బుధవారం 03 మార్చి 2021
Nipuna-education - Jan 24, 2021 , 02:44:44

ఎవరి శిష్యులను ‘పంజేప్యారి’ అని అంటారు?

ఎవరి శిష్యులను ‘పంజేప్యారి’ అని అంటారు?

1. ‘ఇండియన్‌ టాంటాం’ బిరుదు కలిగినది ఎవరు?

ఎ) సరోజినీనాయుడు    బి) అనీబిసెంట్‌

సి) అరుణా అసఫ్‌ అలీ   డి) ఉషామెహతా

2. వివేకానందస్వామిని ‘ఆధునిక భారత నిర్మాతగా’ వర్ణించినది?

ఎ) సుభాష్‌ చంద్రబోస్‌

బి) రవీంద్రనాథ్‌ ఠాగూర్‌

సి) మహాత్మాగాంధీ     డి) అరబిందో ఘోష్‌

3. భారత జాతీయ కాంగ్రెస్‌ను ‘ప్రాక్టీస్‌ లేని న్యాయవాదుల క్లబ్‌'గా పేర్కొన్నది?

ఎ) సురేంద్రనాథ్‌ బెనర్జీ

బి) సర్‌ సయ్యద్‌ అహ్మద్‌ఖాన్‌

సి) అరబిందో ఘోష్‌

డి) మహ్మద్‌ ఇక్బాల్‌

4. కింది వాటిలో ‘బౌద్ధసంగీతి (సమావేశం)’ నిర్వహించని ప్రాంతం?

ఎ) రాజగృహ బి) పాటలీపుత్రం

సి) వైశాలి డి) ఉజ్జయిని

5. నెమలి సింహాసనంపై కూర్చున్న చిట్టచివరి మొగల్‌ చక్రవర్తి?

ఎ) అహ్మద్‌ షా బి) ఫరూక్‌షియర్‌

సి) మహ్మద్‌ షా డి) రెండో అక్బర్‌

6. 18వ శతాబ్దంలో అశ్వమేధ యాగం చేసిన రాజు?

ఎ) సవాయ్‌ జైసింగ్‌     బి) రంజిత్‌సింగ్‌

సి) బాజీరావు    డి) ఎవరూకాదు

7. బానిసల కోసం ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేసిన ఢిల్లీ సుల్తాన్‌?

ఎ) మహ్మద్‌బిన్‌ తుగ్లక్‌

బి) ఫిరోజ్‌ షా తుగ్లక్‌

సి) అల్లావుద్ధీన్‌ ఖిల్జీ

డి) నాసిరుద్దీన్‌ మహ్మద్‌

8. అశోకుడి కాలంలో కరువులు వచ్చినప్పుడు ప్రజలను ఆదుకొనేందుకు ధాన్యాన్ని రిజర్వ్‌ చేసినట్లు తెలిపే శాసనం?

ఎ) సొహగురా శాసనం

బి) రుమిందై శాసనం

సి) ఎర్రగుడి శాసనం

డి) బారాబర్‌ గుహ శాసనం

9. ‘హిందుస్థాన్‌ సోషలిస్టు రిపబ్లికన్‌ అసోసియేషన్‌' ఎవరి నాయకత్వంలో నడిచింది?

ఎ) భగత్‌సింగ్‌  

బి) బరీంద్రకుమార్‌ ఘోష్‌

సి) చంద్రశేఖర్‌ ఆజాద్‌ 

డి) ప్రమోద్‌ మిత్తర్‌

10. జహంగీర్‌ తన ఆస్థానంలోని ఏ చిత్రకారుడిని పర్షియా పంపాడు?

ఎ) ఉస్తాద్‌ మన్సూర్‌       బి) బిహాన్‌దాస్‌

సి) అబుల్‌ హసన్‌       డి) గోవర్ధన్‌

11. ‘జాజ్‌మానీ’ వ్యవస్థ ఏ కాలం నుంచి అమల్లోకి వచ్చింది?

ఎ) మౌర్యులు     బి) వేద

సి) గుప్తుల అనంతరం    డి) ఏదీకాదు

12. కింది వారిలో జైనమతాన్ని పోషించిన రాజులు?

ఎ) చంద్రగుప్తమౌర్యుడు   బి) ఇంద్ర-IV

సి) ఖారవేలుడు       డి) పై అందరూ

13. అశోకుని స్తంభాన్ని ఢిల్లీకి తీసుకువచ్చిన సుల్తాన్‌?

