గురువారం 29 అక్టోబర్ 2020
Nipuna-education - Sep 18, 2020 , 13:15:36

మిధానిలో అసిస్టెంట్ పోస్టులు.. అక్టోబ‌ర్ 3న వాక్‌-ఇన్‌

మిధానిలో అసిస్టెంట్ పోస్టులు.. అక్టోబ‌ర్ 3న వాక్‌-ఇన్‌

హైద‌రాబాద్‌: ప‌్ర‌భుత్వ‌రంగ సంస్థ మిశ్ర ధాతు నిగ‌మ్ లిమిటెడ్ (మిధాని) ఖాళీగా ఉన్న అసిస్టెంట్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. వీటికి సంబంధించి ఇంట‌ర్వూలు వ‌చ్చేనెల 3న జ‌రుగుతాయ‌ని, ఆస‌క్తి, అనుభ‌వం క‌లిగిన అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సూచించింది. 

పోస్టుపేరు: అసిస్టెంట్‌

మొత్తం పోస్టులు: 23

అర్హ‌త‌: 60 శాతం మార్కుల‌తో ‌మెట‌ల‌ర్జిక‌ల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా పూర్తిచేయాలి. ఏడాది అనుభ‌వంతోపాటు, 35 ఏండ్లలోపు వ‌య‌స్సు క‌లిగిన‌వారై ఉండాలి. 

ఎంపిక విధానం: ఇంట‌ర్వ్యూ ఆధారంగా

ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌. ఇంట‌ర్వ్యూ రోజున సంబంధిత స‌ర్టిఫికెట్ల‌తో హాజ‌రుకావాల్సి ఉంటుంది. 

ఇంట‌ర్వ్యూ తేదీ: అక్టోబ‌ర్ 3న‌

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: midhani-india.in   ‌


logo