మంగళవారం 11 ఆగస్టు 2020
Nipuna-education - Jul 15, 2020 , 02:31:52

జాబ్‌ ఓరియంటెడ్‌ కోర్సులు

జాబ్‌ ఓరియంటెడ్‌ కోర్సులు

పెద్ద కోర్సులు చేసే స్తోమత లేనివారికి, పెద్ద చదువులు చదవాలనే కోరిక లేని వారికి ఉపాధి గ్యారెంటీనిచ్చే కోర్సులను సీఐటీడీ అందిస్తుంది. కేవలం పదోతరగతి ఉత్తీర్ణతతో అందించే ఈ డిప్లొమాలను చేస్తే ఆయా రంగాల్లో ఉపాధి లేదా సొంతంగా ఉపాధి పొందవచ్చు. ప్రస్తుతం ఆ కోర్సుల్లో ప్రవేశాల దరఖాస్తు గడువు జూలై 18తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆ కోర్సుల వివరాలు.

సీఐటీడీ

l సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టూల్‌ డిజైన్‌ (సీఐటీడీ) మొదట యూఎన్‌డీపీ, ఐఎల్‌వో సహకారంతో 1968లో హైదరాబాద్‌లోని బాలానగర్‌లో ఏర్పాటైంది. 1970లో అంటే రెండేండ్లకే కేంద్ర ప్రభుత్వ సొసైటీగా మారింది. టూల్‌ డిజైన్‌ అండ్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌, క్యాడ్‌, క్యామ్‌, సీఏఈ, వీఎల్‌ఎస్‌ఐ, ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌, ఎలక్ట్రానిక్స్‌, మెకట్రానిక్స్‌, రోబోటిక్స్‌లో పీజీ నుంచి పలు సర్టిఫికెట్‌ కోర్సులను ఈ సంస్థ అందిస్తోంది. టూల్‌ డిజైన్‌, మ్యానుఫ్యాక్చరింగ్‌ తదితర అంశాల్లో శిక్షణతోపాటు సలహా, సంప్రదింపులు, చిన్నతరహా సంస్థలకు కామన్‌ ఫెసిలిటీ సేవలు, వివిధ పరికరాల డిజైన్‌, ఉత్పత్తిలో సీఐటీడీ తోడ్పడుతూ ఉంటుంది. దీనికి సంబంధించిన అంశాల్లో శిక్షణ, సహాయాల కోసం అవసరమైన అన్ని హంగులతో ల్యాబ్‌లను సంస్థ సమకూర్చుకుంది. క్యాలిబ్రేషన్‌ సెంటర్‌, క్యాడ్‌ -క్యామ్‌ సెంటర్‌, ఆటోమేషన్‌ సెంటర్‌ వంటివన్నీ ఉన్నాయి. 

కోర్సు: డిప్లొమా ఇన్‌ టూల్‌, డై,    మౌల్డ్‌ మేకింగ్‌ (డీటీడీఎం) 

 • l ఇది నాలుగేండ్ల కాలవ్యవధి కలిగిన కోర్సు. సీట్ల సంఖ్య 60
 • l అర్హతలు: కనీసం 50 శాతం మార్కులతో పదోతరగతి పాసై ఉండాలి. 

కోర్సులు: డిప్లొమా ఇన్‌ ఎలక్ట్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌ (డీఈసీఈ), డిప్లొమా ఇన్‌ ఆటోమేషన్‌ అండ్‌ రోబోటిక్స్‌ ఇంజినీరింగ్‌ (డీఏఆర్‌ఈ), డిప్లొమా ఇన్‌ ప్రొడక్షన్‌ ఇంజినీరింగ్‌ (డీపీఈ)

 • l ఇవి మూడేండ్ల కాలవ్యవధి గల కోర్సులు. 
 • l ఒక్కో కోర్సులో 60 సీట్లు. 
 • l పదోతరగతి ఉత్తీర్ణులు ఈ కోర్సులకు అర్హులు.
 • l వయస్సు: పైన పేర్కొన్న నాలుగు కోర్సుల్లో చేరాలనుకునే వారి వయస్సు 2020 మే 2 నాటికి 15-19 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేండ్ల వరకు వయస్సులో సడలింపు ఉంటుంది. 
 • l ఫీజు: సెమిస్టర్‌ ఫీజు రూ. 20,000/-
 • l కోర్సు మాధ్యమం: ఇంగ్లిష్‌ మీడియం. పరిమితంగా హాస్టల్‌ సౌకర్యం ఉంది. 
 • l ఎంపిక విధానం: రాతపరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది. 
 • l రాతపరీక్ష: ఈ పరీక్ష పదోతరగతి స్థాయిలో ఉంటుంది. దీనిలో మ్యాథ్స్‌, సైన్స్‌, ఇంగ్లిష్‌, ఆప్టిట్యూడ్‌, జీకే నుంచి ప్రశ్నలు ఇస్తారు.
 • l పరీక్ష కాలవ్యవధి గంటన్నర.

ముఖ్యతేదీలు

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో

చివరితేదీ: జూలై 18

పరీక్ష తేదీ: జూలై 26

పరీక్ష కేంద్రం: హైదరాబాద్‌

వెబ్‌సైట్‌: http://www.citdindia.org/

పూర్తి వివరాల కోసం ఫోన్‌ నంబర్లు:

9502405170,040-23771959లలో సంప్రదించవచ్చు.


logo