బుధవారం 03 మార్చి 2021
Nipuna-education - Jan 24, 2021 , 02:44:44

ప్రపంచ హిందీ దినోత్సవం ఏ రోజున నిర్వహిస్తారు?

ప్రపంచ హిందీ దినోత్సవం ఏ రోజున నిర్వహిస్తారు?

1. కింది వాక్యాలను పరిశీలించండి (సి)

1. సుభాష్‌ చంద్రబోస్‌ 125వ జయంతి ఉత్సవాలకు ఏర్పాటైన కమిటీకి నరేంద్రమోదీ నేతృత్వం వహిస్తారు

2. సుభాష్‌ చంద్రబోస్‌ 125వ జయంతి ఉత్సవాలకు ఏర్పాటైన కమిటీకి అమిత్‌ షా నేతృత్వం వహిస్తారు

3. సుభాష్‌ చంద్రబోస్‌ ఎప్పుడూ ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌లో లేరు

4. ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌కు సుభాష్‌ చంద్రబోస్‌కు నేతృత్వం వహించారు

  పై వాక్యాల్లో సరైనవి ఏవి?

ఎ) 2, 3    బి) 2,  4 

సి) 1, 4  డి) 2, 3, 4

వివరణ: సుభాష్‌ చంద్రబోస్‌ స్వతంత్ర పోరాట యోధుడు. ఆయన జనవరి 23, 1897లో కటక్‌లో జన్మించారు. ఈ ఏడాది 125వ జయంతి. ఈ సందర్భంగా ఏడాది పాటు జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఇందుకు ప్రధాని మోదీ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. అమిత్‌ షా, నిర్మలా సీతారామన్‌, రాజ్‌నాథ్‌ సింగ్‌ తదితర కేబినెట్‌ మంత్రులతో సహా మమత బెనర్జీ, పశ్చిమబెంగాల్‌ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్‌ భట్టాచార్య, ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌తో సంబంధం ఉన్న వ్యక్తులు, మొత్తం 85 మంది ఈ కమిటీలో ఉంటారు.

2. కింది వాక్యాలను పరిశీలించండి? (డి)

1. వీధి వ్యాపారులకు సంబంధించిన ప్రధాన మంత్రి ఆత్మనిర్భర్‌ పథకం అమలులో దేశంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది

2. లక్ష జనాభా కలిగిన పురపాలక సంఘాల కేటగిరీలో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది

3. పది లక్షల లోపు జనాభా కలిగిన నగరాల జాబితాలో దేశంలో వరంగల్‌ అగ్రస్థానంలో ఉంది

4. 40 లక్షలకు మించి జనాభా కలిగిన మెగాసిటీల కేటగిరీలో హైదరాబాద్‌ మహా నగర పాలక సంస్థ దేశంలోనే తొలిస్థానంలో ఉంది

     పై వాక్యాల్లో సరైనవి ఏవి

ఎ) 1, 4    బి) 2, 3, 4  

సి) 1, 3  డి) 1, 2, 3, 4

వివరణ: వీధి వ్యాపారులకు సంబంధించి ప్రధాన మంత్రి ఆత్మనిర్భర్‌ పథకం అమలులో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. ఈ పథకం అమలులో లక్షలోపు జనాభా కలిగిన పురపాలక సంఘాల కేటగిరీలో మొదటి పది తెలంగాణ రాష్ర్టానికి చెందినవే. అలాగే పది లక్షలలోపు జనాభా కలిగిన నగరాల జాబితాలో దేశంలో వరంగల్‌ తొలి స్థానంలో నిలిచింది. 40 లక్షలకు మించిన జనాభా కలిగిన మెగాసిటీల కేటగిరీలో హైదరాబాద్‌ మహా నగరపాలక సంస్థ దేశంలోనే తొలిస్థానంలో ఉంది.

