బుధవారం 20 జనవరి 2021
Nipuna-education - Nov 25, 2020 , 01:22:58

ఆర్‌ఆర్‌బీ ప్రత్యేకం స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేది?

ఆర్‌ఆర్‌బీ ప్రత్యేకం స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేది?

1. రాజ్యాంగంలో 73, 74 సవరణల ద్వారా కిందివాటిలో సాధ్యమైనది? (టీఎస్‌ కానిస్టేబుల్‌ మెయిన్‌-2019)    (2)

1) అన్ని ఉన్నత స్థానాల్లో మహిళల నియామకాలు

2) గ్రామ పంచాయతీలు, పురపాలక సంఘాల్లో మహిళలకు ప్రవేశం

3) చాలామంది స్త్రీలు చిన్న దుకాణాలు ప్రారంభించడం

4) వ్యవసాయ రంగంలో మహిళా కూలీల సంఖ్యను పెంచడం

వివరణ: రాజ్యాంగంలో 73, 74 రాజ్యాంగ సవరణ చట్టం (1992) ద్వారా మొత్తం స్థానాల్లో 1/3వ వంతు స్థానాలు మహిళలకు కేటాయించారు. దీనిలో 1/3వ వంతు ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు కేటాయించారు. 

2. దేశంలో మొదటి మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎక్కడ ఏర్పాటు చేశారు? (సబ్‌ ఇన్‌స్పెక్టర్‌-2013)    (3)

1) కోల్‌కతా    2) ముంబై    

3) మద్రాస్‌    4) ఢిల్లీ

వివరణ: దేశంలో మొట్టమొదటి మున్సిపల్‌ కార్పొరేషన్‌ను మద్రాస్‌లో 1687లో నెలకొల్పారు. ఇది 1688లో అమల్లోకి వచ్చింది. బ్రిటిష్‌వారు తమ ఆర్థిక అవసరాలను తీర్చుకోవడానికి మద్రాస్‌ను మున్సిపల్‌ కార్పొరేషన్‌గా ఏర్పాటు చేశారు.

3. పురపాలక సంఘాల్లో వార్డు కమిటీలనుతప్పనిసరిగా ఏర్పాటు చేయడానికి ఉండాల్సిన జనాభా ఎంత? (ఎస్‌ఐ ప్రిలిమ్స్‌-2016)    (1)

1) 3 లక్షలు లేదా అంతకుమించి

2) 2 లక్షలు లేదా అంతకుమించి

3) 5 లక్షలు లేదా అంతకుమించి

4) 10 లక్షలు లేదా అంతకుమించి

వివరణ: వార్డు కమిటీలను 74వ రాజ్యాంగ సవరణ చట్టం (1992) ద్వారా నిబంధన 143 (ఎస్‌) ప్రకారం పురపాలక సంఘాల్లో 3 లక్షలు లేదా అంతకుమించి జనాభా ఉన్న చోట ఏర్పాటు చేస్తారు. వార్డు కమిటీలు కార్పొరేటర్లకు పరిపాలనకు సంబంధించిన అంశాలపై సూచనలు చేస్తాయి. మెట్రోపాలిటన్‌ సిటీలో మాత్రం 10 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్నచోట వార్డు కమిటీలు ఏర్పాటు చేస్తారు.

4. స్థానిక స్వపరిపాలనా సంస్థలకు ఎన్నికలు జరిపేది? (కానిస్టేబుల్‌ మెయిన్‌-2016)  (2) 

1) భారత ఎన్నికల సంఘం    

2) రాష్ట్ర ఎన్నికల కమిషన్‌

3) జిల్లా కలెక్టర్‌    4) పంచాయతీరాజ్‌ శాఖ

వివరణ: రాజ్యాంగంలో నిబంధనలు 243 (కే), 243 (జడ్‌ఏ) ప్రకారం రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక స్వపరిపాలన అంటే పంచాయతీలు, మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహిస్తుంది.

