హైదరాబాద్: బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ (బీఏ, బీకాం, బీఎస్సీ), పీజీ (బీఎల్ఐఎస్సీ, ఎంఎల్ఐఎస్సీ, పీజీ డిప్లొమా, సర్టిఫికెట్) కోర్సుల్లో ప్రవేశాల గడువును 18వ తేదీవరకు పొడిగించింది. ఆలస్య రుసుము రూ.200తో 18లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. వివరాల కోసం www.braouonline.inలో, 73829 29570/580, 040-23680290/291/294/295 ఫోన్ నెంబర్లపై సంప్రదించవచ్చని వెల్లడించింది.
బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం, రాజస్థాన్ రాష్ట్రం కోటాలోని వర్ధమాన్ మహావీర్ సార్వత్రిక విశ్వవిద్యాలయాలు.. డిగ్రీ కోర్సుల మెటీరియల్ను పరస్పరం ఇచ్చిపుచ్చుకునేందుకు అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి.