శనివారం 30 మే 2020
Nipuna-education - Mar 28, 2020 , 15:32:06

ఇంటి నుంచే ఇంట‌ర్న్‌షిప్ చేయండి - ఏఐసీటీఈ

ఇంటి నుంచే ఇంట‌ర్న్‌షిప్ చేయండి - ఏఐసీటీఈ

దేశంలోని అన్ని సాంకేతిక సంస్థ‌లు/కాలేజీలు ఆయా సంస్థ‌ల్లో  చదువుతున్న  విద్యార్థుల‌ను ఇత‌ర సంస్థ‌లు ఆర్గ‌నైజేష‌న్‌ల‌లో  స‌మ్మ‌ర్ ఇంట‌ర్న్‌షిప్‌కు పంప‌వ‌ద్ద‌ని ఏఐసీటీఈ సూచించింది. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫ‌ర్ టెక్నిక‌ల్ ఎడ్యుకేష‌న్ (ఏఐసీటీఈ) ప‌రిధిలోని సంస్థ‌ల‌న్నింటికి ఈ స‌మాచారాన్ని ట్విట్ట‌ర్ ద్వార తెలిపింది. ఆయా కాలేజీలు త‌మ విద్యార్థుల‌కు ఇంటి నుంచి చేయ‌గ‌లిగే ఇంట‌ర్న్‌షిప్‌ల‌ను మాత్ర‌మే ఇవ్వాల‌ని తెలిపింది. ఇప్ప‌టికే వేరే సంస్థ‌ల‌లో  స‌మ్మ‌ర్ ఇంట‌ర్న్‌షిప్ చేస్తున్న‌వారు ఉంటే వారికి కూడా ఇంటి నుంచే ఆ ఇంట‌ర్న్‌షిప్ చేసేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరింది. అయితే ఈ విష‌యమై ప‌లువురు విద్యార్థులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఇంట‌ర్న్‌షిప్ కోసం తాము ఎంతో క‌ష్ట‌ప‌డి  ప‌లు ఇంట‌ర్వ్యూల‌ను సాధిస్తే వాటిని వ‌ద్ద‌న‌డం స‌బ‌బు కాద‌ని వాపోతున్నారు. అవ‌స‌రమైతే మ‌రికొంత కాలం ఇంట‌ర్న్‌షిప్ పొడిగించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని వారు ఏఐసీటీఈని విజ్ఞ‌ప్తి చేస్తున్నారు. 


logo