5) కింది వాటిని జతపర్చండి (సబ్‌ఇన్‌స్పెక్టర్‌ 2012) (2)

ఎ. 73వ రాజ్యాంగ సవరణ    

1. ప్రజాస్వామ్య వికేంద్రీకరణ

బి. 74వ రాజ్యాంగ సవరణ    

2. దేశం నుంచి వలసపోయిన జాతులు

సి. బల్వంత్‌రాయ్‌ మెహతా కమిటీ    

3. మున్సిపల్‌ కౌన్సిల్‌

డి. ఎల్‌ఎం సింఘ్వీ కమిటీ    

4. పంచాయతీరాజ్‌కు రాజ్యాంగ ప్రతిపత్తి

1) ఎ-2, బి-4, సి-3, డి-1    

2) ఎ-4, బి-3, సి-1, డి-2

3) ఎ-4, బి-3, సి-2, డి-1    

4) ఎ-3, బి-4, సి-1, డి-2

వివరణ: ప్రజాస్వామ్య వికేంద్రీకరణ-ప్రజల భాగస్వామ్యం పేరుతో 1957, జనవరి 16న బల్వంత్‌రాయ్‌ మెహతా కమిటీని నియమించారు. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించారు. 74వ రాజ్యాంగ సవరణ చట్టం (1992) ద్వారా మున్సిపాలిటీలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించారు. చిన్న పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్‌ కౌన్సిల్‌ను ఏర్పాటు చేస్తారు.

6. జిల్లా ప్రణాళికా కమిటీల ఏర్పాటును సమర్థిస్తున్న అధికరణ? (పంచాయతీ కార్యదర్శి-2018)    (2)

1) 243 (జడ్‌సీ)    2) 243 (జడ్‌డీ)    3) 243 (జడ్‌ఏ)    4) 243 (జడ్‌బీ)

వివరణ: 74వ రాజ్యాంగ సవరణ చట్టం (1992) అధికరణ 243 (జడ్‌డీ) ప్రకారం ప్రతి రాష్ట్రంలో జిల్లా స్థాయిలో జిల్లా ప్రణాళిక కమిటీని ఏర్పాటు చేస్తుంది. పంచాయతీలు, మున్సిపాలిటీలు రూపొందించిన ప్రణాళికలను సమీకరించి ఈ కమిటీ తుది ప్రణాళికలను రూపొందిస్తుంది.

7. కింది వాటిలో బల్వంత్‌రాయ్‌ మెహతా కమిటీ సిఫారసును గుర్తించండి? (గ్రూప్‌-2-2012)    (3)

ఎ. దేశంలో మూడంచెల పంచాయతీరాజ్‌

     రాజ్‌ వ్యవస్థను ఏర్పాటు చేయాలి

బి. స్థానిక సంస్థలకు ఐదేండ్లకోసారి నియమ  

         బద్ధంగా ఎన్నికలు జరగాలి

సి. ఎన్నికలు పార్టీ ప్రాతిపదికగా కాకుండా 

    స్వతంత్ర ప్రాతిపదికపై జరపాలి

డి. జిల్లా పరిషత్‌, పంచాయతీ సమితి 

    అధ్యక్షుల ఎన్నిక పరోక్షంగా జరగాలి

ఇ. పంచాయతీ సమితికి కార్యనిర్వాహక 

    అధికారాలు, జిల్లా పరిషత్‌కు సలహా 

    పర్యవేక్షక అధికారాలను కల్పించాలి

ఎఫ్‌. గ్రామసభ ప్రాధాన్యాన్ని తగ్గించాలి

1) ఎ, బి, సి, డి, ఇ, ఎఫ్‌    2) బి, సి, డి, ఇ, ఎఫ్‌

3) ఎ, బి, సి, డి, ఇ    4) ఎ, సి, డి, ఇ, ఎఫ్‌

వివరణ: 1957, జనవరి 16న బల్వంత్‌రాయ్‌ మెహతా అధ్యక్షతన, ఎస్‌కే డే సభ్యుడిగా ప్రజాస్వామ్య వికేంద్రీకరణపై నెహ్రూ ప్రభుత్వం కమిటీని నియమించింది.

