సోమవారం 26 అక్టోబర్ 2020
Nipuna-education - Sep 30, 2020 , 04:06:59

ప్రణాళికతో జీఎస్‌పై పట్టు

ప్రణాళికతో జీఎస్‌పై పట్టు

1. భారత జాతీయ గీతాన్ని రాసింది?

(బంకించంద్ర చటర్జీ)

2. బల్బ్‌లోని ఫిలమెంట్‌ను దేనితో తయారు చేస్తారు? (టంగ్‌స్టన్‌)

3. బీఆర్‌ఐసీఎస్‌ (బ్రిక్స్‌)లో ‘బి’ ఏ దేశాన్ని సూచిస్తుంది?  (బ్రెజిల్‌)

4. బెంగాల్‌ దుఃఖదాయిని అని 

ఏ నదిని పిలుస్తారు? (దామోదర్‌ నది)

5. ఇటీవల మృణాళిని సారాబాయి మృతి చెందారు. ఆమె ఏ రంగంలో నిష్ణాతులు?

(క్లాసికల్‌ డ్యాన్సర్‌)

6. భారత రాజ్యాంగాన్ని తొలిసారి 

ఎప్పుడు సవరించారు? (1951)

7. ఎవరి తర్వాత అశోకుడు రాజయ్యాడు? 

(బిందుసారుడు)