3. జతపరచండి (సి)

1. ప్రవాస భారతీయ దినోత్సవం   

ఎ. జనవరి 15

2. జాతీయ యువ దినోత్సవం    

బి. జనవరి 12

3. సైనిక దినోత్సవం         

సి. జనవరి 9

ఎ) 1-ఎ, 2-బి, 3-సి

బి) 1-సి, 2-ఎ, 3-సి

సి) 1-సి, 2-బి, 3-ఎ

డి) 1-ఎ, 2-సి, 3-బి

వివరణ: జనవరి 9న భారత్‌లో ప్రవాస భారతీయ దినోత్సవం నిర్వహిస్తారు. 1915 మహాత్మాగాంధీ జనవరి 9న దక్షిణాఫ్రికా నుంచి స్వదేశానికి తిరిగొచ్చి జాతీయ ఉద్యమంలో పాల్గొన్నారు. అందుకే ఈ రోజును ప్రవాస భారతీయ దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. 2003లో ఇది ప్రారంభమయ్యింది. అయితే 2015 నుంచి రెండేండ్లకు ఒకసారి నిర్వహిస్తున్నారు. జనవరి 12న స్వామి వివేకానంద జయంతి. ఆయన ఇచ్చిన సందేశాలు యువతకు స్ఫూర్తి కలిగిస్తుండటంతో ఆ రోజున జాతీయ యువజన దినోత్సవం నిర్వహిస్తారు. 1949, జనవరి 15న తొలిసారిగా భారతీయుడు సైన్యాధిపతి పదవి చేపట్టడంతో ఆ రోజున సైనిక దినోత్సవంగా నిర్వహిస్తారు. నాడు కమాండర్‌ ఇన్‌ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించింది కేఎం కరియప్ప.

4. భద్రతా మండలిలో కింద పేర్కొన్న ఏ కమిటీకి భారత్‌ సారథ్యం వహించనుంది? (డి)

ఎ) తాలిబన్‌ ఆంక్షల కమిటీ    

బి) లిబియా ఆంక్షల కమిటీ             

సి) ఉగ్రవాద నిరోధక కమిటీ    డి) పైవన్నీ

వివరణ: ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యదేశంగా భారత్‌ జనవరి 1, 2021న ఎన్నికయ్యింది. పలు కీలక కమిటీలకు సారథ్యం కూడా భారత్‌ వహించనుంది. అవి తాలిబన్‌ ఆంక్షల కమిటీ. దీనిని 1988 ఆంక్షల కమిటీ అని కూడా అంటారు. లిబియా ఆంక్షల కమిటీ. దీనిని 1970 ఆంక్షల కమిటీ అని కూడా అంటారు. లిబియాపై ఆంక్షలకు సంబంధించింది. ఉగ్రవాద నిరోధక కమిటీ. దీనిని 9/11 దాడుల తర్వాత 2001లో ఏర్పాటు చేశారు. 

5. కింది వాటిలో గల్ఫ్‌ కోఆపరేషన్‌ కౌన్సిల్‌లో సభ్యత్వం లేని దేశం? (డి)

ఎ) సౌదీ అరేబియా     బి) ఖతార్‌ 

సి) కువైట్‌        డి) ఇరాన్‌

వివరణ: గల్ఫ్‌ కో ఆపరేషన్‌ కౌన్సిల్‌ అనేది ఆరు దేశాలతో ఏర్పడిన కూటమి. ఇందులో సౌదీ అరేబియా, కువైట్‌, ఖతార్‌, యూఏఈ, బహ్రెయిన్‌, ఒమన్‌ దేశాలు ఉన్నాయి. ఇరాన్‌తో స్నేహపూర్వకంగా మెలుగుతుందన్న కారణంతో ఖతార్‌పై విధించిన ఆంక్షలను ఇటీవల తొలగించారు. సభ్య దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయాలని కూడా నిర్ణయించారు.

