మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Nipuna-education - Aug 05, 2020 , 04:10:43

హౌటు క్రాక్‌ ద క్యాట్‌ !

హౌటు క్రాక్‌ ద క్యాట్‌ !

క్యాట్‌... దేశంలో బాగా క్రేజీ ఉన్న పరీక్షల్లో ఇది ఒకటి. ఈ పరీక్షలో మంచి స్కోర్‌ సాధించినవారు జాతీయస్థాయిలో మేనేజ్‌మెంట్‌ విద్యకు పేరుగాంచిన ఐఐఎం లేదా ప్రముఖ బిజినెస్‌ స్కూళ్లలో పీజీ కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. ఎంఎన్‌సీల ప్రభావంతో మేనేజ్‌మెంట్‌ కోర్సులకు డిమాండ్‌ పెరిగింది. కేవలం ఫ్రెషర్సే కాకుండా ఎక్స్‌పీరియన్స్‌డ్‌ పర్సన్స్‌ కూడా దీనిపట్ల ఆసక్తి చూపిస్తున్నారు. దీనికి కారణం ఉన్నత ఉద్యోగాలతోపాటు ఆకర్షణీయమైన జీతభత్యాలు అందించే ఉద్యోగాలు ఈ కోర్సుల వల్ల లభించడం.  కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ (క్యాట్‌) ప్రకటన విడుదలైన నేపథ్యంలో ఏ విధంగా ప్రిపేర్‌ అయితే మంచి స్కోర్‌ సాధించవచ్చనే అంశాలపై నిపుణుల సూచనలు... 

 • అర్హతలు: కనీసం 50 శాతం మార్కులతో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులకు 45 శాతం మార్కులు వచ్చి ఉండాలి. 
 • డిగ్రీ చివరి ఏడాది చదువుతున్నవారు, ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు సైతం క్యాట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.

ప్రవేశ విధానం

 • ఐఐఎంలలో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి క్యాట్‌ స్కోర్‌ ప్రధానం. దీంతోపాటు గ్రూప్‌ డిస్కషన్‌, రిటన్‌ ఎబిలిటీ టెస్ట్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూల్లో విద్యార్థులు చూపించిన ప్రతిభ, అకడమిక్‌ రికార్డు, పని అనుభవం తదితరాలను పరిగణనలోకి తీసుకుంటున్నాయి. 
 • ప్రతి ఐఐఎంకు సొంత విధానంలో ఎంపిక చేసుకుంటాయి. 
 • కొన్నింటిలో జీడీ, పీఐ ఉండగా మరికొన్నింటిలో జీడీ, రిటన్‌ టెస్ట్‌ తదితరాలను నిర్వహిస్తాయి. 
 • వీటికి సంబంధించిన వివరాలను ఆయా ఐఐఎంల వెబ్‌సైట్‌ల ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

డేటా ఇంటర్‌ప్రిటేషన్‌, లాజికల్‌ రీజనింగ్‌ (DILR)

 • ఈ విభాగంలో బార్‌గ్రాఫ్స్‌, కేస్‌లెట్స్‌, కాలమ్‌ గ్రాఫ్స్‌, టేబుల్స్‌, లైన్‌చార్టులు, వెన్‌ డయాగ్రమ్స్‌, పైచార్టులు, కాంబినేషన్‌ ఆఫ్‌ టు ఆర్‌ మోర్‌ టైప్స్‌ లింక్డ్‌ టు ఈచ్‌ అదర్‌, బ్లడ్‌ రిలేషన్స్‌, క్యాలెండర్స్‌ తదితర టాపిక్స్‌ నుంచి ప్రశ్నలు వస్తాయి.
 • ఈ పరీక్షలో డీఐఎల్‌ఆర్‌ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. చాలామంది మొత్తంగా మంచి పర్సంటైల్‌ సాధించినప్పటికీ.. ఈ విభాగంలో కటాఫ్‌ మార్కులు సాధించలేకపోవడంతో ఐఐఎంల షార్ట్‌లిస్ట్‌లో పేరు ఉండట్లేదు. కాబట్టి అభ్యర్థులు సెక్షనల్‌ కటాఫ్‌పైనా ప్రత్యేక దృష్టిపెట్టి ప్రిపరేషన్‌ సాగించాలి. 
 • నాలుగైదేండ్ల క్యాట్‌ పరీక్ష పేపర్లలో డీఐ ప్రశ్నల శైలిని పరిశీలించడం, డేటా ఇంటర్‌ప్రిటేషన్స్‌ టెస్ట్‌ ప్రాక్టీస్‌ ముఖ్యం. 