8. పంచాయతీరాజ్‌ సంస్థలకు రాజ్యాంగంలోని 11వ షెడ్యూల్‌లోని అంశాలపై కార్యక్రమాలు చేపట్టే అధికారం ఉంది. కింది వాటిలో ఒకటి దానిలో భాగం కాదు? (కానిస్టేబుల్‌-2016)    (1)

1) అగ్నిమాపక సేవలు    

2) టెక్నికల్‌ ట్రైనింగ్‌, ఒకేషనల్‌ విద్య

3) చిన్న నీటిపారుదల, నీటి వనరులపై అజ

         మాయిషీ వాటర్‌షెడ్‌ అభివృద్ధి

4) సంప్రదాయేతర ఇంధన వనరులు

వివరణ: గ్రామపంచాయతీలకు 73వ రాజ్యాంగ సవరణ చట్టం (1992) ద్వారా 11వ షెడ్యూల్‌లో 29 అధికారాలు ఉన్నాయి. అగ్నిమాపక సేవలు 12వ షెడ్యూల్‌లో పేర్కొన్నారు.

9. అశోక్‌ మెహతా కమిటీ దేనిని సిఫారసు చేసింది? (గ్రూప్‌-2-2008)    (4)

1) జిల్లా ప్రణాళికా బోర్డులు    

2) మెట్రోపాలిటన్‌ ప్రణాళికా బోర్డులు

3) మూడంచెల పంచాయతీరాజ్‌    

4) రెండంచెల పంచాయతీరాజ్‌

వివరణ: జనతా ప్రభుత్వం 1971, డిసెంబర్‌ 12న అశోక్‌ మెహతా అధ్యక్షతన ఈఎంఎస్‌ నంబూద్రిపాద్‌, జీ రామచంద్రన్‌ సభ్యులుగా ఈ కమిటీని నియమించారు. ఇది బల్వంత్‌రాయ్‌ మెహతా కమిటీ సూచించిన మూడంచెల స్థానంలో రెండంచెల పంచాయతీరాజ్‌ను (జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్తు, మధ్యస్థాయిలో మండల పరిషత్తులను) సూచించింది.

10. పెసా (పీఈఎస్‌ఏ) చట్టం ద్వారా అధిక ప్రాధాన్యం దేనికి ఉంటుంది? (కానిస్టేబుల్‌-2008)    (1) 

1) గ్రామసభ    2) గ్రామ పంచాయతీ

3) సర్పంచ్‌    4) మండల పరిషత్‌

వివరణ: 1996లో దిలీప్‌ సింగ్‌ భూరియా నేతృత్వంలో ఒక ఉన్నతస్థాయి కమిటీ సిఫారసుల మేరకు పెసా పంచాయతీ (ఎక్స్‌టెన్షన్‌ టు షెడ్యూల్డ్‌ ఏరియాస్‌) చట్టాన్ని రూపొందించారు. పెసా చట్టం ప్రధాన ఉద్దేశం గ్రామసభను ఒక స్వతంత్ర ప్రతిపత్తిగల వ్యవస్థగా తయారుచేయడం.

11. 1993లో అమల్లోకి వచ్చిన 73వ రాజ్యాంగ సవరణ చట్టం, రాజ్యాంగానికి కింది సంఖ్యల ఆర్టికల్స్‌ను చేర్చింది? (గ్రూప్‌-2-2016)    (4)

1) 5    2) 9    3) 12    4) 16

వివరణ: 73వ రాజ్యాంగ సవరణ చట్టం (1992) పంచాయతీ రాజ్‌ వ్యవస్థకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పిస్తూ 9వ భాగంలో 11వ షెడ్యూల్‌లో 243 నుంచి 243 (ఓ) వరకు 16 నిబంధనలో చేర్చారు.


