పానీయాల రాణి అని దేనిని అంటారు?

1. తాబేళ్లకు సంబంధించి సరైన జత?
1) మంచినీటి తాబేళ్లు- టెర్రాపిన్స్
2) సముద్ర తాబేళ్లు- టర్టిల్స్
3) నేల తాబేళ్లు- టార్టాయిస్ 4) పైవన్నీ
2. పాములు, వాటి శాస్త్రీయ నామాలకు
సంబంధించి తప్పుగా ఉన్న జత?
1) నాగుపాము - నాజానాజా
2) రాచనాగు - నాజా హన్నా
3) కట్లపాము - బంగారస్ సిరులస్
4) రక్తపింజర - క్రొటాలస్
3. మొసలిలోని హృదయ గదుల సంఖ్య?
1) 2 2) 1 3) 3 4) 4
4. నిలబడి గుడ్లు పెట్టే పక్షి?
1) ఆస్ట్రిచ్ 2) ఈము 3) పెంగ్విన్ 4) నెమలి
5. భూమి మీద అతిపెద్ద జంతువు?
1) నీలి తిమింగలం 2) ఆఫ్రికా ఏనుగు
3) మైసూర్ ఎద్దు 4) ఒంటె
6. ఎడారిలో పెరిగే మొక్కలను ఏమంటారు?
1) సయోఫైట్స్ 2) ఎరిమోఫైట్స్
3) క్రయోఫైట్స్ 4) ఏదీకాదు
7. అతి చిన్న విత్తనం?
1) ఆర్కిడ్ 2) ఆముదం 3) పెసర 4) మినుము
8. వేర్ల అభివృద్ధిని ప్రేరేపించే వృద్ధి నియంత్రకం?
1) అబ్‌సైసిక్ ఆమ్లం 2) సైటోకైనిన్ 3) ఆక్సిన్ 4) అన్నీ
9. కింది వాటిలో వేరు కూరగాయ?
1) చామగడ్డ 2) కందగడ్డ 3) ఉల్లి 4) చిలగడ దుంప
10. వేర్లలో ఔషధ గుణాలు ఉన్న మొక్క?
1) సర్పగంధ 2) అశ్వగంధ 3) బెల్లడోన 4) పైవన్నీ
11. జంతువుల ప్రవర్తనను గురించిన
అధ్యయనాన్ని ఏమంటారు?
1) ఇథాలజీ 2) సీటాలజీ 3) ఎకాలజీ 4) ఫ్రినాలజీ
12. కలప, ఎముక, కర్పరాల శిలాజాల వయస్సు
తెలుసుకోవడానికి దేనిని ఉపయోగిస్తారు?
1) యురేనియం 238 2) స్ట్రాన్షియం 90
3) కార్బన్ 14 4) ఆర్గాన్ ఐసోటోప్
13. వరల్డ్ వైల్డ్‌లైఫ్ ఫండ్‌కు ఏ జంతువు చిహ్నంగా ఉన్నది?
1) పోలార్ బేర్ 2) జెయింట్ పాండా
3) పులి 4) హార్న్‌బిల్
14. చేప అనేది?
1) ఉష్ణరక్త జీవి 2) శీతల రక్త జీవి
3) రక్త రహిత జీవి 4) తెల్ల రక్త జీవి
15. సీతాకోక చిలుకలో ఎన్ని కాళ్లు ఉంటాయి?
1) 4 2) 2 3) 6 4) 8
16. పానీయాల రాణి అని దేనిని అంటారు?
1) టీ 2) కాఫీ 3)నిమ్మ రసం 4) మామిడి పండ్ల రసం
17. జీవితకాలంలో ఒకేసారి పండ్లను ఇచ్చే వృక్షం?
1) అరటి 2) మామిడి 3) స్ట్రాబెర్రీ 4) ఆపిల్
18. ఆకులు, పండ్లు రాలిపోవడానికి
కారణమయ్యే ఫైటో హార్మోన్?
1) ఐఏఏ 2) ఎన్ఏఏ
3) జిబ్బరెలిన్ 4) అబ్‌సైసిక్ ఆమ్లం
19. సజీవులు, ఇఇఇఇఇర్జీవులకు మధ్య సంధానకర్త?
1) ప్రొటోజువా 2) బ్యాక్టీరియా
3) వైరస్ 4) ఆర్ఎన్ఏ
20. పయేరియా వ్యాధి దేనికి సంబంధించినది?
1) ముక్కు 2) ఊపిరితిత్తులు
3) గుండె 4) చిగుళ్లు
21. కింది వాటిలో అంటు వ్యాధి కానిది?
1) ప్లేగు 2) కుష్టు 3) క్షయ 4) ఏదీకాదు
22. కింది వాటిలో భిన్నమైనదానిని గుర్తించండి?
