న్యూఢిల్లీ: కేంద్ర ఇంధన శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న టాటా మెమోరియల్ సెంటర్ (టీఎంసీ)లో సీనియర్ రెసిడెంట్లు, మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఈనెల 28లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థంగా ఎంపికచేయనుంది.
మొత్తం పోస్టులు: 64
ఇందులో సీనియర్ రెసిడెంట్ అనస్థీషియాలజీ 7, బయోకెమెస్ట్రీ 2, డెంటల్ అండ్ ప్రొస్థటిక్స్ సర్జరీ 1, హెడ్ అండ్ నెక్ ఆంకాలజీ 4, హెమటోపాథాలజీ 2, మెడికల్ ఆఫీసర్ మెడికల్ ఆంకాలజీ 7, మైక్రోబయాలజీ 2, న్యూక్లియర్ మెడిసిన్ 2, పల్లియటివ్ మెడిసిన్ 2, పాథాలజీ 7, పీడియాట్రిక్ ఆంకాలజీ 7, పీడియాట్రిక్ సర్జికల్ ఆంకాలజీ 1, ప్రివెంటివ్ ఆంకాలజీ 2, రేడియేషన్ ఆంకాలజీ 7, రేడియో డయాగ్నోసిస్ 6, సర్జికల్ ఆంకాలజీ 7, ట్రాన్స్ఫ్యూషన్ మెడిసిన్ 2 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: ఒక్కో పోస్టుకు ఒక్కో విధంగా ఉన్నాయి. సంబంధిత విభాగంలో ఎండీ, డీఎన్బీ చేసి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 28
వెబ్సైట్: https://tmc.gov.in