సోమవారం 26 అక్టోబర్ 2020
Nipuna-education - Sep 23, 2020 , 03:37:51

కరెంట్ అఫైర్స్ అనాలిసిస్

కరెంట్ అఫైర్స్ అనాలిసిస్

హిల్సా చేప ఏ దేశంలో కనిపిస్తుంది?

1. ఖరాయ్ ఒంటెలు భారత్ ఏ రాష్ట్రంలో కనిపిస్తాయి? (సి)

ఎ) మధ్యప్రదేశ్ బి) బీహార్

     సి) గుజరాత్           డి) రాజస్థాన్

-వివరణ: ఖరాయ్ ఒంటెలు కేవలం గుజరాత్ కచ్ ప్రాంతంలో ఉంటాయి. డ్రైల్యాండ్స్ పాటు సముద్రంలో కూడా జీవించగలిగే సామర్థ్యం వీటికి ఉంది. సముద్రంలో మూడు కిలోమీటర్ల మేర ఇవి ఈదగలవు. వీటిని రక్షించేందుకు నేషనల్ రిసెర్చ్ సెంటర్ ఆన్ క్యామిల్ (ఒంటెలపై జాతీయ పరిశోధన సంస్థ) శాఖను ఏర్పాటు చేయబోతున్నారు. రాజస్థాన్ బికనీర్ నేషనల్ రిసెర్చ్  సెంటర్ ఆన్ క్యామిల్ ఉంది. 

2. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు అనుసంధానం చేస్తూ సావరిన్ బాండ్లను విడుదల చేసిన తొలి దేశం? (డి)

ఎ) నార్వే బి) స్విట్జర్లాండ్

     సి) న్యూజిలాండ్ డి) మెక్సికో

-వివరణ: సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు అనుసంధానం చేస్తూ సావరిన్ బాండ్లను విడుదల చేసిన తొలి దేశం మెక్సికో. ఇది ఉత్తర అమెరికా ఖండంలో దక్షిణ భాగాన ఉంది. ఏడేండ్ల వ్యవధి గల ఈ బాండ్లు 1.3 నుంచి 1.6 శాతం మేర కొనుగోలుదారుడికి వడ్డీని ఇస్తాయి. ఈ పద్ధతి ద్వారా మెక్సికో 750 మిలియన్ యూరోలను సమీకరించనుంది.

3. ఇటీవల కాలంలో భారత్ కింద పేర్కొన్న ఏ ఒప్పందంలో పరిశీలక హోదాలో చేరింది? (సి)

ఎ) షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్          

బి) అసొసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ నేషన్స్          

సి) జిబౌటి కోడ్ ఆఫ్ కండక్ట్           

డి) ఆఫ్రికన్ యూనియన్

-వివరణ: 19 దేశాలు ఉన్న జిబౌటి కోడ్ ఆఫ్ కండక్ట్ భారత్ పరిశీలక హోదాలో చేరింది. ఇప్పటికే ఈ హోదా కలిగిన దేశాలు జపాన్, నార్వే, యూకే, యూఎస్. నౌకాయాన అంశాల్లో భద్రత, సుముద్రంలో సుస్థిరాభివృధ్ధిని సాధించేందుకు ఉద్దేశించింది ఈ ఒప్పందం

4. హిల్సా చేప ఏ దేశంలో కనిపిస్తుంది? (బి)

ఎ) ఇరాన్ బి) బంగ్లాదేశ్          

సి) జపాన్ డి) మాల్దీవులు

-వివరణ: హిల్సా రకపు చేప కేవలం 11 దేశాల్లోనే ఉంది. అతి ఎక్కువగా  ఈ రకపు చేపలు బంగ్లాదేశ్ ఉంటాయి. ఇది ఆ దేశపు జాతీయ చేప. పశ్చిమబెంగాల్, త్రిపుర రాష్ర్టాల చిహ్నం కూడా ఇదే. భారత్ ఈ చేపల ఎగుమతిని 2012లో బంగ్లాదేశ్ నిషేధించింది. తాజాగా ఈ నిషేధాన్ని ఎత్తివేసింది. 

