బుధవారం 30 సెప్టెంబర్ 2020
Nipuna-education - Aug 05, 2020 , 04:19:35

పోలీస్ కొలువులు

పోలీస్ కొలువులు

  •  ఢిల్లీ పోలీస్ 5846 కానిస్టేబుల్ పోస్టులు
  • స్టాఫ్ సెలక్షన్  కమిషన్ ద్వారా భర్తీ

ప్రభుత్వ కొలువులు.. ఆకర్షణీయమైన జీతభత్యాలు, ఉద్యోగ భద్రత. కేవలం ఇంటర్ అర్హత. మంచి శారీరకదారుఢ్యం ఉంటే చాలు. దేశ రాజధానిలో విధులు నిర్వహించే అవకాశం. వీటన్నింటి సమాహారమే ఢిల్లీ పోలీస్ శాఖలో కానిస్టేబుల్ కొలువులు. సుమారు ఐదువేలకు పైగా పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్  కమిషన్ ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఆ వివరాలు సంక్షిప్తంగా...

పోస్టు: కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్)

పేస్కేల్: పే లెవల్-3 ప్రకారం  రూ.21,700-69,100/-

మొత్తం ఖాళీలు: 5846

వీటిలో పురుషులకు- 3902, మహిళలకు-1944 పోస్టులు ఉన్నాయి.

మొత్తం పోస్టులలో 10 శాతం ఎక్స్ కేటాయించారు. 

అర్హతలు: 2020, సెప్టెంబర్ 7 నాటికి ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. పురుష అభ్యర్థులు అయితే లైట్ మోటార్ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. 

వయస్సు: 18- 25 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, స్పోర్ట్స్ పర్సన్, సర్వీస్ ఉన్నవారికి, ఎక్స్ తదితరులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం:

-కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ), ఫిజికల్ ఎండ్యూరెన్స్ అండ్ మెజర్ టెస్ట్, వైద్యపరీక్షల ద్వారా ఎంపికచేస్తారు.

సీబీటీ: ఈ పరీక్షలో నాలుగు సెక్షన్లు ఉంటాయి. మొత్తం 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష కాలవ్యవధి 90 నిమిషాలు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్/హిందీలలో ఉంటుంది.

పరీక్షలో జనరల్ నాలెడ్జ్/ కరెంట్ అఫైర్స్, రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ, కంప్యూటర్ ఫండమెంటల్స్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ వర్డ్,  కమ్యూనికేషన్, ఇంటర్నెట్ తదితరాల పై ప్రశ్నలు ఇస్తారు.

పీఈ&ఎంటీ 

  • పురుషులు: కనీసం 170 సెం.మీ ఎత్తు ఉండాలి. ఛాతీ 81 సెం.మీ. ఉండాలి. గాలి పీల్చినప్పుడు కనీసం నాలుగు సెంటీమీటర్లు వ్యాకోచించాలి.
  • మహిళలు: కనీసం 157 సెం.మీ. ఎత్తు ఉండాలి. 
  • నోట్: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కేవలం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మాత్రమే నిర్వహిస్తుంది. సీబీటీలో వచ్చిన మార్కుల ఆధారంగా పీఈ&ఎంటీకు అనుమతిస్తారు. వీటిలో అర్హత సాధించినవారికి వైద్యపరీక్షలు నిర్వహించి తుది ఎంపిక చేస్తారు. 
  • పీఈ&ఎంటీ ప్రతి ఒక్కరికి తప్పనిసరి. ఇది కేవలం క్వాలిఫయింగ్ పరీక్ష మాత్రమే.

ముఖ్యతేదీలు 

దరఖాస్తు: ఆన్

చివరితేదీ: సెప్టెంబర్ 7

ఫీజు చెల్లించడానికి చివరితేదీ: సెప్టెంబర్ 9

సీబీటీ తేదీ: నవంబర్ 27 నుంచి డిసెంబర్ 14 మధ్య నిర్వహిస్తారు.

పరీక్ష కేంద్రాలు: రాష్ట్రంలో

 హైదరాబాద్, కరీంనగర్, వరంగల్.

వెబ్ https://ssc.nic.in

పూర్తి వివరాల కోసం 

ఎంక్వయిరీ సెల్: 

011-27412715, 

011-27241205, 

011-27241206 

 కార్యాలయ పనివేళల్లో సంప్రదించవచ్చు.

 కేశవపంతుల వేంకటేశ్వరశర్మ

తాజావార్తలు


logo