ఎ) ఫిరోజ్‌షా తుగ్లక్‌

బి) మహ్మద్‌ బిన్‌ తుగ్లక్‌

సి) ఇల్‌టుట్‌మిష్‌    డి) బాల్బన్‌

14. ‘ది పెరిప్లస్‌ ఆఫ్‌ ఎరిత్రియన్‌ సీ’  గ్రంథకర్త?

ఎ) ప్లీని బి) టాలమీ

సి) స్ట్రాబో    డి) పేరు తెలియని రచయిత

15. ‘ఒక నాట్యగత్తెను బౌద్ధమతంలోకి మార్చుట’ కథ ఉన్న గ్రంథం?

ఎ) మణిమేఖలై బి) శిలప్పాధికారం

సి) తిరుక్కురళ్‌ డి) పెరియపురాణం

16. కింది వాటిలో సరైనవి?

ఎ) భారతీయులను సివిల్‌ సర్వీస్‌ ఉద్యోగాల్లో నియమించడానికి మొదటిసారిగా అంగీకరించిన చట్టం- 1833 బార్టర్‌ చట్టం

బి) సివిల్‌ సర్వీసెస్‌ ఉద్యోగాలకు రాతపూర్వక పోటీ పరీక్షలు లండన్‌లో మాత్రమే ప్రవేశపెట్టిన చట్టం- 1853 చట్టం

సి) సివిల్‌ సర్వీసెస్‌ ప్రవేశపరీక్షలు భారతదేశంలో జరపాలని నిర్ణయించిన చట్టం- 1919 భారత ప్రభుత్వ చట్టం    డి) పైవన్నీ

17. ఆధునిక స్వతంత్ర బెంగాల్‌ రాజ్యస్థాపకుడిగా వీరిని పరిగణిస్తారు?

ఎ) అలీవర్ధిఖాన్‌ బి) ముర్షిద్‌ఖలిఖాన్‌

సి) సిరాజుద్దౌలా డి) ఘజాఉద్దౌలా

18. పతంజలి యోగసూత్రాలకు వ్యాఖ్యానం రాసిన రాజపుత్రరాజు?

ఎ) భోజరాజు బి) వాకృతరాజు

సి) చంద్రదేవుడు డి) మిహిరభోజుడు

19. ‘పాలవంశం’ గురించి కింది వాటిలో సరైనవి?

ఎ) ఈ వంశ స్థాపకుడు ‘గోపాలుడు’ ఇతను ప్రజలే ఎన్నుకున్న రాజుగా పిలవబడతాడు

బి) పాటలీపుత్రాన్ని రాజధానిగా చేసుకొని పాలించారు

సి) ఉద్దండపుర విశ్వవిద్యాలయ స్థాపకుడు

డి) పైవన్నీ

20. కింది వాటిని జతపరచండి

గ్రంథాలు      రచయితలు

i. ధనసాగర                 ఎ. బల్లాలసేన

ii. నవసాహసాంక చరిత్ర  బి. పద్మగుప్తుడు

iii. కర్ణామృతం           సి. లీలాశోకుడు

iv. శృంగార ప్రకాశకం     డి. భోజుడు

ఎ) i-బి ii-ఎ iii-డి iv-సి                               బి) i-డి ii-సి iii-బి iv-ఎ        

సి) i-డి ii-బి iii-సి iv-ఎ                                     డి) i-ఎ ii-బి iii-సి iv-డి

21. ‘పేరొందిన రాతగాడు’గా ప్రసిద్ధి చెందిన ఢిల్లీ సుల్తాన్‌?

ఎ) మహ్మద్‌ బిన్‌ తుగ్లక్‌

బి) నాసిరుద్దీన్‌ మహ్మద్‌

సి) సికిందర్‌ లోడి

డి) ఖిజిర్‌ఖాన్‌ సయ్యద్‌

22. కింది వాటిలో ఆల్‌బెరూనీ రచనలు?

ఎ) కితాబ్‌-ఇ- హింద్‌

బి) తహ్రిక్‌-ఇ-హింద్‌

సి) కనుమ్‌-ఇ-మసూని       డి) పైవన్నీ

23. కింది వాటిని జతపరచండి

i. శంకరాచార్యులు          ఎ. భక్తిమార్గం

ii. రామానుజాచార్యలు   బి. జ్ఞానమార్గం

iii. మధ్వాచార్యులు        సి. పుష్టిమార్గం

iv. వల్లభాచార్యులు  డి. భక్తి, జ్ఞానమార్గం

ఎ) i-బి ii-ఎ iii-డి iv-సి                               బి) i-ఎ ii-బి iii-సి iv-డి        

సి) i-బి ii-సి  iii-ఎ iv-డి                              డి) i-డి ii-సి iii-బి iv-ఎ

24. ఎవరి శిష్యులను ‘పంజేప్యారి’ అని అంటారు?

