మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Nipuna-education - Sep 15, 2020 , 23:39:12

‘గేట్‌' దాటుదామిలా!

‘గేట్‌' దాటుదామిలా!

ఏదైనా విద్యార్థి పోటీ పరీక్షలో అగ్రస్థానంలో ఉండటానికి మొదట మానసికంగా సిద్ధంగా ఉండాలి. విద్యార్థి లక్ష్యం వెయ్యి లోపు ర్యాంకు సాధించడమే లేదా అర్హత సాధించడమో కాకుండా పరీక్షల్లో మొదటి ర్యాంకు సాధించాలన్న తపన, ఆత్మవిశ్వాసంతో ఉండాలి. ఐఐటీ బొంబాయి నిర్వహిస్తున్న గేట్‌-2021 పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థులందరికీ ప్రిపరేషన్‌ ప్లాన్‌.

గేట్‌ పరీక్షను ఇప్పటికే గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసిన విద్యార్థులు, గ్రాడ్యుయేషన్‌ చేస్తున్న విద్యార్థులు, వర్కింగ్‌ ప్రొఫెషనల్స్‌, సొంతగా సిద్ధమవుతున్న విద్యార్థులు, కోచింగ్‌ తీసుకునే విద్యార్థులు వంటి వివిధ రకాల విద్యార్థులు రాస్తారు. వారి తయారీ వ్యూహం భిన్నంగా ఉండాలి. కానీ పరీక్ష తయారీ సమయంలో ప్రతి విద్యార్థి అనుసరించాల్సిన కొన్ని సాధారణ అంశాలను పరిశీలిద్దాం.

సిలబస్‌: ఏదైనా పరీక్షలో అగ్రస్థానంలో ఉండటానికి మొదటి, ప్రధాన దశ పరీక్ష సిలబస్‌పై పూర్తి అవగాహన సాధించాలి. దీనివల్ల విద్యార్థులు వారి విలువైన సమయాన్ని, శక్తిని సరైన విధంగా కేంద్రీకరించడానికి ఉపయోగపడుతుంది.

పోటీ తెలుసుకోవాలి: గేట్‌, ఈఎస్‌ఈ, ఎస్‌ఎస్‌సీ-జేఈ, స్టేట్‌ సీస్‌యూ వంటి పోటీ పరీక్షలు కాలేజీ పరీక్షలకు భిన్నంగా ఉంటాయి. పోటీ తీవ్రంగా, కఠినంగా ఉంటుంది. కాబట్టి పరీక్షలో విజయసాధనకు అవసరమైన స్థాయిని, పోటీ స్థాయిని తెలుసుకోవాలి. ఈ పోటీని తెలుసుకోవడానికి ఐఐటీ, ఎన్‌ఐటీ, ఎంటెక్‌ ప్రవేశం కోసం గేట్‌ కటాఫ్‌ మార్కులు మనకు ఉపయోగపడతాయి. 

గమనిక: ప్రతి సంవత్సరం ర్యాంకులు, మార్కులు మారుతుంటాయి. ఇది విద్యార్థులు అవగాహన కోసం మాత్రమే. కాబట్టి మొత్తం 50 శాతం మార్కులు సాధించడం ద్వారా విద్యార్థి చాలామంది కల అయిన ఎన్‌ఐటీల్లో ప్రవేశం పొందవచ్చు.

కాన్సెప్ట్‌లపై అవగాహన: సరైన పునాదిలేకుండా, ఇంటీరియర్‌లను ఎంత అందంగా తయారుచేసినా భవనం ఒకరోజులో కూలిపోతుంది. అదే విధంగా కాన్సెప్ట్‌పై సరైన అవగాహన లేకుండా ఎంత కష్టపడి చదివినా అది విద్యార్థుల్లో నిరాశ, అసంతృప్తికి దారితీస్తుంది. కాన్సెప్ట్‌పై అవగాహన లేకుండా గేట్‌లో విజయం సాధించడం దాదాపు అసాధ్యం.

