Nipuna-education
- Aug 19, 2020 , 01:05:18
చదివిస్తారు.. కొలువిస్తారు!

ఆర్మీలో 10+2 టెక్నికల్ ఎంట్రీ
ఇంటర్ ఎంపీసీ ఉత్తీర్ణులకు అవకాశం. బీటెక్ చదివిస్తారు. తర్వాత ఆర్మీలో లెఫ్టినెంట్ హోదాలో ఉద్యోగం ఇస్తారు. ఆకర్షణీయమైన జీతభత్యాలు, పదోన్నతులకు అవకాశం. వీటన్నింటి సమాహారమే 10+2 ఎంట్రీ స్కీం-44. ప్రస్తుతం టీఈఎస్ నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ఆ వివరాలు నిపుణ
పాఠకుల కోసం..
- సంస్థ: ఇండియన్ ఆర్మీ
- కోర్సు: 10+2 ఎంట్రీ స్కీం (పర్మినెంట్ కమిషన్)
- ఈ కోర్సు జనవరి 2021లో ప్రారంభమవుతుంది.
- మొత్తం ఖాళీలు: 90
- అర్హతలు: ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్టుల్లో 70 శాతంతో ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి.
- వయసు: 16 1/2 ఏండ్ల నుంచి 19 1/2 ఏండ్ల మధ్య ఉండాలి. జూలై 1, 2001 కంటే ముందు, జూలై 1, 2004 తర్వాత జన్మించినవారు అనర్హులు.
- శారీరక ప్రమాణాలు: కనీసం 157.5 సెం.మీ. ఎత్తు ఉండాలి.
- కమిషన్ రకం: నాలుగేండ్ల కోర్సు పూర్తయిన తర్వాత పర్మినెంట్ కమిషన్ కింద ఆర్మీలో లెఫ్టినెంట్ హోదాలో ఉద్యోగ అవకాశం కల్పిస్తారు.
ఎంపిక విధానం
- దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను ఇంటర్ ఎంపీసీ గ్రూప్లో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు.
- ఎంపికైనవారికి అయిదు రోజులపాటు రెండు దశల్లో ఎస్ఎస్బీ సైకలాజికల్ పరీక్షలు, గ్రూప్ పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
- ఎస్ఎస్బీ ఇంటర్వ్యూలు అలహాబాద్, భోపాల్, బెంగళూరు, కపుర్తలాలో నిర్వహిస్తారు. వారివారి ప్రాంతాలను బట్టి ఆయా కేంద్రాల్లో పరీక్షలకు అనుమతిస్తారు.
- స్టేజ్-1 లో అర్హత సాధించినవారిని స్టేజ్-2కు అనుమతిస్తారు. అన్ని విభాగాల్లోనూ రాణిస్తే మెడికల్ టెస్టుకు పంపుతారు.
- దీనిలో ఎంపికైనవారిని శిక్షణకు పంపిస్తారు.
శిక్షణ వివరాలు
- కోర్సులో చేరినవాళ్లకి అయిదేండ్ల పాటు శిక్షణ ఉంటుంది.
- మొదటి ఏడాది ఆఫీసర్ ట్రెయినింగ్ అకాడమీ గయలో బేసిక్ మిలిటరీ ట్రెయినింగ్ నిర్వహిస్తారు.
- అనంతరం సాంకేతిక శిక్షణ (టెక్నికల్ ట్రెయినింగ్) ఉంటుంది. ఇది పుణె, సికింద్రాబాద్ లేదా మౌలో ఇస్తారు.
- ఎంపికైనవారు ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజినీరింగ్ కోర్సులు చదవాలి.
- మూడేళ్ల శిక్షణ అనంతరం అభ్యర్థులకు నెలకు రూ.56,100 చొప్పున స్టయిఫండ్ చెల్లిస్తారు. విజయవంతంగా కోర్సు పూర్తిచేసుకున్నవారికి ఢిల్లీలోని జేఎన్యూ ఇంజినీరింగ్ డిగ్రీని ప్రదానం చేస్తుంది.
పదోన్నతులు
- లెఫ్టినెంట్ హోదాలో మొదట ఉద్యోగం ఇస్తారు. తర్వాత కెప్టెన్-మేజర్, లెఫ్టినెంట్ కల్నల్, కల్నల్ (టీఎస్), కల్నల్, బ్రిగేడియర్, మేజర్ జనరల్, లెఫ్టినెంట్ జనరల్/హ్యాగ్ స్కేల్, ఆర్మీ కేడర్, సీవోఏఎస్ వరకు పదోన్నతి పొందవచ్చు.
- పేస్కేల్: ప్రారంభంలో లెవల్-10 కింద రూ. 56,100-1,77,500/- ఇస్తారు. వీరికి ఇతర అలవెన్స్లు ఉంటాయి.
ముఖ్యతేదీలు
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: సెప్టెంబర్ 9
పూర్తి వివరాల కోసం
వెబ్సైట్: www.joinindianarmy.nic.in
తాజావార్తలు
- 18 నెలలపాటు వ్యవసాయ చట్టాల అమలు నిలిపివేత
- ‘క్రాక్’ సినిమాలో రవితేజ కొడుకుగా నటించిన బుడ్డోడెవరో తెలుసా..?
- ‘ది బీస్ట్’.. బైడెన్ ప్రయాణించే కారు విశేషాలు ఇవే..
- ‘ఓటిటి రిలీజ్పై స్రవంతి రవికిషోర్ సంచలన వ్యాఖ్యలు’
- సత్తా చాటితేనే సర్కారు కొలువు
- సురవరం జయంతి ఉత్సవాలపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమీక్ష
- 17 అంశాలపై బైడెన్ తొలి సంతకం
- యాదాద్రీశుడి హుండీ ఆదాయం రూ. 64,92,590
- 'అడవుల రక్షణ, పునరుజ్జీవనం ప్రాతిపదికగా అవార్డుల ప్రదానం'
- వరంగల్ నిట్లో డ్రోన్ టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్
MOST READ
TRENDING