మంగళవారం 02 మార్చి 2021
Nipuna-education - Jul 01, 2020 , 03:19:38

పరీక్ష లేకుండానే కొలువు

పరీక్ష లేకుండానే కొలువు

ఎస్‌బీఐ ఎస్‌ఓ-2020.. ఎస్‌బీఐలో 444 స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టులు

 • స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ జారీచేసింది. అయితే ఈ ఉద్యోగాలు ఈసారి స్పెషల్‌. ఎందుకంటే కరోనా వల్ల పరీక్షలు లేకుండానే కేవలం ఇంటర్వ్యూ ద్వారానే ఎంపిక చేస్తున్నారు. అయితే ఈ ఉద్యోగాలు అనుభవం ఉన్నవారికి సువర్ణావకాశం. ఈ నోటిఫికేషన్‌, ఖాళీలు, ఇంటర్వ్యూ విధానం గురించి తెలుసుకుందాం.
 • ఎస్‌బీఐ వివిధ విభాగాల్లో మొత్తం 444 పోస్టులకు వేర్వేరుగా నోటిఫికేషన్‌ జారీచేసింది. ఇందులో పర్మనెంట్‌తోపాటు కాంట్రాక్ట్‌ ఉద్యోగాలు కూడా ఉన్నాయి. వీటిలో తమ అర్హతకు తగిన ఉద్యోగానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ఖాళీల వివరాలు

ఎస్‌ఎంఈ క్రెడిట్‌ అనలిస్ట్‌- 20 (3 ఏండ్ల అనుభవం), డిప్యూటీ మేనేజర్‌ (ఐఎస్‌ ఆడిట్‌)- 8 (2 ఏండ్ల అనుభవం), మేనేజర్‌ (ఎనీ టైం చానల్‌)- 1 (ఏడాది అనుభవం), ప్రొడక్ట్‌ మేనేజర్‌- 6 (5 ఏండ్ల అనుభవం), మేనేజర్‌ (డాటా అనలిస్ట్‌)- 2 (8 ఏండ్ల అనుభవం), మేనేజర్‌ (డిజిటల్‌ మార్కెటింగ్‌)- 1, చీఫ్‌ మేనేజర్‌ (స్పెషల్‌ సిచ్యువేషన్‌ టీమ్‌)- 3 (8 ఏండ్ల అనుభవం), డిప్యూటీ మేనేజర్‌ (స్ట్రెస్‌డ్‌ అసెట్స్‌ మార్కెటింగ్‌)- 3 (4 ఏండ్ల అనుభవం)

కాంట్రాక్ట్‌ ఉద్యోగాలు

 • వైస్‌ ప్రెసిడెంట్‌ (స్ట్రెస్‌డ్‌ అసెట్స్‌ మార్కెటింగ్‌)- 1 (12 ఏండ్ల అనుభవం), ఫ్యాకల్టీ (హెచ్‌ఆర్‌, మార్కెటింగ్‌, ఐటీ)- 3 (3 ఏండ్ల అనుభవం), సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ (డిజిటల్‌ మార్కెటింగ్‌)- 2 (4 ఏండ్ల అనుభవం), సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ (డిజిటల్‌ రిలేషన్స్‌)- 2 (4 ఏండ్ల అనుభవం), సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ (అనలిటిక్స్‌)- 2 (4 ఏండ్ల అనుభవం), ఎగ్జిక్యూటివ్‌ (ఎఫ్‌ఐ & ఎంఎం)- 241 (అనుభవం అవసరం లేదు), సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ (సోషల్‌ బ్యాంకింగ్‌Xసీఎస్‌ఆర్‌)- 85 (3 ఏండ్ల అనుభవం), డాటా ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌- 1 (15 ఏండ్ల అనుభవం), చీఫ్‌ ఆఫీసర్‌ (సెక్యూరిటీ)- 1 (ఆర్మీలో బ్రిగేడియర్‌ కలిగిన వ్యక్తి), బ్యాంకింగ్‌ సూపర్‌వైజర్‌- 1 (25 ఏండ్ల అనుభవం), హెడ్‌ (ప్రొడక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌, రిసెర్చ్‌)- 1 (12 ఏండ్ల అనుభవం), సెంట్రల్‌ రిసెర్చ్‌ టీమ్‌- 1 (5 ఏండ్ల అనుభవం), సెంట్రల్‌ రిసెర్చ్‌ టీమ్‌ (సపోర్ట్‌)- 1 (3 ఏండ్ల అనుభవం), ఇన్వెస్ట్‌మెంట్‌ ఆఫీసర్‌- 9 (5 ఏండ్ల అనుభవం), రిలేషన్‌షిప్‌ మేనేజర్‌- 48 
 • (3 ఏండ్ల అనుభవం), ఇంకా మిగిలిన బ్యాక్‌లాగ్‌ పోస్టులు

ఎంపిక విధానం

 • రెండంచెలుగా ఉంటుంది. 
 • 1) డాక్యుమెంట్స్‌ షార్ట్‌ లిస్టింగ్‌
 • 2) ఇంటర్వ్యూ ద్వారా
 • వీటికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల మెరిట్‌, వయస్సు, ఉద్యోగానుభవం వంటి అంశాల ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. ఈ లిస్ట్‌లో ఎంపికైనవారికి 100 మార్కులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. కటాఫ్‌ మార్కుల ఆధారంగా తుది జాబితాను ప్రకటిస్తారు.
 • ఇంటర్వ్యూ అనేది పర్సనల్‌గా లేదా టెలిఫోన్‌ ద్వారా లేదా వీడియో కాలింగ్‌ ఇంటర్వ్యూ కూడా అయి ఉండవచ్చు.

నోటిఫికేషన్‌ వివరాలు

 • మొత్తం పోస్టులు- 444 (బ్యాక్‌లాగ్‌తో సహా)
 • అర్హతలు: వేర్వేరు పోస్టులకు వేర్వేరుగా ఉన్నాయి.
 • వయస్సు: కనిష్టం 25 ఏండ్లు. గరిష్టం వేర్వేరు పోస్టులకు వేర్వేరుగా ఉన్నాయి.
 • ఫీజు: జనరల్‌, ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీలకు రూ.750, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ,  ఎక్స్‌సర్వీస్‌మెన్లకు ఫీజు లేదు.
 • దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
 • చివరితేదీ: జూలై 13
 • వెబ్‌సైట్‌: https://bank.sbi/career, www.sbi.co.in