ఎ) గురునానక్‌ బి) కబీర్‌

సి) గురుగోవింద్‌సింగ్‌

డి) దాదుదయాల్‌

25. కింది వాటిని జతపరచండి

i. వివాదస్పద వైశ్రాయ్‌     ఎ. మింటో-2

ii.  యూదుల వైశ్రాయ్‌     బి. కర్జన్‌

iii. రైతు బాంధవుడు       సి. రీడింగ్‌

iv. మెజీషియన్‌ వైశ్రాయ్‌    డి.లిట్టన్‌

ఎ) i- ఎ ii-బి iii-సి iv-డి                               బి) i-డి  ii-సి iii-బి iv-ఎ        

సి) i-బి  ii-ఎ iii-డి iv-సి                              డి) i-డి  ii-సి iii-ఎ iv-బి

26. ‘కమిషన్‌ కాలం’ అని ఏ గవర్నర్‌ జనరల్‌ కాలాన్ని పిలుస్తారు?

ఎ) లార్డ్‌ కర్జన్‌ బి) డల్హౌసి

సి) రిప్పన్‌ డి) డఫ్రిన్‌

27. 1946 సెప్టెంబర్‌ 2న ఏర్పడిన తాత్కాలిక భారత ప్రభుత్వానికి అధ్యక్షుడు?

ఎ) జవహర్‌లాల్‌ నెహ్రూ        బి) వేవెల్‌

సి) గాంధీ                డి) మౌంట్‌ బాటన్‌

28. హుణులతో పోరాడిన గుప్తరాజు?

ఎ) సముద్రగుప్తుడు      బి) చంద్రగుప్త-2

సి) స్కందగుప్తుడు        డి) విష్ణుగుప్త

29. వెండి రూపాయి ‘ధామ్‌'ను ప్రవేశపెట్టింది?

ఎ) అక్బర్‌ బి) షేర్షా

సి) మహ్మద్‌బిన్‌ తుగ్లక్‌

డి) అల్లావుద్దీన్‌ ఖిల్జీ

30. హరప్పా నాగరికత ప్రాంతంలో ‘గుడ్డముక్క’ దొరికింది?

ఎ) మొహెంజోదారో       బి) హరప్పా

సి) లోథాల్‌                  డి) చన్హుదారో

31. ఔరంగజేబు ఉరితీయించిన సిక్కుగురువు?

ఎ) గురుగోవింద్‌ సింగ్‌ బి) తేజ్‌ బహదూర్‌

సి) గురు అర్జున్‌దేవ్‌  డి) హరగోవింద్‌

32.  ‘ఇండియన్‌ లేబర్‌ పార్టీని’ స్థాపించినది?

ఎ) అంబేద్కర్‌

బి) లాలాలజపతిరాయ్‌

సి) ఎమ్‌ఎన్‌ రాయ్‌

డి) సుభాష్‌ చంద్రబోస్‌

33. కింది వాటిని జతపరచండి

మొఘల్‌ చక్రవర్తులు   వారి సమాధులు

i.  బాబర్‌ ఎ. కాబూల్‌

ii.  హుమాయూన్‌ బి.ఢిల్లీ

iii.  అక్బర్‌ సి. సికిందర్‌

iv.  జహంగీర్‌ డి. లాహోర్‌

ఎ) i- ఎ ii-బి iii-సి iv-డి                               బి) i-డి  ii-సి iii-బి iv-ఎ        

సి) i-ఎ  ii-బి iii-డి iv-సి                              డి) i-ఎ  ii-సి iii-బి iv-డి

34. ఉత్తర భారతదేశంపై విజయయాత్ర చేసిన రాష్ట్రకూట రాజు?

ఎ) అమోఘవర్షుడు బి) ధృవుడు

సి) ఇంద్ర-4 డి) మొదటి కృష్ణుడు

35. ‘సుల్లాయికుల్‌' సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది?

ఎ) అక్బర్‌    బి) షేక్‌ సలీంవుద్దీన్‌ చిస్తీ

సి) షబాబుద్దీన్‌ సుహ్రావర్ధీ

డి) కుతుబుద్దీన్‌ భక్తియార్‌

36. పాశ్యాత్య పద్ధుతుల్లో సైన్యాన్ని వ్యవస్థీకరించిన భారతదేశ స్వదేశీ సంస్థానం?

ఎ) బెంగాల్‌ బి) హైదరాబాద్‌

సి) మైసూర్‌ డి) అవధ్‌

37. సంగం యుగంలో మహాభారతాన్ని తమిళంలో రాసింది ఎవరు?

