శుక్రవారం 07 ఆగస్టు 2020
Nipuna-education - Jul 15, 2020 , 02:57:44

ఇగ్నో

ఇగ్నో

 • ఇంటి ముంగిటే విద్య

కొవిడ్‌తో రెగ్యులర్‌ విద్యావిధానం స్తంభించిపోయింది. దీంతో మూడు దశాబ్దాల కింద వయస్సు, ప్రాంతం, మతం, జెండర్‌తో సంబంధం లేకుండా అందరికీ సమానంగా విద్యను అందించాలనే ఉద్దేశంతో ఏర్పాటుచేసిన దూరవిద్య నేడు ప్రత్యామ్నాయంగా మారుతుంది. యూజీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికెట్‌ ప్రోగ్రామ్స్‌ను అందిస్తూ ఇగ్నో దూరవిద్యను అందించడంలో అగ్రగామిగా ఉంది. జూలై 2020 సెషన్‌లో ప్రవేశాల కోసం దరఖాస్తు గడువు జూలై 31న ముగియనుంది. ఈ నేపథ్యంలో ఇగ్నో గురించి సంక్షిప్తంగా..

 • ఇందిరాగాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూనివర్సిటీ (ఇగ్నో)ని 1985 పార్లమెంట్‌ చట్టం ప్రకారం ప్రారంభించారు. 
 • ప్రపంచంలో అతిపెద్ద ఓపెన్‌ యూనివర్సిటీగా అవతరించింది.
 • కామన్‌వెల్త్‌ ఆఫ్‌ లెర్నింగ్‌ ద్వారా 1993, 1999లో అవార్డ్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ను పొందింది. 
 • ఇగ్నో నోడల్‌ ఏజెన్సీగా 24 గంటల ఎడ్యుకేషనల్‌ చానెల్‌ (జ్ఞాన్‌ దర్శన్‌) ప్రారంభించింది.
 • రిజిస్టర్‌ అయిన విద్యార్థుల సంఖ్య మూడు మిలియన్లు.2010లో ఉన్నతవిద్య సంస్థల్లో అతిపెద్ద సంస్థగా ఇగ్నోను యునెస్కో ప్రకటించింది.
 • దేశంలో పలు ప్రాంతాల్లో రీజనల్‌ సెంటర్ల ద్వారా పలు కోర్సులను అందిస్తుంది.
 • ఈ కోర్సులు రెగ్యులర్‌ కోర్సులతో సమానం. సివిల్స్‌, గ్రూప్స్‌, రైల్వే తదితర ఉద్యోగాలన్నింటికి ఈ కోర్సులు చేసిన వారు అర్హులే. 
 • ప్రస్తుతం యూజీసీ నిబంధనల ప్రకారం ఒకేసారి రెండుకోర్సులను అంటే ఒకటి రెగ్యులర్‌ విధానంలో రెండోది దూరవిద్య విధానంలో చదువుకోవచ్చు. 
 • ఆసక్తి ఉండి ఒకేసారి రెండు డిగ్రీలను లేదా కోర్సులను చదువాలనుకునేవారికి ఇగ్నో కోర్సులు కల్పవృక్షంగా చెప్పవచ్చు.
 • ప్రస్తుతం సర్టిఫికెట్‌, డిప్లొమా, డిగ్రీ, పీజీ, డాక్టోరల్‌, తదితరాలకు సంబంధించి 200కుపైగా కోర్సులను ఆఫర్‌ చేస్తోంది. వీటిలో 13 ఆన్‌లైన్‌ కోర్సులున్నాయి. 

అందిస్తున్న కోర్సులు

 • యూజీ కోర్సులు: బీఏ (ఆంత్రోపాలజీ, ఎకనామిక్స్‌, హిస్టరీ, పొలిటికల్‌ సైన్స్‌, సైకాలజీ, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, సోషియాలజీ, మ్యాథ్స్‌, హిందీ, ఉర్దూ, ఇంగ్లిస్‌, సంస్కృతం, ఎడ్యుకేషన్‌), బ్యాచిలర్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ (బీసీఏ), బీఎల్‌ఐఎస్సీ, బీఏ టూరిజం, బ్యాచిలర్‌ ఆఫ్‌ సోషల్‌ వర్క్‌, బీబీఏ, బీఏ (ఆనర్స్‌) తదితర కోర్సులు. వీటి కాలవ్యవధి- మూడేండ్లు.

కోర్సు ప్రత్యేకతలు

 •  ఇగ్నో సెల్ఫ్‌ ఇన్‌స్ట్రక్షనల్‌ ప్రింటెడ్‌ మెటీరియల్‌ (థియరీ, ప్రాక్టికల్స్‌), ఆడియో-విజువల్‌ మెటీరియల్‌ ఎయిడ్స్‌, ఈ-జ్ఞాన్‌ కోశ్‌ ద్వారా వీడియో కంటెంట్‌ (డిజిటల్‌ లెర్నింగ్‌), జ్ఞాన్‌ దర్శన్‌, స్వయంప్రభ తదితర చానెల్స్‌ ద్వారా పలు క్లాసులను అందిస్తుంది. వీటితోపాటు ఆల్‌ ఇండియా రేడియో ద్వారా ఆడియో ప్రోగ్రామ్స్‌ను అందిస్తుంది.
 •  అవసరమైన సబ్జెక్టులకు సంబంధించి ప్రాక్టికల్స్‌/ప్రాజెక్ట్‌లను స్టడీ సెంటర్లు అందిస్తాయి. 
 •  పలు కోర్సులను క్రెడిట్‌ సిస్టమ్‌ ద్వారా (చాయిస్‌ బేస్డ్‌ క్రెడిట్‌ సిస్టమ్‌) ద్వారా ఇగ్నో అందిస్తుంది.

అర్హతలు: ఇంటర్‌ ఉత్తీర్ణత. బోధనా మాధ్యమం ఇంగ్లిష్‌/హిందీ.

పీజీ కోర్సులు: ఎమ్మెస్సీ ఫుడ్‌ న్యూట్రిషన్‌, ఎంఏ రూరల్‌ డెవలప్‌మెంట్‌, ఎమ్మెస్సీ (కౌన్సెలింగ్‌ అండ్‌ ఫ్యామిలీ థెరపీ), ఎంఎస్‌డబ్ల్యూ, ఎంఏ ఎడ్యుకేషన్‌, ఎంఏ సైకాలజీ, ఎంసీఏ, ఎంకాం, ఎంఎల్‌ఐఎస్సీ తదితరాలు ఉన్నాయి.వీటితోపాటు పలు పీజీ డిప్లొమాలు, డిప్లొమా, సర్టిఫికెట్‌ కోర్సులు ఉన్నాయి.

అర్హత: పీజీ, పీజీ డిప్లొమా/ డిప్లొమా/ సర్టిఫికెట్‌ ప్రోగ్రామ్స్‌కు సంబంధిత విభాగాల్లో డిగ్రీ /ఇంటర్‌.  

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో,

చివరితేదీ: జూలై 31

వెబ్‌సైట్‌: www.ignou.ac.in

-కేశవపంతుల వేంకటేశ్వరశర్మ


హైదరాబాద్‌ రీజినల్‌ సెంటర్‌ చిరునామా

Plot No.207, Kavuri Hills, Phase-II

Jubilee Hills PO, Hyderabad - 500033

Phone No:040-23117550,040-23117551

Website:http://ignouhyd.ap.nic.in


logo