsf.nic.in

1003
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles