మంగళవారం 04 ఆగస్టు 2020
Nipuna-education - Jul 08, 2020 , 10:54:00

కేవీల్లో 9, 11వ తరగతి విద్యార్థులకు సప్లీ లేకుండానే ప్రమోట్‌

కేవీల్లో 9, 11వ తరగతి విద్యార్థులకు సప్లీ లేకుండానే ప్రమోట్‌

న్యూఢిల్లీ: కేంద్రీయ విద్యాలయాల్లో 9, 11వ తరగతి విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్‌ చేయనున్నారు. కరోనా నేపథ్యంలో పరీక్షలు లేకుండానే విద్యార్థులను పై తరగతులకు పంపించాలని కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌ నిర్ణయించింది. తొమ్మిది, 11వ తరగతి పరీక్షల్లో ఒకటి లేదా అంతకంటె ఎక్కువ సబ్జెక్టుల్లో ఉత్తీర్ణులు కాని విద్యార్థులను ప్రమోట్‌ చేస్తున్నామని కేవీఎస్‌ జాయింట్‌ కమిషనర్‌ ప్రియా ఠాకూర్‌ తెలిపారు. అయితే విద్యార్థులకు స్కూల్‌లో ప్రాజెక్టులు ఇస్తామని, అందులో వచ్చిన మార్కులను ఆదారంగం చేసుకుని పై తరగతులకు పంపిస్తామని చెప్పారు. 

కాగా, 9, 11వ తరగతిలో ఫెయిలైన విద్యార్థులు తప్పనిసరిగా సప్లిమెంటరి పరీక్షలు రాయాలని, అందులో ఉత్తీర్ణులైతేనే 10, 12వ తరగతిలోకి ప్రమోట్‌ అవుతారని ప్రకటించింది. అయితే దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నది. జూలై 31 వరకు కేంద్రీయ విద్యాలయాలు ప్రారంభమయ్యే అవకాశంలేదని ప్రియా ఠాకూర్‌ వెల్లడించారు.


logo