గురువారం 13 ఆగస్టు 2020
Nipuna-education - Jul 01, 2020 , 12:13:46

‘క్లాట్‌' దరఖాస్తుల గడువు పొడిగింపు

‘క్లాట్‌' దరఖాస్తుల గడువు పొడిగింపు

న్యూఢిల్లీ: దేశంలోని లా యూనివర్సిటీల్లో ప్రవేశాలు కల్పించడానికి నిర్వహించే క్లాట్‌-2020 దరఖాస్తు గడువును జూలై 10 వరకు పొడిగించారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో కామన్‌ లా అడ్మిషన్‌ టెస్ట్‌ (క్లాట్‌) దరఖాస్తుల గడువును పొడిగిస్తున్నట్లు కన్సార్షియం ఆఫ్‌ నేషనల్‌ లా యూనివర్సిటీస్‌ ప్రకటించింది. అధికారి వెబ్‌సైట్‌ consortiumofnlus.ac.in ద్వారా ఈ నెల 10 వరకు దరఖాస్తులను సమర్పించవచ్చని వెల్లడించింది. గతంలో పేర్కొన్న ప్రకారం జూలై 1తో అప్లికేషన్ల గడువు ముగిసింది. 

నోటిఫికేషన్‌ ప్రకారం జూన్‌ 21న ప్రవేశ పరీక్ష జరగాల్సి ఉన్నది. కరోనా వైరస్‌ నేపథ్యంలో పరీక్ష వాయిదా పడుతూ వస్తున్నది. తాజాగా ఆగస్టు 22న పరీక్ష నిర్వహించాలని యూనివర్సిటీలు నిర్ణయించాయి. ఈ పరీక్ష ద్వారా దేశంలోని 22 న్యాయ విశ్వవిద్యాలయాల్లో యూజీ, పీజీ లా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ ఏడాది భోపాల్‌లోని నేషనల్‌ లా యూనివర్సిటీ ఈ పరీక్షను నిర్వహించనుంది.


logo