శనివారం 28 నవంబర్ 2020
Nipuna-education - Nov 15, 2020 , 10:49:35

ఇలా చదివితే స్పెషలిస్ట్‌ ఆఫీసర్లు మీరే!

ఇలా చదివితే స్పెషలిస్ట్‌ ఆఫీసర్లు మీరే!

ఐబీపీఎస్‌ ఇటీవల స్పెషలిస్ట్‌ ఆఫీసర్ల పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇదివరకే గ్రామీణ బ్యాంకుల్లో కొలువులు, పీవో, క్లరికల్‌ విభాగాల్లో భర్తీలకు ప్రకటనలు వెలువడినాయి. పరీక్షలు కూడా మొదలయ్యాయి. అయితే పలు కారణాలవల్ల వీటికి దరఖాస్తులు చేసుకోనివారు, నవంబర్‌లోగా డిగ్రీ పూర్తయినవారికి ఈ తాజా నోటిఫికేషన్‌ ఒక సువర్ణావకాశం. ఈ నోటిఫికేషన్‌ గురించి, ప్రిపరేషన్‌ ప్లాన్‌ గురించి నిపుణ పాఠకుల కోసం..

 • స్పెషలిస్ట్‌ ఆఫీసర్లు: 647
 • పీవోలు: 3517 (ఇంకా 4 బ్యాంకులు ప్రకటించలేదు)
 • క్లర్కులు: 1557 (కొన్ని బ్యాంకులు ఖాళీలను ప్రకటించలేదు)

ఎవరు అర్హులు

 • పాత నోటిఫికేషన్లు 2019, జూలై నుంచి ఐబీపీఎస్‌ ద్వారా వెలువడిన గ్రామీణ బ్యాంకు, పీఓ, క్లర్కులకు దరఖాస్తు చేసుకోనివారు, నవంబర్‌ 11లోగా డిగ్రీ పట్టా పొందినవారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
 • నోట్‌: ఐబీపీఎస్‌-ఆర్‌ఆర్‌బీ గ్రామీణ బ్యాంకులకు ప్రథమ పరీక్ష పూర్తయ్యింది. వీటికి దరఖాస్తు చేసి, పరీక్ష రాయనివారు అర్హులు కాదు.

ఐబీపీఎస్‌ గ్రామీణ బ్యాంకు పోస్టులకు..

 • ఏదేని డిగ్రీ ఉత్తీర్ణులు. 2020, నవంబర్‌ 9 వరకు పట్టుభద్రులై ఉండాలి.
 • ప్రథమ పరీక్ష: ఆఫీసర్‌ స్కేల్‌-1 2020, డిసెంబర్‌ 31
 • ఆఫీస్‌ అసిస్టెంట్‌ 2021, జనవరి 2, 4
 • ప్రధాన పరీక్ష: 2021, ఫిబ్రవరి (పాత, కొత్త అభ్యర్థులకు కలిపి)

పీఓ

 • 2020, నవంబర్‌ 11లోపు డిగ్రీ పూర్తయినవారు, గత నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోనివారు అర్హులు.
 • పరీక్ష తేదీలు 2021, జనవరి 5, 6
 • ప్రధాన పరీక్ష: 2021, ఫిబ్రవరి
 • మొత్తం పోస్టులు: 3517 (పూర్వం 1167)

క్లరికల్‌

 • 2020, నవంబర్‌ 6లోపు డిగ్రీ పట్టా పొందినవారు. పూర్వ నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోనివారు.
 • ప్రథమ పరీక్ష: 2020, డిసెంబర్‌ 5, 12, 13
 • ప్రధాన పరీక్ష: 2021, జనవరి 24

స్పెషలిస్ట్‌ ఆఫీసర్స్‌

 • బ్యాంకు ప్రత్యేక అధికారి పోస్టులకు ఐబీపీఎస్‌ ద్వారా తాజా (02-11-2020) నోటిఫికేషన్‌ వెలువడింది. 11 ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఉమ్మడిగా కామన్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాసెస్‌ (సీఆర్‌పీ) ద్వారా ఐబీపీఎస్‌ భర్తీ ప్రక్రియను నిర్వహిస్తుంది. సమ్మిళిత అభివృద్ధిలో భాగంగా బ్యాంకులు వివిధ ఆర్థిక కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఆధునిక సాంకేతిక సాధనాలను జోడించి భారత బ్యాంకింగ్‌ కార్యకలాపాలను ప్రపంచంలో అగ్రభాగాన నిలిపేందుకు భారత బ్యాంకింగ్‌ రంగం ఎంతగానో కృషిచేస్తుంది. ఎక్స్‌పర్ట్‌ పద్ధతులను అలవర్చుకుంటూ ముందుకు సాగుతున్నాయి.
 • వివిధ విభాగాల్లో నిపుణులను నియమించుకుంటున్నాయి. వీటిలో ఐటీ, మార్కెటింగ్‌, హెచ్‌ఆర్‌, లా, అగ్రికల్చర్‌, రాజ్‌భాషా అధికారి పోస్టులు ఉన్నాయి. బ్యాంకింగ్‌ కార్యకలాపాలు, ఇంటర్నెట్‌ మొబైల్‌ బ్యాంకింగ్‌ కోసం ఐటీ ఆఫీసర్లు, వస్తు, సేవల ఉత్పత్తి, ప్రచారాలకు మార్కెటింగ్‌ నిపుణులు, స్టాఫ్‌ వర్కింగ్‌ విధానాలు, నియామకాలు, మానవవనరుల అభివృద్ధి కోసం హెచ్‌ఆర్‌ సిబ్బంది, గ్రామీణ బ్యాకింగ్‌, వ్యవసాయ తదితర వినియోగదారుల కోసం అగ్రికల్చర్‌ ఫీల్డ్‌ ఆఫీసర్లు, బ్యాంకు న్యాయపరమైన అంశాలను లా ఆఫీసర్లు, కమ్యూనికేషన్‌ డెవలప్‌మెంట్‌ కోసం రాజ్‌భాషా అధికారి వంటి ప్రత్యేక అధికారులను ఆయా విభాగానికి సేవలు అందిస్తారు.
 • ఐబీపీఎస్‌-సీఆర్‌పీ ఎస్‌పీఎల్‌-X నోటిఫికేషన్‌ ప్రకారం కేవలం మూడు నెలల్లోనే పరీక్షలు నిర్వహించి నియమకాలు చేపట్టనున్నాయి.