పోస్టులవారీగా సిలబస్‌, విధి విధానాలు

 • ఎస్‌ఎంఈ క్రెడిట్‌ అనలిస్ట్‌: బ్యాంక్‌/కంపెనీ బ్యాలెన్స్‌ షీట్స్‌ పరిశీలన, క్రెడిట్‌ విశ్లేషణ, ప్రతిపాదన వంటి బాధ్యతలు, క్రెడిట్‌ రిస్క్‌ అసెస్‌మెంట్‌, డెబిట్స్‌/క్రెడిట్‌ రిపోర్టులు తయారీ, ఈ-కేవీసీ మార్గదర్శకాలు, ఆర్‌బీఐ మార్గదర్శకాలతో వార్షిక నివేదికలు సిద్ధం చేయడం
 • డిప్యూటీ మేనేజర్‌ (ఐఎస్‌ ఆడిట్‌-Iలో ఆడిట్‌): ఐఎస్‌ ఆడిట్‌- ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ ఆడిట్‌, ఐటీ- ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఆడిట్‌, సైబర్‌ సెక్యూరిటీ, ఎథికల్‌ హ్యాకింగ్‌, వీఏపీటీ ఆడిట్‌-వల్నరబిలిటీ అసెస్‌మెంట్‌ అండ్‌ పెనెట్రేషన్‌ టెస్టింగ్‌, విశ్వసనీయత, మౌలిక పరిశోధనలు సిద్ధం చేసుకోవడం
 • మేనేజర్‌ (ఎనీ టైం చానల్‌): బీఆర్‌డీ (బిజినెస్‌ రిక్వైర్‌మెంట్‌ డాక్యుమెంట్స్‌) సిద్ధం చేయడం, ఎండ్‌ అండ్‌ ఎండ్‌ మేనేజ్‌మెంట్‌/ప్రాజెక్ట్స్‌ నిర్వహించడం, లావాదేవీల వాల్యూమ్‌ చానల్‌ను ఏర్పాటు చేయడం, బ్యాంకు కార్యకలాపాలకు ప్రత్యామ్నాయ చానల్స్‌ ఏర్పాటు చేయడం, రోజువారీ బ్యాంకు కార్యకలాపాలను వృద్ధి చేయడం, వ్యాల్యూ యాడెడ్‌ సర్వీసెస్‌ విస్తరించడం
 • ప్రొడక్ట్‌ మేనేజర్‌: కోర్‌ ప్రాజెక్ట్‌ గుర్తించడం. రీ డిజైన్‌ చేసి ప్రాసెసింగ్‌ చేయ డం, బ్యాంకు ఉత్పత్తి పెంచడం కోసం అసాధారణ కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, రీడర్‌షిప్‌ స్కిల్స్‌ కలిగి ఉండటం, టీమ్‌ మేనేజ్‌మెంట్‌, విశ్లేషణాత్మక, సమస్య పరిష్కారం వంటి ప్రతిభ కలిగి ఉండటం, సృజనాత్మక ఆలోచన విధానం, ప్రాజెక్టుపై లోతైన పరిశీలన చేయడం
 • మేనేజర్‌ (డాటా అనలిస్ట్‌): విలువైన డేటా షీట్లు సామర్థ్యంగా నిర్వహించడం, సమగ్ర రిపోర్టులు తయారీ, ప్రత్యేక కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ కలిగి ఉండటం, ఆంతరంగిక ప్రాజెక్టు విశ్లేషణాత్మకంగా తయారు చేయడం, డాటా సంవృద్ధి కోసం కొత్త మార్గదద్శకాలు అన్వేషించడం, బ్యాంకు కస్టమర్‌ కేవైసీ డాటాను ప్రొటెక్ట్‌ చేయడం
 • మేనేజర్‌ (డిజిటల్‌ మార్కెటింగ్‌): బ్యాంక్‌ డిజిటల్‌ మార్కెటింగ్‌ను ప్రోత్సహించడం, బ్యాంకు ఖాతాదారులకు అనుగుణంగా బ్యాంక్‌ కార్యకలాపాలను నిర్వహించడం, బ్యాంకింగ్‌, ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌, ఫోన్‌ బ్యాంకింగ్‌, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ వంటి కార్యకలాపాలను నిర్వహించడం, ఎస్‌బీఐ యోనో, ఎస్‌బీఐ బడ్డీ, ఈ-బ్యాంకింగ్‌ విధానాలను మరింత విస్తృతంగా మార్కెటింగ్‌ చేయడం, ఇన్సూరెన్స్‌, షేర్‌ మార్కెట్‌,  బ్యాంకు ద్వారా వేతనాలు వంటి అన్ని కార్యకలాపాలపై ఖాతాదారులకు అవగాహన కల్పించడం.
