సోమవారం 26 అక్టోబర్ 2020
Nipuna-education - Aug 22, 2020 , 15:44:18

నైవేలీ లిగ్నైట్ కార్పొరేష‌న్‌లో అప్రెంటిస్‌లు

నైవేలీ లిగ్నైట్ కార్పొరేష‌న్‌లో అప్రెంటిస్‌లు

న్యూఢిల్లీ: ప‌్ర‌భుత్వరంగ సంస్థ అయిన నైవేలీ లిగ్నైట్ కార్పొరేష‌న్ లిమిటెడ్ (ఎన్ఎల్‌సీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న‌ అప్రెంటిస్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హులైన‌, ఆస‌క్తి క‌లిగిన అభ్య‌ర్థులు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సూచించింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా 75 అప్రెంటిస్ ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నుంది. 

మొత్తం అప్రెంటిస్‌లు: 75

ఇందులో ఫిట్ట‌ర్ ఫ్రెష‌ర్‌- 20 ఖాళీలు, ఎల‌క్ట్రిష‌న్‌- 20, వెల్డ‌ర్‌- 20, మెడిక‌ల్ ల్యాబ్ టెక్నీషియ‌న్ (పాథాల‌జీ)- 10, మెడిక‌ల్ ల్యాబ్ టెక్నీషియ‌న్ (రేడియాల‌జీ)- 5 చొప్పున ఉన్నాయి. 

అర్హ‌త‌లు: ప‌దో త‌ర‌గ‌తి ఉత్తీర్ణులై, సంబంధిత ట్రేడ్‌లో రెండేండ్ల‌ ఐటీఐ పూర్తిచేసి ఉండాలి. 

స్త‌యిఫండ్‌: నెల‌కు రూ.8,766 నుంచి రూ.10,019

ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ‌: ఆన్‌లైన్‌లో

ద‌ర‌ఖాస్తులు ప్రారంభం: ఆగ‌స్టు 25

ఆన్‌లైన్ రిజిస్ట్రేష‌న్ల‌కు చివ‌రి తేదీ: సెప్టెంబ‌ర్ 10  

వెబ్‌సైట్‌: www.nlcindia.com


logo