1) కామెర్లు 2) టైఫాయిడ్
3) క్షయ 4) న్యుమోనియా
23. కింది వాటిలో భిన్నమైనదానిని గుర్తించండి?
1) చర్మం 2) కన్ను 3) ముక్కు 4) మెదడు
24. ఇన్సులిన్ లోపంవల్ల కలిగే వ్యాధి?
1) డయాబెటిస్ మొల్లిటస్ 2) డయాబెటిస్ ఇన్సిపిడస్
3) పెల్లాగ్రా 4) డయాబెటిస్ యూరినాలిస్
25. అంతర చెవి ప్రధాన విధి?
1) వినికిడి 2) సమతాస్థితి
3) ధ్వని ఉత్పాదన 4) నీటిలోని మార్పులను పసిగట్టడం
26. మానవ దేహంలోని మొత్తం ఎముకల సంఖ్య?
1) 218 2) 212 3) 208 4) 206
27. మానవ దేహంలో అతిగట్టి భాగం?
1) దంతం 2) ఎముకలు 3) గోళ్లు 4) అన్నీ
28. గ్లూకోజ్ అనేది ఒక.....?
1) మోనోశాఖరైడ్ 2)హెక్సోజ్ 3) ఆల్డోజ్ 4) అన్నీ
29. మానవుడి సొల్లులో ఉండే ఎంజైమ్?
1) రెనిన్ 2) అమైలేజ్ 3) లైపేజ్ 4) ప్రోటియేజ్
30. పిండి పదార్థాలు ఏ రుచిని కలిగి ఉంటాయి?
1) తీపి 2) చేదు 3) పులుపు 4) మింట్
31. లాలాజలం దేనిని జీర్ణం చేయడానికి
తోడ్పడుతుంది?
1) పిండి పదార్థాలు 2) మాంసకృత్తులు
3) కొవ్వులు 4) అన్నీ
32. ‘పోర్చుగీస్ మ్యాన్ ఆఫ్ వార్' అని దేనిని అంటారు?
1) హైడ్రా 2) బబిలియా 3) ఫైసేలియా 4) ఏదీకాదు
33. పంది బద్దెపురుగు అని దేనిని అంటారు?
1) టీనియా సోలియం 2) ఇకైనోకోకస్ గ్రాన్యులోసస్
3) ఫాషియేలా 4) షిష్టోసోమా
34. కింది వాటిలో సరైన జత?
1) హైరుడినేరియా- మంచినీటి జలగ
2) పాంటోబ్డిల్లా- సముద్ర జలగ
3) హిడిప్సా- భూచర జలగ 4) పైవన్నీ
35. ఆంఫిడ్లు అనేవి నిమటోడ్లలో ఉంటాయి.
అయితే ఇవి ....
1) రసాయన గ్రాహకాలు 2) ఊష్ణ గ్రాహకాలు
3) పీడన గ్రాహకాలు 4) ఏదీకాదు
36. జ్వాలా కణాలు విసర్జక కణాలుగా కలిగిన జీవులు?
1) ప్లాటిహెల్మింథిస్ 2) నిమాటి హెల్మింథిస్
3) అనెలిడా 4) ఆర్థ్రోపొడా
37. జీవావరణ వ్యవస్థలో శక్తికి మూలం?
1) మొక్కలు 2) జంతువులు
3) సూర్యుడు 4) గ్లూకోజ్
38. జలాశయాల అడుగున జీవించేవాటిని ఏమంటారు?
1) పెలాజిక్ జీవులు 2) బెంథిక్ జీవులు
3) న్యూస్టాన్లు 4) నెక్టాన్లు
39. హంగరీ దేశపు గడ్డినేలలను ఏమని పిలుస్తారు?
1) పంపా 2) వెల్డ్ 3) పుస్జా 4) ప్రయరీ
40. వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎక్కడ ఉంది?
1) బెంగళూరు 2) డెహ్రాడూన్
3) హైదరాబాద్ 4) చెన్నై
41. ఇడుక్కి అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది?
1) హర్యానా 2) కర్ణాటక 3) తమిళనాడు 4) కేరళ
తాజావార్తలు
- ‘ప్రాపర్టీ ట్యాక్స్'తో పరిష్కారం
- పట్టభద్ర ఓటర్లు 181 %పెరుగుదల
- రిజర్వేషన్ల నిర్ణయంపై హర్షం
- ఉచితంగానే వ్యాధి నిర్ధారణ పరీక్షలు
- పాదచారులకు పై వంతెనలు
- అభివృద్ధే ధ్యేయంగా ముందుకుసాగాలి
- ట్రేడ్ లైసెన్స్ ఇక తప్పనిసరి
- వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తాం
- ‘వయోధికుల సమస్యలు పరిష్కరిస్తా’
- కార్పొరేట్‌ను మించి సేవలు