కలువ కళ్ల సుందరి కాజల్ అగర్వాల్ ఇండస్ట్రీలో 15ఏళ్లు పూర్తి చేసుకుంది. లక్ష్మీ కళ్యాణం చిత్రంతో తెరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ చందమామ సినిమాతో తొలి హిట్ అందుకుంది. ఇక అక్కడ నుండి వెనుదిరిగి చూసుకోలేదు. తెలుగు, తమిళం, హిందీ భాషలలో వైవిధ్యమైన సినిమాలు చేసిన కాజల్ పలు వెబ్ సిరీస్‌లలోను నటించింది. ప్రస్తుతం ఆచార్యలో మెగాస్టార్‌తో జోడి కట్టిన ఈ ముద్దుగుమ్మ .. కమల్ హాసన్ ఇండియన్ 2 సినిమాలోనూ నటిస్తోంది. నాగార్జున- ప్రవీణ్ సత్తారు కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా , ‘ఘోస్టీ’, డీకే దర్శకత్వంలో ఓ సినిమా, మలయాళంలో దుల్కర్ సల్మాన్ ‘హే సినామిక’ చిత్రాల్లో హీరోయిన్గా చేస్తోంది.
గత ఏడాది డిసెంబర్లో పెళ్లి పీటలెక్కిన కాజల్ వరుస సినిమాలు చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తుంది. పెళ్లి తర్వాత సినిమాలు చేయదని అనుకున్నారు. కాని ఇంతక ముందుకన్నా ఎక్కువ సినిమాలు చేస్తుంది. అయితే తాజా ఇంటర్వ్యూలో కాజల్ సినిమాలు ఎప్పుడు వదిలేస్తాననే విషయం చెప్పింది. ప్రస్తుతం నా భర్త, కుటుంబం నుండి మంచి సపోర్ట్ ఉంది. అందువల్లనే నటనపై దృష్టి పెడుతున్నాను. నా భర్త గౌతమ్ కిచ్లూ సినిమాలు చేయోద్దంటే అప్పటి నుండి సినిమాలు చేయనని కాజల్ వెల్లడించింది.