బుధవారం 28 అక్టోబర్ 2020
Nipuna-education - Sep 19, 2020 , 11:18:47

ఎన్‌జీఆర్ఐలో 66 పోస్టులు.. ఇంట‌ర్వ్యూ ద్వార భ‌ర్తీ

ఎన్‌జీఆర్ఐలో 66 పోస్టులు.. ఇంట‌ర్వ్యూ ద్వార భ‌ర్తీ

హైదరాబాద్: న‌గ‌రంలోని‌ ఉప్పల్‌లో ఉన్న నేషనల్‌ జియోఫిజికల్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎన్‌జీఆర్‌ఐ)లో ఖాళీగా ఉన్న ప్రాజెక్ట్ అసోసియేట్‌, ప్రాజెక్ట్ సైంటిస్ట్‌, ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల‌య్యింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా 66 పోస్టులను భర్తీ చేయ‌నుంది. ఆస‌క్తి క‌లిగిన అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సూచించింది. ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తులు సెప్టెంబ‌ర్ 25 వ‌ర‌కు అందుబాటులో ఉంటాయ‌ని వెల్ల‌డించింది. 

మొత్తం పోస్టులు: 66 

ఇందులో ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ 45, ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌ 18, ప్రాజెక్ట్‌  అసిస్టెంట్ 3 ఖాళీల చొప్పున ఉన్నాయి. 

అర్హ‌త‌: స‌ంబంధిత స‌బ్జెక్టులో డిగ్రీ లేదా పీజీ లేదా పీహెచ్‌డీ చేసి ఉండాలి. అనుభ‌వం త‌ప్ప‌నిస‌రి. 35 నుంచి 50 ఏండ్ల లోపు వ‌య‌స్సు క‌లిగిన‌వారై ఉండాలి. 

ఎంపిక విధానం: ఇంట‌ర్వ్యూ ద్వారా 

ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ‌: ఆన్‌లైన్‌లో

అప్లికేష‌న్ల‌కు చివ‌రితేదీ: సెప్టెంబ‌ర్ 25

వెబ్‌సైట్‌: www.ngri.org.in


logo