లాజికల్‌ రీజనింగ్‌ 

 • ఈ సెక్షన్‌లో అనలిటికల్‌, లాజికల్‌ స్కిల్స్‌ని పరీక్షించడమే ప్రధాన ఉద్దేశం. లాజికల్‌ రీజనింగ్‌ ద్వారా అభ్యర్థుల్లోని ఆలోచన విధానాన్ని అంచనా వేస్తారు. లేటెస్ట్‌ ట్రెండ్స్‌ ఫాలో అవడం ద్వారా ఈ విభాగంలో మంచి మార్కులు పొందవచ్చు. 
 • దీనిలో అరెంజ్‌మెంట్స్‌/ర్యాంకింగ్స్‌/టీం ఫార్మేషన్‌, వెన్‌ డయాగ్రం పజిల్స్‌, సిలాజిసం తదితర అంశాల నుంచి ప్రశ్నలు ఇస్తారు. 
 • వెర్బల్‌ రీజనింగ్‌ అండ్‌ రీడింగ్‌ కాంప్రెహెన్షన్‌ (VARC)
 • ఐదేండ్ల నుంచి క్యాట్‌ పరీక్షలో VARC కీలక విభాగంగా ఉంటుంది. ఇందులో అభ్యర్థుల ఇంగ్లిష్‌, గ్రామర్‌పై పట్టు, అభ్యర్థుల పఠన సామర్థ్యం, భాషపై ఉన్న జ్ఞానాన్ని, తార్కికంగా ఆలోచించగలిగే సామర్థ్యాన్ని ఇందులో పరిశీలిస్తారు. స్కూల్‌ లెవల్‌లో చదివిన గ్రామర్‌ అంశాలే ఇక్కడ ఉపయోగపడుతాయి. రీడింగ్‌ కాంప్రహెన్షన్‌. ఇందులో ఆర్థిక, శాస్త్ర-సాంకేతిక అంశాలకు సంబంధించిన ప్యాసేజ్‌లను ఇస్తున్నారు. సాధారణంగా నాలుగు ప్యాసేజ్‌లు ఇస్తుంటారు. 
 • వెర్బల్‌ ఎబిలిటీ, రీడింగ్‌ కాంప్రహెన్షన్‌ విభాగంలో.. సినానిమ్స్‌, ఆంటోనిమ్స్‌, ఇంగ్లిష్‌ యూసేజ్‌ ఆఫ్‌ గ్రామర్‌, జంబుల్డ్‌ పేరాగ్రాఫ్‌, క్లోజ్‌ ప్యాసేజ్‌, వెర్బల్‌ రీజనింగ్‌, ఫ్యాక్ట్స్‌ నుంచి ప్రశ్నలు ఇస్తుంటారు. దీనిలో మంచి మార్కులు సాధించాలంటే.. పేరాసమ్మరి, జంబుల్డ్‌ పేరాగ్రాఫ్‌ తదితరాలపై దృష్టిపెట్టాలి.
 • ఈ పరీక్షలో ఎక్కువమంది క్లిష్టంగా భావించే విభాగం రీడింగ్‌ కాంప్రహెన్షన్‌. ఇందులో అడిగే ప్రశ్నలన్నీ మల్టిపుల్‌ చాయిస్‌ విధానంలో ఉంటాయి. ఆన్‌లైన్‌ ప్రాక్టీస్‌, ప్యాసేజ్‌ భావాన్ని అర్థంచేసుకోవడం ద్వారా రీడింగ్‌ కాంప్రహెన్షన్‌ ప్రిపరేషన్‌ను కొనసాగించాలి. దీనిలో రీజనింగ్‌, అసంప్షన్‌, ట్రూ ఆర్‌ ఫాల్స్‌ కోణంలోనూ ప్రశ్నలు ఇస్తున్నారు.

