క్లాట్-2019


Thu,January 10, 2019 01:06 AM

దేశవ్యాప్తంగా ఉన్న నేషనల్ లా యూనివర్సిటీల్లో డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్)-2019 నోటిఫికేషన్ విడుదలైంది.
CLAT-2019
-పరీక్ష పేరు: కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్)
-విద్యాసంవత్సరం: 2019-20
-కోర్సులు: డిగ్రీ, పీజీ
-ప్రవేశాలు కల్పించే ఎన్‌ఎల్‌యూలు: బెంగళూరు, హైదరాబాద్ (నల్సార్), భోపాల్, కోల్‌కతా, జోధ్‌పూర్, రాయ్‌పూర్, గాంధీనగర్, లక్నో, పంజాబ్, పాట్నా, కోచి, ఒడిశా, రాంచీ, అసోం, విశాఖపట్నం, తిరుచిరాపల్లి, ముంబై, నాగ్‌పూర్, ఔరంగాబాద్.
-మొత్తం 19 ఎన్‌ఎల్‌యూలు ప్రవేశాలు కల్పిస్తాయి. క్లాట్ స్కోర్‌తో ఇటీవల కాలంలో కొన్ని సంస్థలు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయి.
-అర్హతలు: డిగ్రీ కోర్సులకు- కనీసం 45 శాతం మార్కులతో ఇంటర్ లేదా 10+2 లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు అయితే 40 శాతం మార్కులతో ఉత్తీర్ణత. మార్చిలో ఇంటర్ ద్వితీయసంవత్సరం పరీక్షలు రాస్తున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
-పీజీ కోర్సులకు-కనీసం 55 శాతం మార్కులతో ఎల్‌ఎల్‌బీ/ఐదేండ్ల ఎల్‌ఎల్‌బీ (ఆనర్స్) లేదా తత్సమానకోర్సు ఉత్తీర్ణత. ఏప్రిల్/మేలో చివరి సంవత్సరం పరీక్షలు రాస్తున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
-వయస్సు: యూజీ, పీజీ కోర్సులకు ఎటువంటి గరిష్ఠ వయోపరిమితి లేదు.
-ఎంపిక: క్లాట్
-పరీక్ష విధానం: ఇంగ్లిష్, లీగల్ ఆప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, జీకే, కరెంట్ అఫైర్స్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, న్యూమరికల్ ఎబిలిటీపై ప్రశ్నలు ఇస్తారు.
-ఆఫ్‌లైన్ రాతపరీక్ష
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో జనవరి 10 నుంచి ప్రారంభం
-చివరితేదీ: మార్చి 31
-క్లాట్ పరీక్ష తేదీ: మే 12
-వెబ్‌సైట్: http://www.clat.ac.in

851
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles