మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Nipuna-education - Sep 15, 2020 , 23:39:09

ఇంటర్‌ ఆర్ట్స్‌తో ఐఐటీ కోర్సులు

ఇంటర్‌ ఆర్ట్స్‌తో ఐఐటీ కోర్సులు

దేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మక సంస్థల్లో చదవాలనుకునే ఇంటర్‌ విద్యార్థులకు అపూర్వ అవకాశం. ఆర్ట్స్‌, సైన్స్‌, కామర్స్‌ ఏ గ్రూప్‌ వారైనా ఐఐటీల్లో చదివే అవకాశం కల్పించే కోర్సులకు ప్రకటన విడుదలైంది. బీ.డిజైన్‌, ఎం.డిజైన్‌ కోర్సుల్లో చేరేందుకు నిర్వహించే యూసీడ్‌, సీడ్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. దానికి సంబంధించిన వివరాలు నిపుణ పాఠకుల కోసం....  

యూసీడ్‌: యూసీడ్‌-సీడ్‌ కమిటీ మార్గదర్శకత్వంలో ఈ ఎగ్జామ్‌ను ఐఐటీ బాంబే నిర్వహిస్తుంది. యూసీడ్‌ ఎగ్జామ్‌ ద్వారా బీ.డిజైన్‌ కోర్సును ఐఐటీ బాంబే, ఐఐటీ గువాహటి, ఐఐటీ హైదరాబాద్‌, ఐఐఐటీడీఎంజబల్‌పూర్‌లలో చదవచ్చు.

ఐఐటీ బాంబే 2015 నుంచి నాలుగేండ్ల బీ.డిజైన్‌, ఐదేండ్ల బీ.డిజైన్‌+ ఎం.డిజైన్‌ కోర్సులను ఆఫర్‌ చేస్తుంది. 

సీట్ల వివరాలు: ఐఐటీ బాంబే-37, గువాహటి-56,హైదరాబాద్‌-20, జబల్‌పూర్‌-66 ఉన్నాయి.  మొత్తం 179 సీట్లు.

ఎవరు అర్హులు..?

ఇంటర్‌/తత్సమాన కోర్సు ఉత్తీర్ణులు. 2020లో ఇంటర్‌ ఉత్తీర్ణులు. 2021 మార్చిలో పరీక్ష రాయనున్నవారు కూడా అర్హులే. 

ఇంటర్‌లో సైన్స్‌, కామర్స్‌, ఆర్ట్స్‌, హ్యుమానిటీస్‌ గ్రూప్‌నకు చెందినవారు. 

హెచ్‌ఎస్‌సీ వొకేషనల్‌ ఎగ్జామ్‌ లేదా మూడేండ్ల డిప్లొమా (పాలిటెక్నిక్‌) చేసినవారు కూడా అర్హులే.

1996, అక్టోబర్‌ 1 తర్వాత జన్మించిన జనరల్‌/ఓబీసీ (ఎన్‌సీఎల్‌) అభ్యర్థులు. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులు అయితే 1991, అక్టోబర్‌ 1 తర్వాత జన్మించి ఉండాలి.

ఎన్నిసార్లు రాయవచ్చు?

ఈ పరీక్షను గరిష్ఠంగా రెండుసార్లు రాయవచ్చు. ఏ సంవత్సరం స్కోర్‌ ఆ ఏడాదికి మాత్రమే పరిమితం. 

పరీక్ష విధానం 

యూసీడ్‌ కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌. దీన్ని 3 గంటల వ్యవధిలో నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌లో ఉంటుంది. 300 మార్కులు. రెండు సెక్షన్లు ఉంటాయి.

సీడ్‌-2021

కామన్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌ ఫర్‌ డిజైన్‌ (సీడ్‌). దీన్ని మాస్టర్‌ ఆఫ్‌ డిజైన్‌ (ఎం.డిజైన్‌) ప్రోగ్రామ్‌లో ప్రవేశం కోసం నిర్వహిస్తారు.

ఈ కోర్సును బెంగళూరులోని ఐఐఎస్సీ, ఐఐటీలు -బాంబే, ఢిల్లీ, గువాహటి, హైదరాబాద్‌, కాన్పూర్‌తోపాటు ఐఐఐటీడీఎం జబల్‌పూర్‌ ఆఫర్‌ చేస్తున్నాయి.

ఐఐఎస్సీలో ఎం.డిజైన్‌ (ప్రొడక్ట్‌ డిజైన్‌ అండ్‌ ఇంజినీరింగ్‌), పీహెచ్‌డీ (డిజైన్‌)

ఐఐటీ బాంబేలో ఎం.డిజైన్‌ (ఇండస్ట్రియల్‌ డిజైన్‌, కమ్యూనికేషన్‌ డిజైన్‌, యానిమేషన్‌, ఇంటరాక్షన్‌ డిజైన్‌, మొబిలిటీ అండ్‌ వెహికిల్‌ డిజైన్‌), పీహెచ్‌డీ (డిజైన్‌)

ఐఐటీ గువాహటిలో ఎం.డిజైన్‌ (డిజైన్‌), పీహెచ్‌డీ (డిజైన్‌)

ఐఐటీ హైదరాబాద్‌లో ఎం.డిజైన్‌ (విజువల్‌ డిజైన్‌), పీహెచ్‌డీ డిజైన్‌

ఐఐటీ కాన్పూర్‌లో ఎం.డిజైన్‌ (డిజైన్‌), పీహెచ్‌డీ (డిజైన్‌)

ఐఐఐటీడీఎం జబల్‌పూర్‌లో ఎం.డిజైన్‌ (ప్రొడక్ట్‌ డిజైన్‌, విజువల్‌ డిజైన్‌)

అర్హతలు: నాలుగేండ్లు లేదా 3+2 ఇయర్స్‌ (10+2 తర్వాత)లో డిగ్రీ/ డిప్లొమా లేదా పీజీ ఉత్తీర్ణులు లేదా ఫైనల్‌ ఇయర్‌ ఎగ్జామ్స్‌ రాయబోతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. గరిష్ఠ వయోపరిమితి లేదు. సీడ్‌ను ఎన్నిసార్లయినా రాసుకోవచ్చు.  

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో 

చివరితేదీ: అక్టోబర్‌ 10 

పరీక్షతేదీ: 2021, జనవరి 17

పరీక్ష కేంద్రం: రాష్ట్రంలో హైదరాబాద్‌

ఫలితాల వెల్లడి: 2021, మార్చి 8

వెబ్‌సైట్‌: http://www.ceed.iitb.ac.in/2021/

ముఖ్యతేదీలు 

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో 

చివరితేదీ: అక్టోబర్‌ 10

అడ్మిట్‌ కార్డుల డౌన్‌లోడింగ్‌: 2021, జనవరి 1

పరీక్షతేదీ: 2021, జనవరి 17

ఫలితాల వెల్లడి: 2021, మార్చి 10

వెబ్‌సైట్‌: http://www.uceed.iitb.ac.in

-కేశవపంతుల వేంకటేశ్వరశర్మ


logo