Nipuna-education
- Jan 24, 2021 , 02:42:22
VIDEOS
త్రివిధ దళాల్లో కొలువులు

రక్షణ దళాలు.. దేశ రక్షణలో కీలకపాత్ర పోషించే ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లలో ఇటీవల వందలాది ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ విడుదలయ్యాయి. త్వరలో మరికొన్ని రానున్నాయి. వీటితోపాటు రాష్ట్రంలో మార్చి నెలలో ఆర్మీ ర్యాలీ నిర్వహించున్నారు. మంచి శరీరదారుఢ్యం కలిగి ఇంటర్, డిగ్రీ, పీజీ చదివిన విద్యార్థులకు ఇదొక సువర్ణ అవకాశం. ఆయా ప్రకటనల వివరాలు సంక్షిప్తంగా నిపుణ పాఠకుల కోసం...
ఆర్మీలో జేసీఓ పోస్టులు
- ఇండియన్ ఆర్మీ ఆర్ఆర్టీ 91, 92, 93, 94, 95 కోర్సుల ద్వారా జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్లు (రిలీజియస్ టీచర్ల) నియామకప్రకటనను ఆర్మీ విడుదల చేసింది.
- మొత్తం ఖాళీలు: 194
- పోస్టు: పండిట్- 171 ఖాళీలు
- అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు హిందు అభ్యర్థులు సంస్కృతంలో ఆచార్య అర్హత ఉండాలి.
- పోస్టు: పండిట్ (గోర్ఖా-గోర్ఖా రెజిమెంట్స్ కోసం)- 9 ఖాళీలు
- అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు హిందూ అభ్యర్థులు సంస్కృతంలో ఆచార్య అర్హత ఉండాలి.
- పోస్టు: గ్రంథి- 5 ఖాళీలు
- అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు సిక్కు అభ్యర్థులకు పంజాబీలో గ్యానీ అర్హత ఉండాలి.
- పోస్టు: మౌల్వి (సున్నీ)- 5 ఖాళీలు
- అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ముస్లిం అభ్యర్థులకు అరబిక్‌లో మౌల్వీ అలీం/ ఉర్దూలో అదిబ్ అలీం అర్హత ఉండాలి.
- పోస్టు: మౌల్వి (షియా) లద్ధాఖ్ స్కౌట్స్-1 ఖాళీ
- అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ముస్లింలకు అరబిక్‌లో మౌల్వీ అలీం/ ఉర్దూలో అదిబ్ అలీం అర్హత ఉండాలి.
- పోస్టు: పాడ్రే- 2 ఖాళీలు
- అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు స్థానిక బిషప్‌గా ఆమోదం పొంది ప్రస్తుతం ఆ పనిలో కొనసాగుతూ ఉండాలి.
- పోస్టు: బోధ్ సన్యాసి (మహాయాన) లద్ధాఖ్ స్కౌట్స్ కోసం-1
- అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు బోధ్ సన్యాసిగా గుర్తింపు పొంది, కాన్సా/ లోపాన్/ రబ్‌జాంలో పీహెచ్డీ సర్టిఫికెట్ ఉండాలి.
- వయస్సు: సివిలియన్, ఇన్-సర్వీస్ అభ్యర్థులకు సంబంధించి వయస్సు 2021, అక్టోబర్ 1 నాటికి 25-34 ఏండ్ల మధ్య ఉండాలి. అంటే 1987 అక్టోబర్ 1- 1996 సెప్టెంబర్ 30 మధ్య జన్మించి ఉండాలి.
- ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, ఫిజికల్ స్టాండర్డ్ అండ్ ఫిట్నెస్ టెస్ట్, వైద్యపరీక్షల ద్వారా
దరఖాస్తు: ఆన్లైన్లో చివరితేదీ: ఫిబ్రవరి 9
పరీక్షతేదీ: జూన్ 27
వెబ్సైట్: http://joinindianarmy.nic.in
ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ
- ఇండియన్ ఆర్మీ షార్ట్ సర్వీస్ కమిషన్ విధానంలో ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ పోస్టులకు ప్రకటన విడుదల చేసింది.
