ఆదివారం 07 మార్చి 2021
Nipuna-education - Sep 27, 2020 , 15:15:28

ఏపీలో 123 ఎస్ఐ పోస్టులు

ఏపీలో 123 ఎస్ఐ పోస్టులు

హైద‌రాబాద్‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఖాళీగా ఉన్న 123 స‌బ్ ఎన్‌స్పెక్ట‌ర్ (ఎస్ఐ) పోస్టుల భ‌ర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఆస‌క్తి క‌లిగిన అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సూచించింది. దేహ‌దారుఢ్య ప‌రీక్ష‌, రాత ప‌రీక్ష ద్వారా నియామ‌కాలు చేప‌డుతామ‌ని వెల్ల‌డించింది. 

మొత్తం పోస్టులు: 123

ఇందులో ఎస్ఐ (సివిల్‌)-120, ఎస్ఐ (ఐఆర్‌బీ)-3 పోస్టులు ఉన్నాయి. 

అర్హ‌త‌: గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసిన‌వారై ఉండాలి.

ఎత్తు: 152 సెంటీమీట‌ర్లు. ఏపీ కానివారికి 165 సెం.మీ. మ‌హిళ‌ల‌కు 152 సెం.మీ., ఏపీయేత‌రుల‌కు 157 సెం.మీ.

ఛాతీ:  సాధార‌ణంగా 79 సెం.మీ., ఊపిరి పీల్చిన‌ప్పుడు 84 సెం.మీ. ఉండాలి (పురుషుల‌కు).

ఎంపిక విధానం: ఫిజిక‌ల్ ఎఫిసియెన్సీ టెస్ట్‌, ఫిజిక‌ల్ స్టాండ‌ర్డ్ టెస్ట్‌, రాత‌ప‌రీక్ష‌

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో

ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ.100, ఏపీ కానివారికి రూ.100

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేదీ: న‌వంబ‌ర్ 6

వెబ్‌సైట్‌: appsc.gov.in  


VIDEOS

logo