ఎ) పెరుందేవనార్‌ బి) సిత్తనార్‌

సి) ఇంలంగో అడిగల్‌ డి) ఎవరూకాదు

38. ‘తక్కోలం’ యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది?

ఎ) పల్లవులు-చాళుక్యులు

బి) రాష్ట్రకూటులు- చోళులు

సి) చోళులు- పాండ్యులు

డి) చాళుక్యులు- చోళులు

39. భారత్‌లోని ఏ ప్రాంతంలో అత్యధికంగా రోమన్‌ నాణేలు దొరికాయి?

ఎ) ఉత్తర భారత్‌     బి) దక్షిణ భారత్‌

సి) ఈశాన్య భారత్‌  డి) వాయవ్య భారత్‌

40. ‘స్మారక సమాధుల నిర్మాణ పిత’ గా పేరుపొందిన సుల్తాన్‌? 

ఎ) ఇల్‌టుట్‌మిష్‌

బి) ఫిరోజ్‌షా తుగ్లక్‌

సి) మహ్మద్‌బిన్‌ తుగ్లక్‌

డి) బాల్బన్‌

41. ‘ప్రచ్ఛన్న బుద్ధ’ ‘జగద్గురు’ ‘ఆదిగురు’ గా పేరుపొందిన వారు ఎవరు?

ఎ) రామానుజాచార్యులు

బి) శంకరాచార్యులు

సి) చైతన్యుడు డి) గురునానక్‌

42. అక్బర్‌ చక్రవర్తికి సమకాలికుడైన సిక్కుమత గురువు?

ఎ) హరగోవింద్‌సింగ్‌ బి) గురు అర్జున్‌సింగ్‌

సి) గురు రాందాస్‌ డి) హరికిషన్‌

43. ‘జంజీర్‌-ఇ-ఆదిల్‌' (ధర్మగంట)ను యుయనా నది ఒడ్డున ఏర్పాటు చేసిన మొగల్‌ చక్రవర్తి?

ఎ) జహంగీర్‌ బి) అక్బర్‌

సి) షాజహాన్‌ డి) ఔరంగజేబు

44. రాజారామ్మోహన్‌రాయ్‌కు ‘రాజా’ బిరుదును ప్రదానం చేసిన మొఘల్‌ చక్రవర్తి?

ఎ) అహ్మద్‌షా       బి) రెండో షా ఆలం

సి) మహ్మద్‌షా      డి) రెండో అక్బర్‌

45. ‘మూర్తీభవించిన పీష్వా’ బిరుదు కలిగిన వారు ఎవరు?

ఎ) బాజీరావు-1      

బి) బాలాజీ విశ్వనాథ్‌

సి) బాలాజీ బాజీరావు     

డి) బాజీరావు-2

46. ‘హరప్పా ముందు సంస్కృతి’ ‘హరప్పా సంస్కృతి’ రెండూ కనిపించిన హరప్పా నాగరికత పట్టణం?

ఎ) మొహంజోదారో బి) కాలిబంగన్‌

సి) లోథాల్‌ డి) కోట్‌డిజీ

47. ఆర్యులు ఉపయోగించిన సంస్కృత భాషకు, ఇండో యూరోపియన్‌ భాషలకు మధ్యగల సారుప్యతను గుర్తించిన మొదటి వ్యక్తి?

ఎ) మాక్స్‌ ముల్లర్‌  బి) మెక్‌డొనాల్డ్‌

సి) ఫిలిపోసాసతి    

డి) దయానంద సరస్వతి

48. స్థవిరవాదులు, మహాసాంఘికులుగా బౌద్ధసన్యాసులు ఈ బౌద్ధ సన్యాసులతో విడిపోయారు?

ఎ) మొదటి బౌద్ధసంగీతి

బి) రెండవ బౌద్ధసంగీతి

సి) మూడవ బౌద్ధసంగీతి

డి) నాలుగవ బౌద్ధసంగీతి

49. హోంరూల్‌ ఉద్యమాన్ని ఏ దేశం నుంచి గ్రహించారు?

ఎ) ఐర్లాండ్‌ బి) అమెరికా

సి) జర్మనీ డి) స్కాట్లాండ్‌

50. షేర్షా సమాధి ఎక్కడ ఉంది?

ఎ) సికిందర్‌ బి) ఢిల్లీ

సి) ససారమ్‌ డి) ఆగ్రాసాసాల మల్లికార్జున్‌

అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ,ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, కోరుట్ల

9492 575 006

VIDEOS

logo