మంజునాథ్, తనిష్క్ జంటగా నటిస్తున్న చిత్రం ‘మా ఊరి ప్రేమకథ’. స్వీయనిర్మాణ దర్శకత్వంలో యస్వీ మంజునాథ్ రూపొందిస్తున్నారు. ఈ నెల 22న ప్రేక్షకులముందుకురానుంది. గురువారం థియేట్రికల్ ట్రైలర్, ఆడియోను విడుదల చేశారు. దర్శకనిర్మాత మాట్లాడుతూ ‘గ్రామీణ నేపథ్యంలో నడిచే ప్రేమకథా చిత్రమిది. సెంటిమెంట్, యాక్షన్ అంశాల కలబోతగా సాగుతుంది. ఉభయ తెలుగు రాష్ర్టాల్లో అత్యధిక థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు. కథానుగుణంగా చక్కటి పాటలు కుదిరాయని సంగీత దర్శకుడు జయసూర్య తెలిపారు. ఈ చిత్రంలో రుద్రప్రకాష్, లక్ష్మయ్యచౌదరి, పద్మారావు, అమృత తదితరులు నటించారు.