మంగళవారం 09 మార్చి 2021
Nipuna-education - Jan 17, 2021 , 00:36:29

జీప్యాట్‌-2021

జీప్యాట్‌-2021

గ్రాడ్యుయేట్‌ ఫార్మసీ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (జీప్యాట్‌)-2021 ప్రకటనను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) విడుదల చేసింది. 

పరీక్ష పేరు: జీప్యాట్‌-2021

ప్రవేశాలు కల్పించే కోర్సులు: ఎంఫార్మ, తత్సమాన కోర్సు

అర్హతలు: ఇంటర్‌ తర్వాత ఫార్మసీలో నాలుగేండ్ల బ్యాచిలర్‌ డిగ్రీ/తత్సమాన కోర్సు ఉత్తీర్ణత. బీఫార్మసీ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. బీటెక్‌ (ఫార్మస్యూటికల్‌, ఫైన్‌ కెమికల్‌ టెక్నాలజీ)/తత్సమాన అభ్యర్థు లు ఈ పరీక్ష రాయడానికి అర్హులు కాదు. జీప్యాట్‌- 2021 దరఖాస్తుకు గరిష్ఠ వయోపరిమితి లేదు. 

ఎంపిక: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌, గ్రూప్‌ డిస్కషన్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ 

పరీక్ష విధానం 

పరీక్షలో  125 ప్రశ్నలు ఇస్తారు. ఒక్కో ప్రశ్నకు 4 మార్కులు చొప్పున 500 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.

పరీక్షలో కింది సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు ఇస్తారు. అవి.. 

ఫార్మస్యూటికల్‌ కెమిస్ట్రీ-38 ప్రశ్నలు- 152 మార్కులు

ఫార్మస్యూటిక్స్‌-38 ప్రశ్నలు-152 మార్కులు

ఫార్మకాగ్నసీ-10 ప్రశ్నలు- 40 మార్కులు

ఫార్మకాలజీ-28 ప్రశ్నలు- 112 మార్కులు

ఇతర సబ్జెక్టులు-11 ప్రశ్నలు- 44 మార్కులు

దీనిలో నెగెటివ్‌ మార్కింగ్‌ విధానం ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1 మార్కు కోత విధిస్తారు. 

ముఖ్యతేదీలు

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో 

చివరితేదీ: జనవరి 22

పరీక్షతేదీ: ఫిబ్రవరి 22, 27

వెబ్‌సైట్‌: https://gpat.nta.nic.in

సీమ్యాట్‌-2021

కామన్‌ మేనేజ్‌మెంట్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ (సీమ్యాట్‌)-2021 ప్రకటనను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) విడుదల చేసింది. 

పరీక్ష పేరు: కామన్‌ మేనేజ్‌మెంట్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ (సీమ్యాట్‌)-2021

అర్హతలు: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. సీమ్యాట్‌-2021 గరిష్ఠ వయోపరిమితితో  సంబంధం లేదు.

ఎంపిక: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ ద్వారా 

పరీక్షా విధానం 

ఈ పరీక్షలో క్వాంటిటేటివ్‌ టెక్నిక్‌ అండ్‌ డాటా ఇంటర్‌ప్రిటేషన్‌, లాజికల్‌ రీజనింగ్‌, లాంగ్వేజ్‌ కాంప్రహెన్షన్‌, జనరల్‌ అవేర్‌నెస్‌ అంశాల నుంచి ప్రశ్నలు ఇస్తారు. 

పరీక్షలో మొత్తం 100 ప్రశ్నలు ఇస్తారు. ఒక్కోదానికి 4 మార్కులు చొప్పున 400 మార్కులు.

దీనికి నెగెటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది. తప్పు జవాబుకు 1 మార్కు కోతవిధిస్తారు. 