ఎలా చదవాలి?

 • ప్రొఫెషనల్‌ నాలెడ్జ్‌లో మెళకువలు నేర్చుకుంటే సరిపోతుంది. ప్రొఫెషనల్‌ నాలెడ్జ్‌ కోసం పీఓ స్పెషలైజేషన్‌ సబ్జెక్ట్స్‌ను క్షుణ్ణంగా చదవాలి. పరీక్ష ఆబ్జెక్టివ్‌ తరహాలో ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు కూడా మల్టిపుల్‌ చాయిస్‌ క్వశ్చన్స్‌ మాదిరి ప్రశ్నలు సాధన చేయాలి. ఇవి ఇంటర్నెట్‌లోగాని, పోటీ పరీక్షల పబ్లికేషన్స్‌ (కిరణ్స్‌ లేదా అరిహంత్‌)లో లభ్యమవుతాయి.
 • కామన్‌ సబ్జెక్ట్స్‌ అర్థమెటిక్‌, రీజనింగ్‌, ఇంగ్లిష్‌, జనరల్‌ అవేర్‌నెస్‌లు కూడా ప్రిపేర్‌ కావాలి. 

సబ్జెక్టులవారీగా..

 • బ్యాంకు పరీక్షల్లో అర్థమెటిక్‌, రీజనింగ్‌ మెయిన్‌ సిలబస్‌. 60 శాతం మార్కులు ఈ విభాగాల నుంచే వస్తాయి. బ్యాంకు పరీక్షలకు సన్నద్ధమయ్యేవారు 10 చాప్టర్లపై దృష్టిపెట్టి పూర్తి సామర్థ్యాలతో సాధన చేయాలి. అతి ముఖ్యమైన చాప్టర్లు అంటే ఒకే అంశాల నుంచి 4-5 ప్రశ్నలు వచ్చేవి. వీటిని గుర్తించి సమయాన్నిబట్టి ప్రిపేరైతే ఉద్యోగం సాధించవచ్చు.
 • ఇందులో అర్థమెటిక్‌ నుంచి సింప్లికేషన్స్‌, నంబర్‌ సిరీస్‌, క్వాడ్రాటిక్‌ ఈక్వేషన్స్‌, డాటా ఇంటర్‌ప్రిటేషన్స్‌ వంటివి ప్రిలిమ్స్‌, మెయిన్‌లో వస్తాయి. 60-70 శాతం ప్రశ్నలు పై అంశాల నుంచి వస్తాయి. 1-2 ప్రశ్నలు పర్సంటేజీ, యావరేజెస్‌, పార్ట్‌నర్‌షిప్‌, రేషియో ప్రమోషన్స్‌, వడ్డీ, లాభ-నష్టాలు వంటి చాప్టర్ల నుంచి వస్తాయి.
 • రీజనింగ్‌ నుంచి పజిల్స్‌, సీటింగ్‌ అరెంజ్‌మెంట్స్‌, కోడింగ్‌ డికోడింగ్‌, డైరెక్షన్స్‌, బ్లడ్‌ రిలేషన్స్‌, సిలాజిసమ్స్‌, ఇన్‌పుట్‌, అవుట్‌పుట్‌, వెన్‌డయాగ్రమ్స్‌ వంటివి చదవాలి.
 • రీజనింగ్‌లో వెర్బల్‌-నాన్‌వెర్బల్‌ అంశాలపై పట్టు సాధించాలి.
 • రీజనింగ్‌ ద్వారా అభ్యర్థి మేధాశక్తి, నిర్ణయాత్మక శక్తి పరీక్షిస్తుంటారు. అంటే తక్కువ సమయంలో సమస్యల్ని, సవాళ్లను ఎలా ఎదుర్కొంటారో అంచనా వేయవచ్చు.
 • అర్థమెటిక్‌, రీజనింగ్‌లకు కచ్చితమైన ప్రణాళిక, నిరంతరం శ్రమతో మంచి మార్కులు సాధించవచ్చు.

పోస్టుల వివరాలు

 • స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ (ఐటీ)- స్కేల్‌-1 20
 • అగ్రికల్చర్‌ ఫీల్డ్‌ ఆఫీసర్‌ స్కేల్‌-2 485
 • రాజ్‌భాష అధికారి స్కేల్‌-1 25
 • లా ఆఫీసర్‌ స్కేల్‌-1- 50
 • హెచ్‌ఆర్‌/పర్సనల్‌ ఆఫీసర్‌ స్కేల్‌-1- 7
 • మార్కెటింగ్‌ ఆఫీసర్‌ స్కేల్‌-1- 60
 • ఆన్‌లైన్‌ దరఖాస్తు: నవంబర్‌ 23 వరకు
 • ప్రిలిమినరీ: డిసెంబర్‌ 26, 26
 • మెయిన్‌: 2021, జనవరి 24
 • ఇంటర్వ్యూ: 2021, ఫిబ్రవరి
 • వయస్సు: 20-30 ఏండ్లు (రిజర్వేషన్‌ అభ్యర్థులకు సడలింపులు ఉంటాయి)

అర్హతలు