సోమవారం 26 అక్టోబర్ 2020
Nipuna-education - Sep 30, 2020 , 04:23:22

జోసా 2020

జోసా 2020

 • జాయింట్‌ సీట్‌ అలొకేషన్‌ అథారిటీ

ప్రపంచంలో క్లిష్టమైన పరీక్షల్లో ఒకటైన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష ముగిసింది. అక్టోబర్‌ 5న  ఫలితాలు విడుదల చేయనున్నారు. దీంతో జాతీయప్రాముఖ్యం కలిగి ఇంజినీరింగ్‌ విద్యకు ఐకాన్‌లుగా నిలుస్తున్న ఐఐటీల్లో, ఆ తర్వాతి స్థానాల్లో ఉన్న ఎన్‌ఐటీ, ఐఐఐటీల్లో ప్రవేశాలకు తెరలేచింది. మరో వారంలో ఈ ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రవేశాలు కల్పించే సంస్థలు, ముఖ్యతేదీలు నిపుణ పాఠకుల కోసం..

జేఈఈ: జాయింట్‌ ఎంట్రన్స్‌ ఇంజినీరింగ్‌ ఎగ్జామ్‌ (మెయిన్‌, అడ్వాన్స్‌డ్‌) ద్వారా అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ ప్రకియను జాయింట్‌ సీట్‌ అలొకేషన్‌ అథారిటీ నిర్వహిస్తుంది. గత ఐదేళ్లుగా  ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ ఐటీలు, సీఎఫ్‌టీఐల్లో ప్రవేశానికి ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహిస్తున్న ఉమ్మడి కౌన్సెలింగ్‌ ప్రక్రియ జోసా. 

 • జోసా-2020 కౌన్సెలింగ్‌ ద్వారా ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ ఐటీలు, సీఎఫ్‌టీఐలు.. ఇలా మొత్తం 111 ఇన్‌స్టిట్యూట్స్‌లో ప్రవేశాలు కల్పిస్తారు. జేఈఈ మెయిన్‌ ఉత్తీర్ణులు ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ ఐటీలు, సీఎఫ్‌టీఐల్లో కౌన్సెలింగ్‌, ఛాయిస్‌ ఫిల్లింగ్‌కు అర్హులు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ అభ్యర్థులు ఐఐటీలు సహా అన్ని ఇన్‌స్టిట్యూట్‌లకు అర్హులే. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు అక్టోబర్‌ 5న వెలువడనున్నాయి.


ముఖ్యతేదీలు

 • అక్టోబర్‌ 6-15: జోసా వెబ్‌సైట్‌లో అభ్యర్థుల రిజిస్ట్రేషన్‌, ఛాయిస్‌ ఫిల్లింగ్‌ ప్రక్రియ ప్రారంభం.
 • అక్టోబర్‌12: మాక్‌ సీట్‌ అలొకేషన్‌ (సీట్ల కేటాయింపు నమూనా జాబితా)-1 విడుదల.
 • అక్టోబర్‌ 14: మాక్‌ సీట్‌ అలొకేషన్‌ (సీట్ల కేటాయింపు నమూనా జాబితా)-2 విడుదల.
 • అక్టోబర్‌ 16: మాక్‌ సీట్‌ అలొకేషన్‌ ఆధారంగా ఇన్‌స్టిట్యూట్‌, బ్రాంచ్‌, ఇతర వివరాలను మార్చుకునే అవకాశం.
 • అక్టోబర్‌ 17: మొదటి దశ సీట్ల కేటాయింపు. (రౌండ్‌-1)
 • అక్టోబర్‌ 17-19: మొదటి దశలో సీట్లు పొందిన విద్యార్థులు ఆన్‌లైన్‌ రిపోర్టింగ్‌ చేయాల్సి ఉంటుంది.
 • అక్టోబర్‌ 21: భర్తీ అయిన సీట్లు, ఇంకా అందుబాటులో ఉన్న సీట్లు వివరాలు వెల్లడి.
 • అక్టోబర్‌ 21 సాయంత్రం 5 గంటలకు రెండో దశ సీట్ల కేటాయింపు. (రౌండ్‌-2)
 • అక్టోబర్‌ 22-23: రెండో దశలో సీట్లు పొందిన విద్యార్థుల ఆన్‌లైన్‌ రిపోర్టింగ్‌.
 • అక్టోబర్‌ 22- 24: రెండోదశ అలొకేషన్‌ ఉపసంహరణ.
 • అక్టోబర్‌ 26: రెండోదశ తర్వాత అందుబాటులో ఉన్న సీట్ల వివరాల వెల్లడి. అదే రోజు సాయంత్రం మూడో దశ సీట్ల కేటాయింపు.
 • అక్టోబర్‌ 27-28: మూడోదశ సీట్ల కేటాయింపు పొందిన విద్యార్థుల ఆన్‌లైన్‌ రిపోర్టింగ్‌.
 • అక్టోబర్‌ 27-29: మూడోదశ నుంచి ఉపసంహరణ
 • అక్టోబర్‌ 30: నాలుగో దశ సీట్ల కేటాయింపు. 
 • (మూడో దశలో భర్తీ అయిన సీట్లు, అందుబాటులో ఉన్న సీట్ల వివరాల వెల్లడి)
 • అక్టోబర్‌ 31-నవంబర్‌ 1: నాలుగో దశ సీట్ల కేటాయింపునకు సంబంధించి ఆన్‌లైన్‌ రిపోర్టింగ్‌.
 • అక్టోబర్‌ 31-నవంబర్‌ 2: నాలుగో దశ కేటాయింపుల ఉపసంహరణ.
 • నవంబర్‌ 3: అయిదో దశ సీట్ల కేటాయింపు.
 • నవంబర్‌ 4-5: అయిదో దశ ఆన్‌లైన్‌ రిపోర్టింగ్‌
 • నవంబర్‌ 4-6: సీట్‌ ఉపసంహరణ, ఎగ్జిట్‌ ఆప్షన్‌కు చివరి అవకాశం.
 • నవంబర్‌ 7: ఆరో దశ (ఐఐటీలకు చివరి దశ) సీట్ల కేటాయింపు.
 • నవంబర్‌ 9-13: ఎన్‌ఐటీ ప్లస్‌ సిస్టమ్‌ విధానంలో సీట్లు పొందిన విద్యార్థులు ఆయా ఇన్‌స్టిట్యూట్‌లలో వ్యక్తిగతంగా హాజరై డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ చేయించుకోవాలి.