6. 2020, నవంబర్‌ 4న అమెరికాకు సంబంధించి కింది వాటిలో జరిగిన సంఘటన? (సి)

ఎ) అమెరికా అధ్యక్ష ఎన్నికలు నిర్వహించారు                   బి) జో బైడెన్‌ అభ్యర్థిత్వం ఖరారైంది

సి) పారిస్‌ పర్యావరణ ఒప్పందం నుంచి అమెరికా నిష్క్రమించింది

డి) ఏదీ కాదు

వివరణ: పారిస్‌ పర్యావరణ ఒప్పందం నుంచి అమెరికా నిష్క్రమించింది. ఇది నవంబర్‌ 4, 2020లో అమలులోకి వచ్చింది. ట్రంప్‌ ఆ దేశ అధ్యక్షుడు అయ్యాక, చాలా ఒప్పందాలు, వ్యవస్థల నుంచి అమెరికా తప్పుకొంది. ట్రాన్స్‌ పసిఫిక్‌ పార్ట్‌నర్‌షిప్‌, యునెస్కో, ప్రపంచ ఆరోగ్య సంస్థల నుంచి కూడా అమెరికా నిష్క్రమించింది. అమెరికా ప్రయోజనాలకు అవన్నీ విరుద్ధంగా ఉన్నాయని ట్రంప్‌ వాదన. 

7. కింది వాక్యాలను పరిశీలించండి? (డి)

1. జనవరి 1, 2021 నాటికి భీమా-కోరేగావ్‌ యుద్ధం జరిగి 203 ఏండ్లు పూర్తయ్యింది

2. జనవరి 1, 2021 నాటికి డీఆర్‌డీవో ఏర్పాటై 63 ఏండ్లు పూర్తయ్యింది

ఎ) 1    బి) 2    సి) 1, 2    డి) 1, 2

వివరణ: 2021, జనవరి 1 నాటికి భీమా-కోరేగావ్‌ యుద్ధం జరిగి 203 ఏండ్లు అయ్యింది. పీష్వాలు, బ్రిటిషర్లకు మధ్య జరిగిన యుద్ధం ఇది. బ్రిటిష్‌ విజయం సాధించడంతో మరాఠా పీష్వాల యుగం ముగిసింది. అదే విధంగా 2021, జనవరి 1న డీఆర్‌డీవో ఏర్పాటై 63 ఏండ్లు పూర్తయ్యింది. 1958లో ఇది ఏర్పాటయ్యింది. రక్షణ మంత్రిత్వ శాఖలో భాగంగా ఇది పనిచేస్తుంది. ప్రధాన కేంద్రం ఢిల్లీలో ఉంది.

8. ప్రపంచంలోనే అతిపెద్ద తేలియాడే సౌర శక్తి విద్యుత్‌ ప్రాజెక్టును 2023 నాటికి ఏ రాష్ట్రంలో నిర్మించనున్నారు? (ఎ)

ఎ) మధ్యప్రదేశ్‌    బి) ఉత్తరప్రదేశ్‌    

సి) గుజరాత్‌    డి) జార్ఖండ్‌

వివరణ: మధ్యప్రదేశ్‌లో నర్మదా నదిపై ఓంకారేశ్వర్‌ డ్యాం వద్ద ప్రపంచంలోనే అతిపెద్ద తేలియాడే సౌర శక్తి విద్యుత్‌ ప్రాజెక్టును 2023 నాటికి నిర్మించనున్నారు. దీని సామర్థ్యం 600 మెగావాట్లు. ఇందుకు రూ.3,000 కోట్ల వ్యయం అవుతుందని భావిస్తున్నారు. 

9. ఇటీవల ఏ ఖండంలోని తేయాకు పండించే నాలుగు ప్రదేశాలను ప్రపంచ ఆహార సంస్థ ‘ప్రపంచ వ్యవసాయ వారసత్వ వ్యవస్థ’ల జాబితాలో చేర్చింది? (సి)

ఎ) ఆఫ్రికా బి) ఉత్తర అమెరికా

సి) ఆసియా డి) యూరప్‌

వివరణ: తేయాకు పండించడంలో ఆసియాలోని నాలుగు ప్రదేశాలను ప్రపంచ వ్యవసాయ వారసత్వ వ్యవస్థ (అగ్రి హెరిటేజ్‌ సిస్టమ్‌) జాబితాలో ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చరల్‌ ఆర్గనైజేషన్‌ సంస్థ చేర్చింది. ఇందులో చైనాకు చెందినవి రెండు, ఒకటి కొరియాకు, మరొకటి జపాన్‌కు చెందినవి. 