12. కింది వాటిలో సరైనవి గుర్తించండి. (గ్రూప్‌-2-2008)    (3)

ఎ. హజ్‌హౌస్‌ కమిటీ (1909)

బి. బల్వంత్‌రాయ్‌ మెహతా కమిటీ- 1957

సి. అశోక్‌ మెహతా కమిటీ- 1977

డి. జీవీకే రావు కమిటీ- 1993

1) ఎ    2) ఎ, బి    3) ఎ, బి, సి    4) పైవన్నీ

వివరణ: పంచాయతీలు, స్థానిక స్వపరిపాలన పరిణామక్రమంలో పై కమిటీల్లో జీవీకే రావు కమిటీని 1985లో ప్లానింగ్‌ కమిషన్‌ గ్రామీణాభివృద్ధి, పేదరిక నిర్మూలన ఏర్పాట్లు అనే అంశాన్ని పరిశీలించడానికి రాజీవ్‌గాంధీ ప్రభుత్వం జీవీకే రావు కమిటీని నియమించారు.

13. జాతీయ పంచాయతీరాజ్‌ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? (సబ్‌ ఇన్‌స్పెక్టర్‌-2012) (4)

1) మార్చి 24    2) అక్టోబర్‌ 24    

3) ఆగస్ట 24    4) ఏప్రిల్‌ 24

వివరణ: 1993, ఏప్రిల్‌ 24న 73వ రాజ్యాంగ సవరణ చట్టం (1992) అమల్లోకి వచ్చింది. అందుకే ఏప్రిల్‌ 24న పంచాయతీరాజ్‌ దినోత్సవంగా జరుపుకొంటారు.

14. కింది వాటిలో మున్సిపాలిటీల నిధులు, వనరులకు సంబంధించి సరైన ప్రవచనం కానిదేది? (టీఎస్‌ కానిస్టేబుల్‌ 2019)    (1)

1) భారత ఆగంతుక నిధి నుంచి గ్రాంట్స్‌ ఇన్‌ ఎయిడ్‌

2) భారత ఏకీకృత నిధి (సంఘటిత నిధి) నుంచి గ్రాంట్స్‌ ఇన్‌ ఎయిడ్‌ 

3) రాష్ట్ర శాసనసభ చట్టంతో ధృవీకరించిన మున్సిపాలిటీలు, వసూలు చేసే పన్నులు

4) రాష్ట్రం వసూలు చేసిన పన్నుల నుంచి మున్సిపాలిటీలకు కేటాయించారు

వివరణ: రాజ్యాంగంలో నిబంధన 267 ప్రకారం ఆగంతుక నిధిని ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఈ నిధి నుంచి ఖర్చు చేస్తారు.

15. కింది కమిటీలను కాలానుగుణంగా వరుసక్రమంలో అమర్చండి. (సివిల్స్‌-2014)    (4)

ఎ. అశోక్‌ మెహతా కమిటీ    

బి. బల్వంత్‌ రాయ్‌ మెహతా కమిటీ

సి. ఎల్‌ఎం సింఘ్వీ కమిటీ    డి. జీవీకే రావు కమిటీ    

ఇ. సీహెచ్‌ హనుమంతరావు కమిటీ

1) ఎ, బి, సి, డి 2) డి, బి, ఎ, సి, ఇ    3) ఎ, సి, బి, డి, ఇ 4) బి, ఎ, ఇ, డి, సి

వివరణ: 1957లో స్థానిక సంస్థల పరిణామ క్రమంలో బల్వంత్‌రాయ్‌ మెహతా కమిటీని, 1977లో అశోక్‌ మెహతా కమిటీని, 1978లో దంత్‌వాలా కమిటీని, 1984లో సీహెచ్‌ హనుమంతరావు కమిటీని, 1985లో జీవీకే రావు కమిటీని, 1986లో ఎల్‌ఎం సింఘ్వీ కమిటీని నియమించారు. 

