కొండాపూర్:గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ది సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ వర్చువల్ లర్నింగ్ (సీడీవీఎల్) ఆధ్వర్యంలో సంవత్సర కాల వ్యవధితో కొనసాగనున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లర్నింగ్ ప్రోగ్రామ్‌కు దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు వర్సిటీ యాజమాన్యం గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కోర్సును వర్కింగ్ ప్రోఫెషనల్స్ కోసం రూపొందించారని, ముఖ్యంగా ఇంజనీర్లు,సాఫ్ట్వేర్ అండ్ ఐటీ ప్రొఫెషనల్స్, మార్కెటింగ్ అండ్ సేల్స్ ప్రొఫెషనల్స్, మేనేజర్ల కోసం రూపొందించినట్లు తెలిపారు.
గ్రాడ్యుయేట్ పూర్తి చేసుకున్న వారు కోర్సుకు దరఖాస్తు చేసుకోవచ్చని, ఏదైన గుర్తింపు పొందిన ఇనిస్టిట్యూషన్ నుంచి డిగ్రీ పొంది ఉండాలని, 10+2లో ఖచ్చితంగా మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్‌లను అభ్యసించి ఉండాలన్నారు. దూర విద్యలో కొనసాగే ఈ కోర్సును రెండు సెమిస్టర్లుగా విభజించినట్లు తెలిపారు. తరగతులు పూర్తిగా ఆన్లైన్లోనే కొనసాగుతాయని, 5 సబ్జెక్టులు, ప్రాజెక్ట్ వర్క్, మొత్తం 43 క్రెడిట్స్ ఉంటాయని తెలిపారు.
ఇందులో ఏఐ, డాటా అనలైసిస్, విజువలైజేషన్, మెషిన్ లర్నింగ్, అడ్వాన్స్డ్ మెషిన్ లర్నింగ్, డీప్ లర్నింగ్ అంశాలు ఉంటాయని తెలిపారు. దరఖాస్తులను www.appliedroots.com వెబ్ సైట్ ద్వారా పూర్తి చేసి రిజిస్ట్రేషన్ ఫీజు రూ. 300లను చెల్లించాలన్నారు. ఇతర వివరాల కొరకు pgduoh@appliedroots.com లేదా 8080806983, 040 -24600264 నెంబర్ల ద్వారా సంప్రదించవచ్చన్నారు. దరఖాస్తులకు సెప్టెంబర్ 5వ తేదీ చివరి తేదీగా తెలిపారు.