హైదరాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ): కరోనా సోకి హోం ఐసొలేషన్‌లో ఉంటున్న రోగులకు ఇంటికే వెళ్లి మెడికల్ కిట్ ఇవ్వాలని రాష్ట్ర సర్కా రు నిర్ణయించింది. ప్రభుత్వ, ప్రైవేటు అన్న తేడాలేకుండా పాజిటివ్ వచ్చినా ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం కిట్ అందజేయనున్నది. ఇప్పటి కే పెద్ద సంఖ్యలో కిట్లను సమకూర్చుకొన్న ప్రభుత్వం.. రాబోయే రోజుల్లో 10 లక్షల హోం ఐసొలేషన్ కిట్లను అందించాలని లక్ష్యంగా పెట్టుకొన్నది. సోమవారం నుంచి పంపిణీ ప్రారంభం కానున్నట్టు సమాచారం. వైద్యారోగ్యశాఖ వద్ద ఇప్పటికే 3 లక్షల దాకా కిట్లు ఉండగా, మరో 4 లక్షల కిట్లు రెండుమూడు రోజుల్లో రానున్నాయి. మరో 3 లక్షల కిట్లకు టీఎస్ఎంఎస్ఐడీసీ ఆర్డర్ పెట్టింది. ఇవి కూడా వారం పది రోజుల్లో అందుబాటులోకి రానున్నాయి.
కిట్‌లో ఉండే మందులు..
విటమిన్ -సీ టాబ్లెట్లు
జింక్ టాబ్లెట్లు
బీ కాంప్లెక్స్ టాబ్లెట్లు
క్లాత్ మాస్కులు
శానిటైజర్ బాటిల్
లిక్విడ్ హ్యాండ్‌వాష్
చేతి గ్లవ్స్
సోడియం హైపోక్లోరైడ్ ద్రావణం బాటిల్-1
హోం ఐసొలేషన్ పాటించాల్సిన నిబంధనల బ్రోచర్