  •   ఇవన్నీ 2016 ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీలో అడిగిన ప్రశ్నలు. చరిత్ర, పాలిటీ, జాగ్రఫీ, సైన్స్‌ (ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీ), కరెంట్‌ అఫైర్స్‌ విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు. డిసెంబర్‌ 16న పరీక్ష జరుగనున్నది. ఒక ప్రణాళిక ప్రకారం చదివితే జనరల్‌ స్టడీస్‌లో మంచి స్కోర్‌ సాధించేందుకు అవకాశం ఉంది. అంశాలవారీగా ఎలా సిద్ధం కావాలో పరిశీలిస్తే..
  •   చరిత్ర-సంస్కృతి: చరిత్రలో ముఖ్యంగా రాజవంశాలు-ప్రత్యేకతలపై దృష్టి సారించాలి. అలాగే ముఖ్య రాజవంశాల్లో రాజుల క్రమాన్ని నేర్చుకోవాలి (మౌర్య, గుప్త, పల్లవ, చోళ, ఖిల్జీ, మొఘలులు). అదేవిధంగా దేవాలయాలు, నిర్మాణాలు (కోణార్క్‌ దేవాలయాన్ని నిర్మించింది ఎవరు అని అడిగారు నరసింహదేవ) నేర్చుకోవాలి. ముఖ్య రాజవంశాల సమయంలో పాలన తీరును చదవాలి. అలాగే సాంఘిక వ్యవస్థను ఆయా కాలాల్లో ఎలా ఉందో అధ్యయనం చేయాలి. ఆధునిక భారత దేశ చరిత్రలో వివిధ పోరాటాల్లో పాల్గొన్న నాయకులు-వారి పాత్ర, స్వాతంత్య్ర పోరాటంలో ముఖ్య ఘట్టాలు కాలక్రమం-ముఖ్యతేదీలు గుర్తు పెట్టుకోవాలి. సంస్కృతి అంశం నుంచి కూడా ప్రశ్నలు అడుగుతున్నారు. గతంలో అడిగిన ప్రశ్నలు చూస్తే కూచిపూడి ఏ రాష్ర్టానికి చెందింది (ఆంధ్రప్రదేశ్‌)?. అలాగే ఏ దేశంలో గోల్డెన్‌ టెంపుల్‌ ఆఫ్‌ దంబులా ఉంది అని అడిగారు (శ్రీలంకలో). దేశ వ్యాప్తంగా ఉన్న దేవాలయాలు-వాటి నిర్మాతలు, దేవాలయ నిర్మాణ శైలి కూడా తెలుసుకోవాలి. అలాగే నాట్యాలు-రాష్ర్టాలు, చరిత్రలో పుస్తకాలు-రచయితలు, నగరాలు- నిర్మాతలు చదవాలి. 
  •   పాలిటీ: రాజ్యాంగంలోని వివిధ భాగాలు, వివిధ షెడ్యూల్స్‌-అవి ఏ అంశాలు చెప్తున్నాయో తెలుసుకోవాలి. ముఖ్యమైన రాజ్యాంగ సవరణలు-సవరించిన అంశాలు, సంవత్సరాలు. అలాగే ముఖ్యమైన ఆర్టికల్స్‌ (ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, కేంద్ర ప్రభుత్వం, రాజ్యాంగబద్ధ సంస్థలు, ఆర్టికల్స్‌, అలాగే ప్రతి పదవిలో ఉన్న ప్రస్తుత వ్యక్తి, తొలి వ్యక్తి (ఉదాహరణకు  తొలి ప్రధాన ఎన్నికల కమిషనర్‌- సుకుమార్‌ సేన్‌, ప్రస్తుతం సునీల్‌ ఆరోరా)
  •   జాగ్రఫీ: ఇది భారత్‌, అలాగే భౌతిక జాగ్రఫీ కూడా చదవాలి. ముఖ్యంగా వివిధ భూస్వరూపాలు వాటికి సంబంధించిన అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. నదులు-
  • జన్మస్థలాలు-ఉపనదులను నేర్చుకోవాలి.  అలాగే భారత్‌లో ఆడవుల విస్తరణ, వివిధ రకాల భూములు, వాటి స్వభావం, పంటలు-రాష్ర్టాలు తదితర అంశాలు కీలకం. 
  •   సైన్స్‌: రోజువారీ సైన్స్‌ అంశాలనే ప్రశ్నలుగా అడుగుతున్నారు. ఉదాహరణకు 2016లో నిర్వహించిన పరీక్షలో సైన్స్‌ నుంచి అడిగిన ప్రశ్నలను పరిశీలిస్తే.. కిడ్నీలో వచ్చే రాళ్లలో ఉండేది (కాల్షియం ఆక్సలేట్‌), గ్లూకోజ్‌ రసాయనిక నామం.. ఇలా నిత్య జీవితంలో ఉండే సైన్స్‌ అంశాల నుంచి ఎక్కవగా ప్రశ్నలు అడుగుతున్నారు. 
  •   ఆర్థికాంశాలు: ముఖ్య పథకాలు, ప్రణాళికలు-లక్ష్యాలు, ఆర్థిక రంగంలో ఇటీవల కాలంలో వచ్చిన మార్పులు, వివిధ ఆర్థిక వ్యవస్థలు (నీతి ఆయోగ్‌, ఆర్థిక సంఘం, సెబీ, ఐఆర్‌డీఏ) నిర్మాణం, తదితర అంశాలను పరిశీలించాలి. 
  •   జనరల్‌నాలెడ్జ్‌: దేశాలు-రాజధానులు, వివిధ అంశాలకు సంబంధించి ‘తొలి’ అంశాలు (ఉదాహరణకు 2016 పరీక్షలో ఐఎన్‌సీ తొలి అధ్యక్షుడు ఎవరు అని అడిగారు), శాస్ర్తాలు-అధ్యయనాలు (రక్తాన్ని చదివే శాస్ర్తాన్ని ఏమంటారు అని అడిగారు-హెమటాలజీ), దినోత్సవాలు (ఉదాహరణకు ప్రపంచ ట్యూబర్‌క్యులోసిస్‌ డే ఎప్పుడు అని అడిగారు), ఇలా జనరల్‌ నాలెడ్జ్‌ అంశాలను అధ్యయనం  చేయాలి.
  •   కరెంట్‌ అఫైర్స్‌: ఇటీవలి కాలంలో జరిగిన ముఖ్య నియామకాలు, అవార్డులు, మృతులు అలాగే జాతీయ, అంతర్జాతీయ సంఘటనల నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు. వార్తల్లో నిలిచిన దేశాల రాజధానులను కూడా అధ్యయనం చేయాలి. 
  •   ప్రణాళిక కీలకం: అక్టోబర్‌ 1 నుంచి పరిశీలిస్తే సుమారుగా 75 రోజుల సమయం ఉంది. కాబట్టి అభ్యర్థులు ప్రతి సబ్జెక్టుకు నిర్ణీతంగా కొన్ని రోజులు కేటాయించుకోవడంతో పాటు పాత ప్రశ్నలను ప్రాక్టీస్‌ చేయాలి. మాక్‌ టెస్ట్‌లు రాయడం తప్పనిసరి. డిగ్రీలో భాగంగా చదివిన సబ్జెక్ట్‌ ప్రశ్నలు తేలికగా గుర్తిస్తారు. కాబట్టి ఇతర అంశాలపై ఎక్కువ సాధన చేయాలి. 

వి.రాజేంద్ర శర్మ

ఫ్యాకల్టీ, vyoma.net

9849212411logo