పూర్తి సమాచారం కోసం వెబ్‌సైట్‌ : http://josaa.nic.in

23 ఐఐటీలు: భిలాయ్‌, వారణాసి, భువనేశ్వర్‌, బాంబే, ఢిల్లీ, గాంధీనగర్‌, గోవా, గువాహటి, హైదరాబాద్‌, ఇండోర్‌, ధన్‌బాద్‌, జమ్ము, జోధ్‌పూర్‌, కాన్పూర్‌, కర్ణాటక (ధార్వాడ్‌), ఖరగ్‌పూర్‌, మద్రాస్‌, మండి, పాలక్కడ్‌, పాట్న, రూర్కీ, రోపర్‌, తిరుపతి.

32 ఎన్‌ఐటీ (నిట్‌)లు: జలంధర్‌, జైపూర్‌, భోపాల్‌, అలహాబాద్‌, అగర్తలా, ఆంధ్రప్రదేశ్‌ (తాడేపల్లిగూడెం), కాలికట్‌, ఢిల్లీ, దుర్గాపూర్‌, గోవా, హమీపూర్‌, సూరత్‌కల్‌, మేఘాలయ, పాట్న, పుదుచ్చేరి, రాయ్‌పూర్‌, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్‌, జంషెడ్‌పూర్‌, కురుక్షేత్ర, మణిపూర్‌, మిజోరం, రూర్కెలా, సిల్చార్‌, శ్రీనగర్‌, తిరుచిరాపల్లి, ఉత్తరాఖండ్‌, వరంగల్‌, సూరత్‌, నాగ్‌పూర్‌, ఐఐఈఎస్‌టీ శిబ్‌పూర్‌.

వీటితోపాటు 26 ఐఐటీలు, 30 జీఐఎఫ్‌టీల్లో ప్రవేశాలు కల్పిస్తారు.‘


 • For any query related to IITs admission, please contact
 • Organizing Chairman
 • JEE (Advanced) 2020
 • IIT Delhi, Hauz Khas
 • New Delhi- 110016
 • Phone: +91 11 26591785
 • E-mail: jeeadv[at]admin[dot]iitd[dot]ac[dot]in


 • For any query related to NITs, IIEST Shibpur, IIITs and Other-GFTIs admission, 
 • Please Contact
 • Chairman
 • CSAB-2020 & Director
 • MNNIT Allahabad
 • Prayagraj - 211004
 • Email: helpcsab2020[at]mnnit[dot]ac[dot]in
 • Phone: +91-532-2546144logo