ముఖ్యతేదీలు

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో 

చివరితేదీ: జనవరి 22

పరీక్షతేదీ: ఫిబ్రవరి 22, 27

వెబ్‌సైట్‌: https://cmat.nta.nic.in

నార్మ్‌లో పీజీడీఎం

హైదరాబాద్‌లోని ఐసీఏఆర్‌- నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ రిసెర్చ్‌ మేనేజ్‌మెంట్‌ (నార్మ్‌) అగ్రి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ విభాగం పీజీడీఎంలో ప్రవేశాల కోసం నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

కోర్సు: పీజీడీఎం-అగ్రి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ (2021-2023 విద్యాసంవత్సరం)

మొత్తం సీట్లు: 66

అర్హత: బ్యాచిలర్‌ డిగ్రీ (అగ్రికల్చర్‌, అగ్రి-బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌, కమర్షియల్‌ అగ్రికల్చర్‌ లేదా అగ్రికల్చరల్‌ ఇంజినీరింగ్‌/ అగ్రికల్చరల్‌ బయోటెక్నాలజీ/ డెయిరీ సైన్స్‌, టెక్నాలజీ/ ఫిషరీస్‌ లేదా ఫుడ్‌ టెక్నాలజీ / ఫుడ్‌ ప్రాసెస్‌ ఇంజినీరింగ్‌/ ఫారెస్ట్రీ/ హార్టికల్చర్‌/ సెరికల్చర్‌ అండ్‌ వెటర్నరీ సైన్సెస్‌)లలో ఏదో ఒక కోర్సు ఉత్తీర్ణత. అదేవిధంగా పదో తరగతి నుంచి డిగ్రీ వరకు కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక: క్యాట్‌/ సీమ్యాట్‌ స్కోర్‌, స్కిల్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ద్వారా

వెయిటేజీ: క్యాట్‌/ సీమ్యాట్‌ స్కోర్‌-30 శాతం, గ్రూప్‌ డిస్కషన్‌-25 శాతం, పర్సనల్‌ ఇంటర్వ్యూ-20 శాతం, అనలిటికల్‌ స్కిల్స్‌-10 శాతం, వర్క్‌ ఎక్స్‌పీరియన్స్‌-10 శాతం, డైవర్సిటీ ఫ్యాక్టర్‌-5 శాతం వెయిటేజీ ఇస్తారు.

ముఖ్యతేదీలు

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో

చివరితేదీ: ఫిబ్రవరి 28

వెబ్‌సైట్‌: https://naarm.org.in

ఎస్వీ ఓరియంటల్‌ కాలేజీలో ప్రవేశాలు

తిరుపతిలోని తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన ఎస్వీ ఓరియంటల్‌ డిగ్రీ అండ్‌ పీజీ కళాశాల 2020-21 విద్యాసంవత్సరానికి కింది ప్రోగ్రాముల్లో ప్రవేశాల కోసం ప్రకటన విడుదల చేసింది.

కోర్సు: ప్రీ-డిగ్రీ (ఇంటర్‌ స్థాయి)

కోర్సులు: సంస్కృతం, తెలుగు, హిందీ.

కాలం: రెండు సంవత్సరాలు.

అర్హత: సంస్కృతానికి ఓఎస్‌ఎస్‌సీ, తెలుగు, హిందీ సబ్జెక్టులకు ఎస్‌ఎస్‌సీ ఉత్తీర్ణత.

వయస్సు: 18 ఏండ్లు మించరాదు.

దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో

దరఖాస్తు ఫీజు: రూ.25

చివరితేదీ: ఫిబ్రవరి 1

చిరునామా: ఎస్వీ ఓరియంటల్‌ డిగ్రీ అండ్‌ పీజీ కాలేజీ, తితిదే, కపిలతీర్థం రోడ్‌, తిరుపతి.

పూర్తి వివరాల కోసం 

0877-2264604, 0877-2263974, 

సెల్‌ నెంబర్‌-9440088315లలో 

కార్యాలయ సమయంలో సంప్రదించవచ్చు

VIDEOS

తాజావార్తలు


logo