సోమవారం 26 అక్టోబర్ 2020
Nipuna-education - Sep 23, 2020 , 03:39:08

అగ్రికల్చర్‌ డిప్లొమా కోర్సులు

అగ్రికల్చర్‌ డిప్లొమా కోర్సులు

ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ స్టేట్‌ అగ్రికల్చర్‌ యూనివర్సిటీ (పీజేటీఎస్‌ఏయూ) వ్యవసాయ పాలిటెక్నిక్‌ కోర్సుల నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. డిప్లొమా కోర్సులను పీజేటీఎస్‌ఏయూ పరిధిలోని పాలిటెక్నిక్‌ కాలేజీలు అందిస్తున్నాయి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన వివరాలు.

పీజేటీఎస్‌ఏయూ డిప్లొమా ఇన్‌ అగ్రికల్చర్‌, డిప్లొమా ఇన్‌ సీడ్‌ టెక్నాలజీ, డిప్లొమా ఇన్‌ ఆర్గానిక్‌ అగ్రికల్చర్‌, డిప్లొమా ఇన్‌ అగ్రికల్చరల్‌ ఇంజినీరింగ్‌ కోర్సులను ఆఫర్‌ చేస్తుంది. ఈ నాలుగు కోర్సుల్లో కలిపి మొత్తం 870 సీట్లు ఉన్నాయి.

డిప్లొమా ఇన్‌ అగ్రికల్చర్‌

ఈ కోర్సు కాలవ్యవధి మూడేండ్లు.

యూనివర్సిటీ పాలిటెక్నిక్‌ కాలేజీలు- పాలెం (నాగర్‌కర్నూలు జిల్లా), పొలాస (జగిత్యాల జిల్లా), కంపాసాగర్‌ (నల్లగొండ), బసంతపూర్‌, జోగిపేట (సంగారెడ్డి), మధిర (ఖమ్మం), తోర్నాల (సిద్దిపేట), జమ్మికుంట (కరీంనగర్‌), మాల్‌తుమ్మెద (కామారెడ్డి) 

అఫిలియేటెడ్‌ కాలేజీలు- తునికి (మెదక్‌), చేవెళ్ల (రంగారెడ్డి), నారాయణ్‌ఖేడ్‌, తురకల ఖానాపూర్‌ (సంగారెడ్డి), సత్తుపల్లి (ఖమ్మం), పోలేనిగూడెం (సూర్యాపేట), అశ్వారావుపేట (కొత్తగూడెం)

డిప్లొమా ఇన్‌ సీడ్‌ టెక్నాలజీ

 • ఈ కోర్సు కాలవ్యవధి రెండేండ్లు.
 • యూనివర్సిటీ కాలేజీ- రుద్రూర్‌ (నిజామాబాద్‌)
 • అఫిలియేటెడ్‌ కాలేజీ- తునికి (మెదక్‌)

డిప్లొమా ఇన్‌ అగ్రికల్చరల్‌ ఇంజినీరింగ్‌

 • ఈ కోర్సు కాలవ్యవధి రెండేండ్లు.
 • యూనివర్సిటీ కాలేజీ- రాజేంద్రనగర్‌ (హైదరాబాద్‌)
 • అఫిలియేటెడ్‌ కాలేజీలు- తునికి (మెదక్‌), సత్తుపల్లి (ఖమ్మం), తురకల ఖానాపూర్‌ (సంగారెడ్డి)

డిప్లొమా ఇన్‌ ఆర్గానిక్‌ ఫార్మింగ్‌

 • ఇది కూడా రెండేండ్ల కోర్సు.
 • అఫిలియేటెడ్‌ కాలేజీ- గింగుర్తి (వికారాబాద్‌)

 అర్హతలు

 • కనీసం 35 శాతం మార్కులతో టెన్త్‌ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులు అర్హులు.
 • 1 నుంచి 10వ తరగతిలోపు నాలుగేండ్లు నాన్‌ మున్సిపల్‌ ప్రాంతంలోని పాఠశాలలో చదివి ఉండాలి.
 • టెన్త్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
 • 2020, డిసెంబర్‌ 31 నాటికి 15 ఏండ్లు నిండి ఉండాలి. 1999, జనవరి 1 - 2005, డిసెంబర్‌ 31 మధ్య జన్మించి ఉండాలి.
 • నిబంధనల మేరకు రిజర్వేషన్లు ఉంటాయి.

వివరాలు

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో

చివరితేదీ: అక్టోబర్‌ 16

 దరఖాస్తు ఫీజు: రూ.1100

వెబ్‌సైట్‌: www.pjtsau.edu.in


logo