హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (సీపెట్) లో డిప్లొమా, పోస్టు డిప్లొమా, పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. మూడేండ్ల వ్యవధి కలిగిన డీపీటీ, డీపీఎంటీ కోర్సులతోపాటు రెండేండ్ల వ్యవధిగల పీజీడీ-పీపీటీ, ఏడాదిన్నర వ్యవధి కలిగిన పీడీ-పీఎండీ కోర్సులను అందిస్తున్నది. ఈ కోర్సుల్లో ప్రవేశాల కోసం అభ్యర్థులు ఈ నెల 25లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. వివరాలకు 9677256436/ 9445035650/ 8374064444లో సంప్రదించాలని కోరారు.
అందిస్తున్న కోర్సులు
డిప్లొమా ఇన్ ప్లాస్టిక్ టెక్నాలజీ (డీపీటీ)
డిప్లొమా ఇన్ ప్లాస్టిక్ మౌల్డ్ టెక్నాలజీ (డీపీఎంటీ)
పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ప్లాస్టిక్ ప్రాసెసింగ్ అండ్ టెస్టింగ్ (పీజీడీ-పీపీటీ)
పీడీ-పీఎండీ
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: జూలై 25
వెబ్సైట్: https://cipet.onlineregistrationform.org/CPIT/ లేదా cipethy-dtrg@yahoo.com