క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ

 • క్వాంటిటేటివ్‌ ఎబిలిటీలో అర్థమెటిక్‌ అంశాలతోపాటు ప్యూర్‌ మ్యాథ్స్‌ ప్రశ్నలు ఇస్తారు. ఈ విభాగంలో అర్థమెటిక్‌, అల్జీబ్రా, జామెట్రీ, మోడ్రన్‌ మ్యాథ్స్‌ ప్రధానమైనవి.
 • దీనికోసం ప్రాథమిక అంశాలపై పట్టుసాధించాలి.
 • ఫార్ములాలు, ప్రాక్టీస్‌ చాలా కీలకం. ఈ ప్రశ్నల సమాధానలు కచ్చితత్వంతో కూడుకున్నవి. వేగం, కచ్చితత్వం కోసం ప్రీవియస్‌ పేపర్లు ప్రాక్టీస్‌ చేయాలి.

నాన్‌ ఎంసీక్యూస్‌

 • నాన్‌ ఎంసీక్యూ ప్రశ్నల పద్ధతిని 2015 నుంచి అడుగుతున్నారు. ఈ ప్రశ్నలకు ఎలాంటి ఆప్షన్లు ఉండవు. 
 • వీటికి సమాధానాన్ని మౌస్‌ని ఉపయోగించి వర్చువల్‌ కీ బోర్డ్‌ ఆధారంగా టైప్‌ చేయాలి. ప్రతి విభాగంలో నాన్‌ ఎంసీక్యూస్‌ ఉంటున్నాయి. కానీ వీటి సంఖ్యపై మాత్రం ఎలాంటి నిర్దిష్టత లేదు. క్యాట్‌లో బేసిక్‌ కంప్యూటేషన్‌లో ఉపయోగపడేలా నాన్‌ సైంటిఫిక్‌ ఆన్‌ స్క్రీన్‌ క్యాలికులేటర్‌ అందుబాటులో ఉంది.

ప్రాక్టీస్‌ టెస్ట్‌లు కీలకం 

 • క్యాట్‌ ప్రిపరేషన్‌లో ఆన్‌లైన్‌ మాక్‌టెస్ట్‌లది కీలక స్థానం. కంప్యూటర్‌ బేస్డ్‌ మాక్‌ టెస్టులకు హాజరవడం వల్ల అభ్యర్థులకు వాస్తవ పరీక్ష పరిస్థితులపై అవగాహన ఏర్పడుతుంది. అవకాశాన్ని బట్టి సాధ్యమైనన్ని ఆన్‌లైన్‌ మాక్‌ టెస్టులకు హాజరు కావాలి. అయితే ప్రస్తుతం టాపిక్‌ వైజ్‌ పరీక్ష రాయడంవల్ల మంచి ఉపయోగం ఉంటుంది. 
 • పూర్తిస్థాయి ప్రిపరేషన్‌ను రెండునెలల్లో పూర్తిచేసుకుని మూడోనెలలో పూర్తిగా మాక్‌టెస్ట్‌లు, రివిజన్‌ చేసుకోవడం ఉత్తమం. 

