సోమవారం 03 ఆగస్టు 2020
Nipuna-education - Jul 07, 2020 , 23:53:30

కెరీర్‌ @ మారిటైం

కెరీర్‌ @ మారిటైం

ఐఎంయూ సెట్‌-2020

సముద్రం అంటే అపార జలరాశి... అంతేకాదు ఉపాధి అవకాశాలను కూడా అపారంగా అందిస్తుంది. కోట్లాది జీవరాశుల నిలయంగా, కోట్లాది ప్రజల జీవనగమనంగా సముద్రం నిలుస్తుంది. పూర్వం భారత్‌లో సముద్ర సంబంధిత రంగం జీడీపీ 25 శాతం ఉండగా ప్రస్తుతం అది 3 శాతానికి పడిపోయింది. గత కొన్ని దశాబ్దాలుగా ఈ రంగం క్రమక్రమంగా పెరుగుతుంది. దీంతో ఈ రంగానికి సంబంధించిన ఉపాధి అవకాశాలు కూడా వేగంగా పెరుగుతున్నాయి. ఇండియన్‌ మారిటైం యూనివర్సిటీలో యూజీ, పీజీ కోర్సుల ప్రవేశ ప్రకటన విడుదలైంది. ఈ నేపథ్యంలో ఈ ప్రత్యేకమైన కోర్సుల గురించి సంక్షిప్తంగా..

ఇండియన్‌ మారిటైం యూనివర్సిటీ

దీన్ని 2008లో ప్రారంభించారు. ఈ యూనివర్సిటీ భారత షిప్పింగ్‌ మంత్రిత్వశాఖ పరిధిలో ఉంది. చెన్నై ప్రధాన కార్యాలయం. మారిటైం అంటే సమద్ర రంగానికి సంబంధించిన విద్య, శిక్షణ, పరిశోధనలతోపాటు ఓషనోగ్రఫీ, మారిటైం హిస్టరీ, లా, సెక్యూరిటీ, రిస్క్యూ, కార్గో, ఎన్విరాన్‌మెంటల్‌ స్టడీస్‌ తదితర అంశాల కోసం ప్రత్యేకంగా దీన్ని ప్రారంభించారు. దేశంలోని 7 ప్రధానమైన పరిశోధన సంస్థలు ఐఎంయూ పరిధిలో పనిచేస్తున్నాయి. దేశంలోని మారిటైం కాలేజీల్లో ప్రవేశాల కోసం ఐఎంయూ ఏటా కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ను నిర్వహిస్తుంది. ఈ టెస్ట్‌ ద్వారా పలు యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.


కోర్సులు

అండర్‌ గ్రాడ్యుయేట్‌ 

 • బీటెక్‌ (మెరైన్‌ ఇంజినీరింగ్‌), 
 • బీటెక్‌ (నేవల్‌ ఆర్కిటెక్చర్‌ 
 • అండ్‌ ఓషన్‌ ఇంజినీరింగ్‌)
 • ఈ కోర్సుల కాలవ్యవధి నాలుగేండ్లు.
 • బీఎస్సీ (నాటికల్‌ సైన్స్‌)- మూడేండ్లు
 • బీబీఏ (లాజిస్టిక్స్‌, రిటెయిలింగ్‌ 
 • & ఈకామర్స్‌)- మూడేండ్లు
 • బీఎస్సీ (షిప్‌ బిల్డింగ్‌ & రిపేర్‌) (ఇది 
 • ఒకే ఒక కాలేజీలో అందిస్తున్నారు)
 • నాటికల్‌ సైన్స్‌ డిప్లొమా (ఏడాది)

పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్స్‌ (రెండేండ్ల కోర్సులు)

 • ఎంటెక్‌ (మెరైన్‌ ఇంజినీరింగ్‌&మేనేజ్‌మెంట్‌), ఎంటెక్‌ (నేవల్‌ ఆర్కిటెక్చర్‌&ఓషన్‌ ఇంజినీరింగ్‌), ఎంటెక్‌ (డ్రెడ్జింగ్‌&హార్బర్‌ ఇంజినీరింగ్‌), ఎంబీఏ (పోర్ట్‌&షిప్పింగ్‌ మేనేజ్‌మెంట్‌), ఎంబీఏ (ఇంటర్నేషనల్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌&లాజిస్టిక్స్‌ మేనేజ్‌మెంట్‌), ఎమ్మెస్సీ (కమర్షియల్‌ షిప్పింగ్‌&లాజిస్టిక్స్‌)
 • వీటితోపాటు పీజీ డిప్లొమా, పీహెచ్‌డీ, ఎంఎస్‌ ప్రోగ్రామ్స్‌ ఉన్నాయి.

ప్రవేశ విధానం

 •  బీబీఏ ప్రోగ్రామ్‌ మినహాయించి మిగిలిన అన్ని కోర్సుల్లో ప్రవేశాలను ఐఎంయూ సెట్‌ ద్వారా కల్పిస్తారు. 
 • సెట్‌లో 200 మార్కులకు మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు ఇస్తారు. 
 • ఇంగ్లిష్‌, జనరల్‌ ఆప్టిట్యూడ్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌ (ఇంటర్‌స్థాయి) నుంచి ప్రశ్నలు ఇస్తారు.
 • నోట్‌: ఎంబీఏ, ఎంటెక్‌ ప్రవేశాల పరీక్ష విధానం వేరుగా ఉంటుంది.
 • రాష్ట్రంలో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌.

అర్హతలు: యూజీ కోర్సులకు కనీసం 60 శాతం మార్కులతో ఇంటర్‌ (ఎంపీసీ) ఉత్తీర్ణత. 18-25 ఏండ్ల మధ్య ఉండాలి. బీబీఏకు ఇంటర్‌లో ఏ గ్రూప్‌ వారైనా దరఖాస్తు చేసుకోవచ్చు. పీజీ, ఎంబీఏ తదితరాలకు వెబ్‌సైట్‌ చూడవచ్చు.

ఐఎంయూ క్యాంపస్‌లు

కోల్‌కతా, ముంబై పోర్ట్‌ క్యాంపస్‌, నవీ ముంబై, చెన్నై, విశాఖపట్నం, కొచ్చి. ఇవి కాకుండా 18 ఐఎంయూ అఫిలియేటెడ్‌ మారిటైం విద్యా సంస్థలు ఉన్నాయి.

ముఖ్య తేదీలు

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో

చివరితేదీ: జూలై 26

ఐఎంయూసెట్‌ తేదీ: ఆగస్టు 16

పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్‌: www.imu.edu.in

చిరునామా

East Coast Road, Semmencherry,

Sholinganallur (P.O) 

Chennai - 600 119.

Phone No: +91 44 2453 9020

...?కేశవపంతుల వేంకటేశ్వరశర్మlogo