చైనా- ప్యూర్‌ ట్రెడిషనల్‌ ఆగ్రోసిస్టమ్‌, ఫ్యూజో జాస్మిన్‌ టీ సైట్‌

కొరియా- హడాంగ్‌ టీ ఆగ్రో సిస్టమ్‌ 

జపాన్‌- షిజువొకాలోని తేయాకు పండించే వ్యవస్థ

10. రైల్వే బోర్డ్‌ చైర్మన్‌, సీఈవోగా ఎవరు నియమితులయ్యారు? (బి)

ఎ) వీకే యాదవ్‌ బి) సునీత్‌ శర్మ

సి) మల్లిక్‌ రావు డి) ప్రీతమ్‌ దత్‌

వివరణ: రైల్వే బోర్డ్‌ చైర్మన్‌, సీఈవోగా సునీత్‌ శర్మ నియమితులయ్యారు. ఆయన రైల్వేల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. 1978కి చెందిన రైల్వే అప్రెంటిస్‌ అధికారి ఆయన. 34 ఏండ్లు ఆయన రైల్వేలో విధులు నిర్వహించారు. ఆయన కంటే ముందు చైర్మన్‌, సీఈవోగా వీకే యాదవ్‌ ఉన్నారు.

11. కిసాన్‌ ఫసల్‌ రాహత్‌ యోజనను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? (డి)

ఎ) పంజాబ్‌ బి) రాజస్థాన్‌

సి) కేరళ డి) జార్ఖండ్‌

వివరణ: జార్ఖండ్‌ రాష్ట్రం కిసాన్‌ ఫసల్‌ రాహత్‌ యోజన పేరుతో రైతులకు బీమా పథకాన్ని ప్రారంభించింది. కేంద్రం తీసుకొచ్చిన పథకం స్థానంలో ఇది అమలవుతుంది. సహజ విపత్తులతో పంట నష్టం జరిగితే రైతులకు బీమా పరిహారం వస్తుంది. భూమి ఉన్న, భూమి లేని రైతులకు ఇది వర్తిస్తుంది. 

12. ప్రపంచ హిందీ దినోత్సవం ఏ రోజున నిర్వహిస్తారు? (సి)

ఎ) జనవరి 9 బి) సెప్టెంబర్‌ 14    

సి) జనవరి 10    డి) జనవరి 13

వివరణ: ఏటా జనవరి 10న ప్రపంచ హిందీ దినోత్సవంగా నిర్వహిస్తారు. తొలి ప్రపంచ హిందీ సదస్సు 1975, జనవరి 10న నిర్వహించారు. అందుకే ఈ రోజును ఎంపిక చేశారు. భారత్‌లో 1949, సెప్టెంబర్‌ 14న దేవనాగరి లిపిలో రాసే హిందీని అధికారిక భాషగా గుర్తించారు. అందుకే సెప్టెంబర్‌ 14న జాతీయ హిందీ దినోత్సవంగా నిర్వహిస్తారు. ఈ భాష రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్‌లో 22 భాషల్లో భాగంగా ఉంది. అధికరణం 343 ప్రకారం హిందీ మాత్రమే కాకుండా ఇంగ్లిష్‌ కూడా భారత్‌లో అధికారిక భాషగా గుర్తింపు పొందింది. హిందీ భాష అభివృద్ధికి కృషి చేయాలని ఆర్టికల్‌ 351 నిర్దేశిస్తుంది.