16. కింది వాటిలో పంచాయతీరాజ్‌ విధానం ప్రవేపెట్టడానికి కారణం? (సివిల్స్‌-2016)    (3)

ఎ. అభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం కోసం

బి. రాజకీయ జవాబుదారీతనం

సి. ప్రజాస్వామ్య వికేంద్రీకరణ

డి. ఆర్థిక సమీకరణ

1) ఎ, బి, సి 2) బి, డి

3) ఎ, సి 4) ఎ, బి, సి, డి

వివరణ: దేశంలో పంచాయతీరాజ్‌ విధానం ప్రవేశపెట్టడానికి కారణం అభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం కోసం, ప్రజాస్వామ్య వికేంద్రీకరణ కోసం.

17. సహకార సంఘాలను ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఏర్పాటు చేశారు? (గ్రూప్‌-2-2016)    (3)

1) 57    2) 76    3) 97    4) 91

వివరణ: 97వ రాజ్యాంగ సవరణ (2011) ద్వారా సహకార సంఘాలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించారు. 2012లో అమల్లోకి వచ్చింది. రాజ్యాంగంలో నూతనంగా 9(బి) భాగంలో నిబంధన 243(జడ్‌హెచ్‌) నుంచి 243(జడ్‌టి) వరకు ఉంది.

18. కింది వాటిలో రిప్పన్‌ తీర్మానంలోని ముఖ్యాంశాల్లో సరైనవి? (గ్రూప్‌-1-2011)    (4)

1) దేశవ్యాప్తంగా ఒకే రకమైన స్థానిక సంస్థల ఏర్పాటు 

2) స్థానిక సంస్థలకు ఆర్థికపాలనా వ్యవహారాల్లో స్వేచ్ఛనివ్వడం

3) పెద్ద పట్టణాలకు పూర్తికాలపు అధికారిని నియమించాలి     4) 1, 2

వివరణ: 1882లో స్థానిక సంస్థల అభివృద్ధిపై లార్డ్‌ రిప్పన్‌ తీర్మానం చేశాడు. రిప్పన్‌ తీర్మానాన్ని స్థానిక స్వపరిపాలనా సంస్థలకు ‘మాగ్నాకార్టా’ వంటిదిగా పేర్కొంటారు. అందుకే లార్డ్‌ రిప్పన్‌ను స్థానిక స్వపరిపాలనా పితామహుడు అంటారు.

19. కింది వాటిలో పంచాయతీ కమిటీలకు సంబంధంలేని కమిటీ? (సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌-2013)     (2)

1) సాదియా అలీ కమిటీ    

2) దినేష్‌ గోస్వామి కమిటీ

3) ఎల్‌ఎం సింఘ్వీ కమిటీ    

4) పీకే తుంగన్‌ కమిటీ

వివరణ: దినేష్‌ గోస్వామి కమిటీ (1990) ఎన్నికల సంస్కరణలకు సంబంధించినది. మిగతావి పంచాయతీ కమిటీలు.

20. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేయడానికి కనీస వయస్సు? (పంచాయతీ కార్యదర్శి-2014) (3)

1) 25 ఏండ్లు 2) 18 ఏండ్లు

3) 21 ఏండ్లు    4) 30 ఏండ్లు

వివరణ: స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి సర్పంచ్‌, వార్డ్‌ మెంబర్‌, కౌన్సిలర్‌, కార్పొరేట్‌, మేయర్‌కు కనీస వయస్సు 21 ఏండ్లు ఉండాలి.


బి. కిరణ్‌ కుమార్‌

సీనియర్‌ ఫ్యాకల్టీ

యూనిక్‌ స్టడీ సెంటర్‌

9052050729


logo