5. ‘కమిషన్ ఆన్ స్టేటస్ ఆఫ్ ఉమెన్’ దేనిలో భాగంగా పని చేస్తుంది? (ఎ)

ఎ) సాంఘిక-ఆర్థిక మండలి            

బి) భద్రతా మండలి          

సి) ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్          

డి) ధర్మకర్తృత్వ మండలి

-వివరణ: సాంఘిక-ఆర్థిక మండలిలో కమిషన్ ఆన్ స్టేటస్ ఆఫ్ ఉమెన్ భాగంగా ఉంటుంది. 2021-25కుగాను భారత్ ఎన్నికయ్యింది. లింగ సమానత్వం, మహిళ సాధికారత సాధించడానికి ఉమెన్ కమిషన్ పనిచేస్తుంది. 1946 జూన్ 21న ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు

6. భారత సంస్కృతి అధ్యయనానికి ఎవరి నేతృత్వంలో ఇటీవల కమిటీని ఏర్పాటు చేశారు? (సి)

ఎ) ఏఎల్ భాషం బి) రోమిలా థాపర్ 

సి) కేఎన్ దీక్షిత్ డి) వీడీ మహాజన్

-వివరణ: భారత సంస్కృతి ఆవిర్భావం, వైవిధ్యం తదితర అంశాలను 16మంది సభ్యులతో కూడిన ఒక కమిటీ అధ్యయనం చేయనుంది. ఇండియన్ ఆర్కియాలజికల్ సొసైటీ చైర్మన్ దీక్షిత్ దీనికి నేతృత్వం వహిస్తారు. 12,000 సంవత్సరాల  నుంచి సంస్కృతిలో వచ్చిన పరిణామక్రమాన్ని ఇది అధ్యయనం చేస్తుంది

7. ప్రతిపాదన (ఏ): ఉల్లి ఎగుమతులను నిషేధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది (బి)

-కారణం (ఆర్): ప్రపంచంలో ఉల్లి ఎగుమతుల్లో భారత్ అగ్రస్థానంలో ఉంది

ఎ) ఏ, ఆర్ రెండూ సరైనవే. ఏ ను ఆర్ సరిగ్గా వివరిస్తుంది.

బి) ఏ, ఆర్ రెండూ సరైనవే. ఏ కు ఆర్ సరికాదు

సి) ఏ సరైనది, ఆర్ సరికాదు

డి) ఏ తప్పు, ఆర్ సరైనది

-వివరణ: ఉల్లి ఎగుమతులను నిషేధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దేశీయంగా ఉల్లి సరఫరా పెరగడానికి కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. అధిక వర్షాల కారణంగా ఉల్లి పంటకు నష్టం జరిగింది. దీంతో ధరల పెరుగుదలను అడ్డుకోవడానికి కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలో ఉల్లి ఎగుమతుల్లో భారత్ అగ్రస్థానంలో ఉంది.

8. కింది వాటిలో సరైనవి (డి)..

1. హరివంశ్ నారాయణ్ సింగ్ లోక్ డిప్యూటీ స్పీకర్ ఎన్నికయ్యారు

2. హరివంశ్ నారాయణ్ సింగ్ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికయ్యారు

3. ప్రస్తుతం లోక్ డిప్యూటీ స్పీకర్ 

తంబిదురై 

ఎ) 2, 3      బి) 1     సి) 3     డి) 2

-వివరణ: జనతాదళ్ యునైటెడ్ పార్టీకి చెందిన హరివంశ్ నారాయణ్ సింగ్ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ రెండోసారి ఎన్నికయ్యారు. ప్రతి పక్షాల తరఫున పోటీ చేసిన మనోజ్ ఝా ఓడిపోయారు. అయితే ప్రస్తుతం ఉన్న 17వ లోక్ డిప్యూటీ స్పీకర్ లేరు. ఎవరినీ ఎన్నుకోలేదు. డిప్యూటీ స్పీకర్ లేకుండా సుదీర్ఘ కాలం కొనసాగిన లోక్ ఇదే

