హైదరాబాద్: ప్రభుత్వరంగ సంస్థ అయిన లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ (ఎల్పీఎస్సీ) అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. గ్రాడ్యుయేట్, డిప్లొమా చేసినవారు కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ దరఖాస్తులు ఈనెల 20 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈనోటిఫికేషన్ ద్వారా మొత్తం 160 అప్రెంటిస్షిప్లను అందిస్తున్నది. ఇందులో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటిస్‌లు ఉన్నాయి. ఎంపికైనవారు కేరళలోని తిరువనంతపురంలో పనిచేయాల్సి ఉంటుంది.
మొత్తం ఖాళీలు: 160
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ 73 (మెకానికల్ ఇంజినీరింగ్ 40, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ 7, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ 8, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్ 2, కెమికల్ ఇంజినీరింగ్ 1, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ 5, సివిల్ ఇంజినీరింగ్ 4, లైబ్రెరీ సైన్స్ 6), డిప్లొమా అప్రెంటిస్ 87 (మెకానికల్ ఇంజినీరింగ్ 53, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ 7, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ 4, సివిల్ ఇంజినీరింగ్ 6, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ 5, ఆటోమొబైల్ ఇంజినీరింగ్ 2, కెమికల్ ఇంజినీరింగ్ 1) చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హత: సంబంధిత ట్రేడ్‌లో ఇంజినీరింగ్, డిప్లొమాలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులై ఉండాలి.
శిక్షణ: ఏడాది
ఎంపిక ప్రక్రియ: అకడమిక్ ఇయర్లో వచ్చిన మార్కుల ఆధారంగా. మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులను శిక్షణకు ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: జూలై 20
వెబ్సైట్: http://www.boat-srp.com