 • చీఫ్‌ మేనేజర్‌ (స్పెషల్‌ సిచ్యువేషన్‌ టీమ్‌): కంప్యూటర్‌ నాలెడ్జ్‌ కలిగి ఉండటం, ఎంఎస్‌ ఆఫీస్‌పై పూర్తి నైపుణ్యం, ఇంగ్లిష్‌లో రాయడం, మంచి కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ కలిగి ఉండటం, బ్యాంక్‌ ఆర్థిక లావాదేవీలపై టీమ్‌వర్క్‌ నిర్వహించడం, ఎస్‌ఎంఏ- స్పెషల్‌ మెన్షన్‌ అకౌంట్స్‌ వంటి వాటిపై దిద్దుబాటు చర్యలు కలిగి ఉండటం
 • డిప్యూటీ మేనేజర్‌ (స్ట్రెస్‌డ్‌ అసెట్స్‌ మార్కెటింగ్‌): బ్యాంకు ఫైనాన్షియల్‌ స్టేట్‌మెంట్‌ను అధ్యయనం చేసి స్ట్రెస్‌డ్‌ అసెట్స్‌కు కారణాలు కనుగొనడం, నూతన ఫైనాన్షియల్‌ మోడల్స్‌ను రూపొందించడం, ఎన్‌పీఏను రికవరీ చేయడం, కార్పొరేట్‌ బ్యాంకింగ్‌, దివాలా పద్ధతిని ఆర్‌బీఐ మార్గదర్శకాలను అధ్యయనం చేయడం
 • వైస్‌ ప్రెసిడెంట్‌ (స్ట్రెస్‌డ్‌ అసెట్స్‌ మార్కెటింగ్‌): పెట్టుబడుదారులతో, బ్యాంక్‌ భాగస్వాములతో స్ట్రెస్‌డ్‌ అసెట్స్‌పై పూర్తి సమాచారంతో సమావేశం నిర్వహించడం, ఎన్‌పీఏ అసెట్స్‌ గురించి బ్యాంకు వినియోగదారులతో చర్చించి రికవరీపై ప్లాన్‌ చేయడం, స్ట్రెస్‌డ్‌ అసెట్స్‌పై ఫోకస్‌ చేయడం కోసం టీమ్‌ను లీడ్‌ను చేయడం, మార్కెటింగ్‌ విధివిధానాలతో స్ట్రెస్‌డ్‌ అసెట్స్‌ను పర్యవేక్షించడం
 • ఎగ్జిక్యూటివ్‌ (ఎఫ్‌ఐ & ఎంఎం)/ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ (సీఎస్‌ఆర్‌): గ్రామీణ బ్యాంకింగ్‌, వ్యవసాయ బ్యాంకింగ్‌ కార్యకలాపాల నిర్వహణ, సహకార సంస్థలు, ఎన్జీవోలు, మహిళ సంఘాలు, వ్యవసాయం, అనుబంధ పరిశ్రమలు, సూక్ష్మరుణాల సంస్థలు, వాటి వార్షిక క్రెడిట్‌ ప్లాన్‌లు, సాయిల్‌ హెల్త్‌కార్డులు, సీఎస్‌ఆర్‌ (కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ) కార్యకలాపాలు, ఎంఎస్‌ఆర్‌ (మినిమమ్‌ సపోర్ట్‌ ప్రైస్‌), ప్రభుత్వ పథకాల అమలు, గ్రామ పంచాయతీ కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం, నాబార్డు, వ్యవసాయ యూనివర్సిటీలతో కలిసి బ్యాంకు రుణాల్లో వృద్ధి సాధించడం
 • వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ బిజినెస్‌ యూనిట్‌: ప్రొడక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌, మ్యూచువల్‌ ఫండ్లు, వాణిజ్య లావాదేవీలు ఇతర బ్యాంకులు లేదా ఆర్థిక కంపెనీలతో పోటీ అంశాలు, సెంట్రల్‌ రిసెర్చ్‌ టీమ్‌ కోసం కంప్యూటర్‌ ఎంఎస్‌ ఆఫీస్‌పై నైపుణ్యం, పరిశోధన అంశాలైన బ్యాంకు సాఫ్ట్‌వేర్లు, Bloomberg, Reuters, Crisil, ICRA వంటి వాటిపై విశ్లేషించడం, వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ కోసం బ్యాంకింగ్‌ టెక్నాలెడ్జ్‌, టీమ్‌వర్క్‌ కలిగి ఉండటం.

VIDEOS

logo