- పోస్టు: ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ
- మొత్తం ఖాళీలు: 55. వీటిలో 50 పురుషులకు, 5 మహిళలకు కేటాయించారు. ఈ రెండు విభాగాల్లోనూ 6 (పురుషులు 5, మహిళలు
- అర్హత: కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. ప్రస్తుతం ఆఖరు సంవత్సరం కోర్సులు చదువుతున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు. మూడు అకడమిక్ సంవత్సరాలు ఎన్సీసీ సీనియర్ డివిజన్ వింగ్‌లో కొనసాగి ఉండాలి.
- వయస్సు: జనవరి 1 నాటికి 19 నుంచి 25 ఏండ్లలోపు ఉండాలి.
- దరఖాస్తు: ఆన్లైన్లో..
చివరితేదీ: జనవరి 28 (మధ్యాహ్నం 3 వరకు)
వెబ్సైట్: http://www.joinindianarmy.nic.in
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్)లో ఎయిర్‌మెన్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
- పోస్టు: ఎయిర్ మెన్
- విభాగాలు: గ్రూప్-ఎక్స్ (ఎడ్యుకేషన్ ఇన్స్ట్రక్టర్ ట్రేడ్ మినహాయించి), గ్రూప్-వై (ఐఏఎఫ్(ఎస్) & మ్యూజీషియన్ ట్రేడ్ మినహాయించి), గ్రూప్-వై (మెడికల్ అసిస్టెంట్ ట్రేడ్)
- అర్హత: ఇంటర్ ఉత్తీర్ణత. పూర్తి వివరాలు సైట్లో చూడవచ్చు.
- వయస్సు: 21 ఏండ్లు మించరాదు.
- ఎంపిక: శరీర దారుఢ్య పరీక్ష, వైద్యపరీక్ష, ఆన్లైన్ టెస్ట్ ఆధారంగా
దరఖాస్తు: ఆన్లైన్లో చివరితేదీ: ఫిబ్రవరి 7
వెబ్సైట్: https://indianairforce.nic.in
సికింద్రాబాద్‌లో ఆర్మీ ర్యాలీ
- హకీంపేటలోని తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్లో రాష్ట్ర అభ్యర్థుల కోసం ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహించనున్నారు.
- పోస్టులు: సోల్జర్- టెక్నికల్, టెక్నికల్ (ఏవియేషన్/అమ్యునిషన్ ఎగ్జామినర్), టెక్నికల్ నర్సింగ్ అసిస్టెంట్, జనరల్ డ్యూటీ, ట్రేడ్స్‌మెన్, క్లర్క్/స్టోర్ కీపర్ టెక్నికల్.
- అర్హతలు: వేర్వేరు పోస్టులకు వేర్వేరుగా ఉన్నాయి. ఎనిమిదోతరగతి నుంచి ఇంటర్ చదివిన వారికి అవకాశం ఉంది.
- ఎంపిక: ఫిజికల్ ఫిట్‌నెస్ట్ టెస్ట్, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, వైద్యపరీక్షలు, కామన్ రిటన్ ఎగ్జామ్ ద్వారా
- ర్యాలీ తేదీలు: మార్చి 5 నుంచి మార్చి 24 వరకు
దరఖాస్తు: ఆన్లైన్లో చివరితేదీ: ఫిబ్రవరి 17
వెబ్సైట్: http://joinindianarmy.nic.in
తాజావార్తలు
- పశ్చిమ బెంగాల్లో ఇద్దరు మాజీ పోలీసుల ‘టగ్ ఆఫ్ వార్’
- టీఆర్ఎస్ అభ్యర్థి పల్లాకే పీఆర్టీయూ మద్దతు
- మంచు మనోజ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడా..?
- సెకండ్ డోస్ తీసుకున్నాక.. కరోనా సోకింది..!
- మమతపై సువెందు పోటీ.. 57 మందితో బీజేపీ తొలి జాబితా
- ఆర్ఎంపీ ఇంట్లో దొరికిన రూ. 66 లక్షలు సీజ్..
- మళ్లీ మోగింది ‘ప్రైవసీ’ గంట: వాట్సాప్ న్యూ రిమైండర్లు
- అదే జరిగితే వందేళ్లు వెనక్కి : మంత్రి హరీశ్‌రావు
- అనుష్క తర్వాతి సినిమాలో హీరో ఆ కుర్రాడా?
- టీఎంసీలో టికెట్ నిరాకరణ.. బీజేపీలో చేరుతానంటున్న సొనాలీ గుహా
MOST READ
TRENDING