సోమవారం 06 జూలై 2020
Nipuna-education - Jun 26, 2020 , 02:18:15

విద్య, ఉద్యోగ సమాచారం

విద్య, ఉద్యోగ సమాచారం

వ్యాప్‌కోస్‌లో 


భారత ప్రభుత్వ సంస్థ వ్యాప్‌కోస్‌ లిమిటెడ్‌లో కాంట్రాక్టు ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.

మొత్తం ఖాళీలు: 10

పోస్టులు: హైడ్రో జియాలజిస్ట్‌, కమ్యూనికేషన్‌ స్పెషలిస్ట్‌, హైడ్రో జియోకెమిస్ట్‌, అగ్రికల్చర్‌ ఎకనామిస్ట్‌ తదితరాలు ఉన్నాయి.

అర్హతలు: సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ ఉత్తీర్ణత. అనుభవం.

ఎంపిక: స్కిల్‌టెస్ట్‌/ ఇంటర్వ్యూ ద్వారా

దరఖాస్తు: ఈ-మెయిల్‌

ఈ-మెయిల్‌: [email protected]

చివరితేదీ: జూన్‌ 30

వెబ్‌సైట్‌: http://www.wapcos.gov.in

ఎన్‌ఐఈఎల్‌ఐటీలో


కాలికట్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఎన్‌ఐఈఎల్‌ఐటీ)లో కింది కోర్సులో ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైంది.

ప్రోగ్రామ్‌: ఎంటెక్‌ (2020-22)

కోర్సులు: ఎంబెడెడ్‌ సిస్టమ్‌, ఎలక్ట్రానిక్స్‌ డిజైన్‌ టెక్నాలజీ.

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణత. వ్యాలిడ్‌ గేట్‌ స్కోర్‌.

ఎంపిక: గేట్‌ స్కోర్‌, అకడమిక్‌ మెరిట్‌ ద్వారా

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో

చివరితేదీ: జూలై 31

వెబ్‌సైట్‌: http://nielit.gov.in

సీపెట్‌లో డిప్లొమాలు


కొచ్చిలోని సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాస్టిక్స్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ(సీపెట్‌) డిప్లొమాలో లేటరల్‌ ఎంట్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.డిప్లొమాలో లేటరల్‌ ఎంట్రీ 

కోర్సులు: డిప్లొమా ఇన్‌ ప్లాస్టిక్స్‌ మౌల్డ్‌ టెక్నాలజీ (డీపీఎంటీ), డిప్లొమా ఇన్‌ ప్లాస్టిక్స్‌ టెక్నాలజీ (డీపీటీ)

కోర్సు వ్యవధి: రెండేండ్లు.

అర్హతలు: సంబంధిత సబ్జెక్టులతో ఇంటర్‌ ఉత్తీర్ణత.

వెబ్‌సైట్‌: https://www.cipet.gov.in

నిట్‌లో పీహెచ్‌డీ


వరంగల్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎన్‌ఐటీ)లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైంది.

ప్రోగ్రామ్‌: పీహెచ్‌డీ- జూలై 2020

విభాగాలు: సివిల్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రికల్‌, కెమికల్‌ ఇంజినీరింగ్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌ తదితరాలు ఉన్నాయి.

అర్హత: సంబంధిత బ్రాంచీల్లో బీటెక్‌/ బీఈ, డిగ్రీ (ఇంజినీరింగ్‌)/ ఎంటెక్‌/ ఎంఈ, ఎమ్మెస్సీ/ ఎంఫిల్‌ ఉత్తీర్ణతతోపాటు గేట్‌/ యూజీసీ/ సీఎస్‌ఐఆర్‌/ నెట్‌ ఉండాలి.

ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో

చివరితేదీ: జూలై 3

వెబ్‌సైట్‌: https://www.nitw.ac.in


logo