9. తెలంగాణలో ఎన్ని చదరపు గజాల ప్లాట్ సైజ్ అనుమతి అవసరం ఉండదు? (సి)

ఎ) 100 చ.గ    బి) 180 చ.గ        

సి) 75 చ.గ      డి) 125 చ.గ

-వివరణ: తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఇటీవల తెలంగాణ-బి పాస్ ఆమోదించింది. దీని ప్రకారం 75 చ.గ విసీర్ణం, ఏడు మీటర్ల కంటే తక్కువ ఎత్తు ఉండే నివాసాలకు ఎలాంటి అనుమతి అవసరం ఉండదు. కేవలం ఆన్ రిజిస్టర్ చేసుకోవాలి. 500 చ.మీ., 10 మీ. ఎత్తు ఉండే భవనానికి దరఖాస్తుదారు స్వీయ ప్రమాణీకరణ (సెల్ఫ్ సర్టిఫికెట్) ఆధారంగా వెంటనే బిల్డింగ్ ఆమోదం లభిస్తుంది

10. ఈ-ఆఫీస్ విధానాన్ని ప్రారంభించిన విద్యుత్ సరఫరా సంస్థగా ఏ రాష్ట్ర డిస్కం నిలిచింది? (డి)

ఎ) గుజరాత్ బి) కేరళ            సి) ఉత్తరాఖండ్ డి) మధ్యప్రదేశ్

-వివరణ: ఈ-ఆఫీస్ విధానాన్ని ‘మధ్య క్షేత్ర విద్యుత్ వితరణ్ కంపెనీ’ ప్రారంభించింది. ఇది భోపాల్ ఉంది. కార్పొరేట్ ఆఫీస్ నుంచి స్థానిక సర్కిల్ కార్యాలయం వరకు ఇదే విధానం కొనసాగుతుంది. దేశంలో ఈ ఘనత సాధించిన తొలి కేంద్ర డిస్కం ఇదే

11. యోషిహిదే సుగా ఏ దేశపు ప్రధాన మంత్రిగా నియామకమయ్యారు? (డి)

ఎ) దక్షిణ కొరియా బి) వియత్నాం           

సి) ఫిలిప్పీన్స్ డి) జపాన్

-వివరణ: జపాన్ కొత్త ప్రధాని యోషిహిదే సుగా. గతంలో ఆయన ఆ దేశ క్యాబినెట్ ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. ఇప్పటి వరకు ప్రధానిగా ఉన్న షింజో అబే అనారోగ్య కారణాలతో రాజీనామా చేయడంతో ఆ దేశ పార్లమెంట్ సుగాను ఎన్నుకుంది. 

12. ఏ రోజున ఓజోన్ పరిరక్షణ దినోత్సవంగా నిర్వహిస్తారు? (సి)

ఎ) సెప్టెంబర్ 15 బి) సెప్టెంబర్ 17             

సి) సెప్టెంబర్ 16 డి) సెప్టెంబర్ 18

-వివరణ: ఏటా సెప్టెంబర్ 16న ఓజోన్ పరిరక్షణ దినోత్సవంగా నిర్వహిస్తారు. ఓజోన్ పొర పరిరక్షణ అవసరాన్ని తెలియచెప్పడంతో పాటు అందరికీ అవగాహన కల్పిస్తారు. ఓజోన్ పరిరక్షణకు ఉద్దేశించిన మాంట్రియల్ ప్రోటోకాల్ సంతకం చేసిన రోజునే ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ ఏడాది ‘జీవనానికి ఓజోన్: 35 సంవత్సరాల ఓజోన్ పొర పరిరక్షణ’ అనే ఇతివృత్తంతో నిర్వహించారు.

వి.రాజేంద్ర శర్మ

ఫ్యాకల్టీ , 9849212411logo