ఒక అంశంపై సంభావిత స్పష్టతను పెంపొందించుకోవడానికి, విద్యార్థులకు ప్రాథమిక విషయాలపై మంచి పట్టు ఉండాలి. తరువాతి దశలో విభిన్న భావనలను ఒకదానితో ఒకటి అనుసంధించాలి, చివరకు విస్తృతమైన ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌లో బలపర్చాలి.

సాధన: నేర్చుకొన్న ఒక భావనను ఏకీకృతం చేయడం విస్తృతమైన సమస్య పరిష్కారం ద్వారా స్థిరపరచబడాలి. విస్తృత సమస్య పరిష్కారం ద్వారా విద్యార్థులకు కలిగే ప్రయోజనాలు..

వేగం, కచ్చితత్వం మెరుగుపడతాయి.

భావనలు ఏకీకృతం చేయబడతాయి.

కొన్ని సాధారణ షార్ట్‌కట్స్‌ నేర్చుకోవచ్చు.

ఆత్మ విశ్వాసం పెరుగుతుంది.

సాధన కోసం విద్యార్థులు  కింది వనరులను ఉపయోగించుకోవచ్చు.

ప్రామాణిక పాఠ్యపుస్తకాల ఉదాహరణలు, అభ్యాస ప్రశ్నలు.

గత పది సంవత్సరాలు ప్రశ్నపత్రాలు

ఉపన్యాస సమస్యలు (కోచింగ్‌ తరగతులకు హాజరయ్యే వారు)

సాధన సమయంలో చిట్కాలు

 • ప్రాక్టీస్‌ వ్యవధి 3-4 గంటలు ఉండాలి (పరీక్ష వలె)
 • మీరు తప్పు చేసిన ప్రశ్నలను గుర్తించి వాటిని కఠినమైన ప్రశ్న/మంచి భావనగా పరిగణించండి. ఇది రివిజన్‌కు పట్టే సమయాన్ని తగ్గిస్తుంది.
 • టెస్ట్‌ సిరీస్‌: విద్యార్థి ర్యాంకును నిర్ణయించడంలో టెస్ట్‌ సిరీస్‌ చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. పరీక్ష తయారీలో బలహీనతలను ఆత్మపరిశీలన చేసుకోవడానికి, అవసరమైన దిద్దుబాటు చర్యలు తీసుకోవడానికి నిరంతర సమర్థవంతమైన పురోగతి పర్యవేక్షణ అవసరం. అందువల్ల అక్టోబర్‌ నుంచి విద్యార్థులు రోజువారీ పరీక్షలను (ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌) ఒక గంట రాయాలి.
 • జనవరి నెలలో పూర్తి సిలబస్‌తో నిర్వహించే 3 గంటల నిడివి పరీక్షలు రాయాలి. ఇవి వాస్తవ పరీక్షకు అవసరమైన సమయ నిర్వహణ, మానసిక దృఢత్వాన్ని విద్యార్థికి అలవాటు చేస్తాయి.
 • మాక్‌ పరీక్షలు రాయడానికి ముందు షార్ట్‌ నోట్స్‌ను  చదివి, పరీక్షలో చేసిన తప్పులను వేరొక నోట్స్‌లో రాయాలి. ప్రతిసారి పరీక్ష రాసేటప్పుడు షార్ట్‌ నోట్స్‌ను, తప్పుల నోట్స్‌ పునశ్చరణ చేయాలి.

 షార్ట్‌ నోట్స్‌ 

పరీక్షకు ఒక వారం లేదా 10 రోజుల ముందు పాఠ్యపుస్తకాలు లేదా తరగతి నోట్స్‌ నుంచి పునశ్చరణ చేయడం  సాధ్యం కాదు. అందువల్ల విద్యార్థి అన్ని సబ్జెక్టులకు సొంత షార్ట్‌ నోట్స్‌ను తయారు చేసుకొని క్రమానుగతంగా పునశ్చరణ చేయాలి. కొద్దిమంది ర్యాంకు సాధించిన విద్యార్థులు సంక్షిప్త నోట్స్‌ను మననం చేసుకుని మరింత షార్ట్‌ నోట్స్‌ను తయారు చేసుకుంటారు.

చేయదగినవి

 • ఆత్మవిశ్వాసంతో ఉండటం
 • ప్రాథమిక అంశాలు, కాన్సెప్టులతో బలంగా ఉండటం
 • ఒక సమస్యను ఒకటి కంటే ఎక్కువ పద్ధతుల్లో సాధించడానికి ప్రయత్నించడం.
 • ప్రతిరోజు కాన్సెప్టులను గుర్తుచేసుకోవడం.
 • ప్రతిరోజు ఇంజినీరింగ్‌ గణితం, జనరల్‌ ఆప్టిట్యూడ్‌ ఒక గంట అభ్యాసం చేయాలి.
 • కాన్సెప్టులను అన్ని సబ్జెక్టులతో లింక్‌ చేయాలి.
 • పరీక్ష తయారీని ఆస్వాదించండి.
 • తయారీ సమయంలో ఒక దినచర్యను పాటించాలి. క్రమపద్ధతిలో విరామాలు తీసుకోవాలి.
 • ఆరోగ్యం పట్ల శ్రధ్ధ వహించాలి. తగినంత విశ్రాంతి తీసుకోవాలి.

చేయకూడనివి

సామాజిక మాధ్యమాలను ఎక్కువగా ఉపయోగించడం

ఒత్తిడికి గురవడం

ప్రతికూల ఆలోచనకు గురవడం

వాయిదా వేయడం

పుకార్లను నమ్మడం

చివిరి నిమిషంలో పనులు

సాధారణ రోజును ఎలా ప్లాన్‌ చేయాలి?

రోజుకు రెండు సబ్జెక్టులుగా ప్లాన్‌ చేయాలి (1 సులభమైన+ 1 కఠిన) సులభ సబ్జెక్టు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. కఠినమైన సబ్జెక్టు మిమ్మల్ని ప్రేరేపిస్తుంది.

రోజుకు 8 నుంచి 9 గంటలు పరీక్ష తయారీకి కేటాయించాలి.

ప్రామాణిక పుస్తకాలు

EE (ELECTRICAL ENGINEERING)

Networks: Engineering circuit analysis by Hayt and Kimmerly

Controls: Control systems engineering by Nagrath & Gopal

EMF: Elements of electromagnetics by Sadiku

Digital Circuits: Digital Design by Morris Mano

Analog Circuits: Microelectronic circuits by Sedra & Smith

Power Systems: Power systems engineering by Nagrath & Kothari

Power Electronics: Power Electronics by PS Bhimbra

Electric Machines: Electrical Machinery by PS Bhimbra

Signals & Systems: Signals and Systems by Alan V. Oppenheim

Measurements: Electrical and Electronic Measurements And Instrumentation by A.K. Sawhney

Mathematics: Higher Engineering Mathematics by B.S.Grewal

EC (ELECTRONICS AND COMMUNICATION ENGINEERING)

Networks: Engineering circuit analysis by Hayt and Kimmerly

Controls: Control systems engineering by Nagrath & Gopal

EMTL: Elements of electromagnetics by Sadiku

Digital Circuits: Digital Design by Morris Mano

Analog Circuits: Microelectronic circuits by Sedra & Smith

Communications: Modern Digital and Analog Communication Systems by B. P Lathi & Digital communications by Proakis

Signals & Systems: Signals and Systems by Alan V. Oppenheim

EDC:Solid State Electronic Devices by Streetman & Banerjee

Mathematics: Higher Engineering Mathematics by B.S.Grewal

K.N.S. HEMANTH

Expert Faculty

OHM Institute, Hyderabad

www.ohminstitute.com 

Phone: 040-40102255 

Mobile: 9515694053


logo