ప్రాక్టీస్‌ మంత్ర

అభ్యర్థులు ప్రాక్టీస్‌ ఎంత ఎక్కువగా చేస్తే పరీక్ష రోజు ప్రశ్నలతో అంత త్వరగా కనెక్ట్‌ అవగలుగుతారు. షెడ్యూల్‌ ప్రకారం ప్రాక్టీస్‌ చేయడం ద్వారా ప్రశ్నలను వేగంగా పరిష్కరించగలిగే నేర్పు, కూర్చుని ఏకధాటిగా మూడుగంటలపాటు పరీక్ష ఎదుర్కొనే సామర్థ్యం అలవడుతాయి. క్యాట్‌కు హాజరయ్యే అభ్యర్థులు ఓపెన్‌ మైండ్‌తో ఉండటం మంచిది. ముఖ్యంగా బలంగా ఉన్న విభాగాల్లోని అన్ని పశ్నలను అటెంప్ట్‌ చేసేందుకు ప్రయత్నించాలి. అలాగే ప్రతి విభాగంలో 20 వరకు ప్రశ్నలకు సమాధానాలు రాయగలిగేలా ప్రిపేరయితే మంచి పర్సంటైల్‌ సాధించొచ్చు.

ముఖ్యతేదీలు

 • దరఖాస్తు: ఆన్‌లైన్‌లో ఆగస్టు 5 నుంచి
 • చివరితేదీ: సెప్టెంబర్‌ 16
 • పరీక్షతేదీ: నవంబర్‌ 29
 • ఫీజు: జనరల్‌ అభ్యర్థులకు రూ.2000/- 
 • ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీలకు రూ.1000/-
 • ఫలితాల వెల్లడి: 2021, జనవరి రెండోవారం
 • వెబ్‌సైట్‌: https://iimcat.ac.in

ఐఐఎంలు 

ఇంజినీరింగ్‌కు ఐఐటీ, మెడికల్‌కు ఎయిమ్స్‌లు ప్రసిద్ధి చెందినట్లే మేనేజ్‌మెంట్‌ కోర్సులకు ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌లు పేరుగాంచాయి. ఈ ఐఐఎంలు ప్రముఖ బీస్కూల్స్‌గా, టాప్‌ విద్యా సంస్థలుగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి.  ఐఐఎం క్యాంపస్‌లు: అహ్మదాబాద్‌, అమృత్‌సర్‌, బెంగళూరు, బోధ్‌గయ, కోల్‌కతా, ఇండోర్‌, జమ్ము, కాశీపూర్‌, కోజికోడ్‌, లక్నో, నాగ్‌పూర్‌, రాయ్‌పూర్‌, రాంచీ, రోహ్‌తక్‌, సంబల్‌పూర్‌, షిల్లాంగ్‌, సిర్మౌర్‌, తిరుచ్చి, షిల్లాంగ్‌, ఉదయ్‌పూర్‌, విశాఖపట్నం మొత్తం 20 ఐఐఎంలు ఉన్నాయి.

పరీక్షా విధానం

 • మొత్తం సెక్షన్లు: మూడు
 • పరీక్ష కాలవ్యవధి: 180 నిమిషాలు (ప్రతి సెక్షన్‌కు 60 నిమిషాలు)
 • ప్రశ్నపత్రం మాధ్యమం: ఇంగ్లిష్‌
 • 100 ప్రశ్నలు- 300 మార్కులు
 • ప్రశ్నల రకాలు: ఎంసీక్యూ, నాన్‌ ఎంసీక్యూలు

సెక్షన్లవారీగా కఠినత్వస్థాయి 

 • VARC- Easy to moderate
 • DILR- Moderate to difficult
 • QA - Difficult
 • మార్కుల విధానం: ప్రతి సరైన జవాబుకు 3 మార్కులు. ఎంసీక్యూలకు తప్పు జవాబు గుర్తిస్తే 1/3 మార్కులు కోతవిధిస్తారు. నాన్‌ ఎంసీక్యూలకు నెగెటివ్‌ మార్కింగ్‌ విధానం లేదు.


జే. నర్సింగ్‌

క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ 

అండ్‌ రీజనింగ్‌ ఫ్యాకల్టీ

ఇండియన్‌ బ్రెయిన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌, హైదరాబాద్‌logo