13. కింది వాక్యాలను పరిశీలించండి? (డి)

1. 127% మొక్కలు నాటడం ద్వారా అగ్రస్థానంలో నిలిచిన తెలంగాణ జిల్లా- కామారెడ్డి

2. 127% మొక్కలు నాటడం ద్వారా అగ్రస్థానంలో నిలిచిన తెలంగాణ జిల్లా- వికారాబాద్‌

3. 1.06 కోట్ల మొక్కలు నాటి రాష్ట్రంలో అత్యధిక మొక్కలు నాటిన జిల్లా- రంగారెడ్డి

4. 1.06 కోట్ల మొక్కలు నాటి రాష్ట్రంలో అత్యధిక మొక్కలు నాటిన జిల్లా- భద్రాద్రి కొత్తగూడెం

పై వాక్యాల్లో సరైనవి ఏవి?

ఎ) 1, 3    బి) 2, 3    సి) 2, 4    డి) 1, 4 

వివరణ: హరితహారంతో తెలంగాణలో మూడేండ్లలో పచ్చదనం 3.67% పెరిగిందని ఫారెస్ట్‌ సర్వే ఆఫ్‌ ఇండియా వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 90 చోట్ల అర్బన్‌ ఫారెస్ట్‌ బ్లాకుల అభివృద్ధి చేపట్టారు. అదే విధంగా 127% మొక్కలు నాటడం ద్వారా రాష్ట్రంలో కామారెడ్డి జిల్లా తొలిస్థానంలో ఉంది. 1.06 కోట్ల మొక్కలు నాటి రాష్ట్రంలో అత్యధిక మొక్కలు నాటిన జిల్లాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నిలిచింది.

14. ప్రతిపాదన (ఏ): బొగ్గు మైనింగ్‌కు సంబంధించి కేంద్రం సింగిల్‌ విండో సిస్టమ్‌ను ప్రారంభించింది (ఎ)

కారణం (ఆర్‌): అనుమతులకు జాప్యాన్ని నివారించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది

ఎ) ఏ, ఆర్‌ సరైనవే. ఏ ను ఆర్‌ సరిగ్గా వివరిస్తుంది

బి) ఏ, ఆర్‌ సరైనవే. ఏ కు ఆర్‌ సరికాదు

సి) ఏ సరైనది, ఆర్‌ సరికాదు

డి) ఏ తప్పు, ఆర్‌ సరైనది

వివరణ: బొగ్గు మైనింగ్‌కు సంబంధించి ఏక గవాక్ష పద్ధతిని కేంద్రం ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ప్రధానంగా 19 అనుమతులు అవసరమవుతుంది. దీంతో తీవ్ర జాప్యం జరుగుతుంది. దీనిని నివారించడానికి కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. సులభతర వాణిజ్యాన్ని కూడా ఇది పెంచుతుంది. దేశీయంగా ఉత్పత్తిని పెంచడానికి 2020లో బొగ్గు మైనింగ్‌ రంగంలో ప్రైవేట్‌పెట్టుబడులకు కేంద్రం అనుమతి ఇచ్చింది.

15. కొవిడ్‌-19 వ్యాక్సినేషన్‌కు ఏర్పాటు చేసిన సాధికారక కమిటీకి చైర్మన్‌ ఎవరు? (సి)

ఎ) హర్షవర్ధన్‌      బి) దివ్యాంకర్‌ పాండ్యా

సి) ఆర్‌ఎస్‌ శర్మ    డి) రాం పట్నాయక్‌

వివరణ: కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ ఇచ్చే ప్రక్రియ సజావుగా జరగడానికి 10 మందితో ఒక సాధికారక కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. దీనికి టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా మాజీ చైర్మన్‌ ఆర్‌ఎస్‌ శర్మ నేతృత్వం వహిస్తున్నారు. వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖలో వివిధ స్థాయిల్లో పనిచేసే అధికారులతో పాటు యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా అధికారులు కూడా ఇందులో భాగంగా ఉంటారు. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్‌ ప్రక్రియను భారత్‌ జనవరి 16న ప్రారంభించింది.

వి.రాజేంద్ర శర్మ

ఫ్యాకల్టీ , వ్యొమా.నెట్‌ , 9849212411


VIDEOS

logo