బుధవారం 21 అక్టోబర్ 2020
Nipuna-education - Oct 01, 2020 , 10:49:44

ఏపీ గ్రామ సచివాలయ పరీక్ష ప్రాథమిక కీ విడుదల

ఏపీ గ్రామ సచివాలయ పరీక్ష ప్రాథమిక కీ విడుదల

అమరావతి: గత నెలలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్‌ గ్రామ సచివాయ పరీక్ష ప్రాథమిక కీని ఏపీపీఎస్సీ విడుదల చేసింది. అభ్యర్థులకు ఏవైన అభ్యంతరాలు ఉంటే ఈ నెల 3లోపు చెప్పాలని సూచించింది. రాష్ట్రంలోని గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న 16,208 పోస్టుల భర్తీకి సంబంధించిన పరీక్షలు సెప్టెంబర్‌ 20 నుంచి 26 వరకు జరిగాయి. పరీక్ష పూర్తివగానే ఆన్సర్‌ కీని ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) విడుదల చేసింది. అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల దాన్ని వెనక్కి తీసుకుంటున్నామని సెప్టెంబర్‌ 29న ప్రకటించింది. తొందర్లోనే మరో కీని విడుదల చేస్తామని వెల్లడించింది. ఈ మేరకు తాజాగా ఆన్సర్‌ కీని విడుదల చేసింది. అభ్యర్థులు ఆన్సర్‌ కీని అధికారిక వెబ్‌సైట్‌ http://gramasachivalayam.ap.gov.inలో చూసుకోవచ్చని తెలిపింది. 

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయాల్లో మొదటి విడత ఉద్యోగాల భర్తీ గతేడాది పూర్తైంది. అయితే ఉద్యోగాల్లో చేరినవారు మానెయ్యడం, ఉద్యోగాల్లో చేరకపోవడంతో 16,208 ఖాళీలు ఏర్పడ్డాయి. వీటి భర్తీ ప్రక్రియ ఇప్పుడు కొనసాగుతోంది. ఇప్పటికే పరీక్షలు పూర్తవగా, ఫలితాల విడుదలవ్వాల్సి ఉంది. తర్వాత ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు.


logo