సోమవారం 06 జూలై 2020
Nipuna-education - Jun 24, 2020 , 00:42:03

న్యాయవిద్యకు గేట్‌వే క్లాట్‌-2020

న్యాయవిద్యకు గేట్‌వే క్లాట్‌-2020

న్యాయవిద్య.. ఎప్పటికీ వన్నె తగ్గని సంప్రదాయ కోర్సులు ఇవి. నేటి తరానికి తగ్గట్టు మరింత సాంకేతికతతో దూసుకుపోతున్న కెరీర్‌గా న్యాయవిద్యను పేర్కొనవచ్చు. దేశంలో ఇంజినీరింగ్‌కు ఐఐటీలు, వైద్యకోర్సులకు ఎయిమ్స్‌లు  ప్రతిష్ఠాత్మక సంస్థలుగా ఉన్నట్లే న్యాయవిద్యకు నేషనల్‌ లాయూనివర్సిటీలు ప్రసిద్ధి. ఈ విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే క్లాట్‌-2020 చివరితేదీ జూలై 1తో ముగుస్తున్న నేపథ్యంలో సంక్షిప్తంగా ఆ వివరాలు..

నేషనల్‌ లా యూనివర్సిటీ

బెంగళూరులో నేషనల్‌ లా స్కూల్‌ (యూనివర్సిటీ) పేరిట 1987లో ప్రారంభించారు. తర్వాత దీన్ని 1998లో హైదరాబాద్‌లో రెండో సంస్థను ప్రారంభించారు. తర్వాత ఒక్కొక్కటిగా ఆయా రాష్ర్టాల్లో ఐఐటీ ప్యాట్రన్‌లో ఎన్‌ఎల్‌యూలను ప్రారంభించారు. ప్రస్తుతం దేశంలో 23 ఎన్‌ఎల్‌యూలు ఉన్నాయి. వీటిలో 22 ఎన్‌ఎల్‌యూలు క్లాట్‌ ద్వారా ప్రవేశాలు కల్పిస్తున్నాయి. ఢిల్లీ ఎన్‌ఎల్‌యూ మాత్రం ప్రత్యేక పరీక్ష ద్వారా ప్రవేశాలు కల్పిస్తుంది. ప్రపచంలో ఏ దేశంలో లేనివిధంగా న్యాయవిద్యకు ప్రత్యేక యూనివర్సిటీలు భారత్‌లో మాత్రమే ఉండటం మరో విశేషం.

క్లాట్‌-2020

నేషనల్‌ లా యూనివర్సిటీ (ఎన్‌ఎల్‌యూ)లలో ప్రవేశాల కోసం జాతీయస్థాయిలో నిర్వహించే పరీక్ష కామన్‌ లా అడ్మిషన్‌ టెస్ట్‌ (క్లాట్‌). క్లాట్‌ పరీక్షను 2008 నుంచి నిర్వహిస్తున్నారు. ఈ పరీక్ష మల్టిపుల్‌చాయిస్‌ విధానంలో ఉంటుంది. 2014 వరకు దీన్ని ఆఫ్‌లైన్‌లో నిర్వహించారు. 2015 నుంచి దీన్ని ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నారు.

క్లాట్‌ నిర్వహణతోపాటు న్యాయమైన న్యాయవిద్యను అందించడానికి 2018 నుంచి కన్సార్టియం ఆఫ్‌ ఎన్‌ఎల్‌యూను ఏర్పాటుచేశారు.

కోర్సులు

యూజీ, పీజీ కోర్సులు ఉన్నాయి.

అర్హతలు: అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులకు కనీసం 45 శాతం మార్కులతో ఇంటర్‌ ఉత్తీర్ణత. గరిష్ట వయోపరిమితి లేదు. 

పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం కనీసం 50 శాతం మార్కులతో ఎల్‌ఎల్‌బీ డిగ్రీ ఉత్తీర్ణత. గరిష్ట వయోపరిమితి లేదు.

పరీక్ష విధానం

150 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష కాలవ్యవధి రెండుగంటలు.

మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు ఇస్తారు. ప్రతి ప్రశ్నకు ఒకమార్కు.

నెగెటివ్‌ మార్కింగ్‌ విధానం ఉంది. ప్రతి తప్పు జవాబుకు 0.25 మార్కులు కోతవిధిస్తారు.

పరీక్షలో ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌, కరెంట్‌ అఫైర్స్‌, జీకే, లీగల్‌ రీజనింగ్‌, లాజికల్‌ రీజనింగ్‌, క్వాంటిటేటివ్‌ టెక్నిక్స్‌ నుంచి ప్రశ్నలు ఇస్తారు.

ప్రవేశాలు కల్పించే యూనివర్సిటీలు

ఎన్‌ఎల్‌యూ - బెంగళూరు, హైదరాబాద్‌, భోపాల్‌, కోల్‌కతా, జోధ్‌పూర్‌, రాయ్‌పూర్‌, గాంధీనగర్‌, లక్నో, పంజాబ్‌, పట్నా, కొచ్చి, ఒడిశా, రాంచీ, అసోం, విశాఖపట్నం, తిరుచిరాపల్లి, ముంబై, నాగ్‌పూర్‌, ఔరంగాబాద్‌, సిమ్లా, జబల్‌పూర్‌, హర్యానా.వీటితోపాటు అలయన్స్‌ యూనివర్సిటీ, అమిటీ యూనివర్సిటీ, అపెక్స్‌ యూనివర్సిటీ, ఆర్యన్స్‌ గ్రూప్‌ ఆఫ్‌ కాలేజీ, ఏషియన్‌ లా కాలేజీ, బెన్నెట్‌ యూనివర్సిటీ, బీఎంఎల్‌ ముంజల్‌ యూనివర్సిటీ, ఎఫ్‌ఐఎంటీ, డీఆర్‌ఆర్‌డీ, గీతం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ లా, గీతం, జీఎంయూ, హెచ్‌ఐటీఎస్‌, ఇండోర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ లా, నిర్మా, ఐఎస్‌బీఆర్‌, ఐటీఎం, జైపూర్‌, జేఈసీఆర్‌సీ, జేఐఎంఎస్‌తోపాటు పలు ప్రైవేట్‌ యూనివర్సిటీలు క్లాట్‌ స్కోర్‌ ద్వారా ప్రవేశాలు కల్పిస్తున్నాయి.

వివరాలు

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో

చివరితేదీ: జూలై 1, వెబ్‌సైట్‌: https:// consortiumofnlus.ac.in/clat-2020

-కేశవపంతుల వేంకటేశ్వరశర్మ


logo