మిస్ట్.. ది బెస్ట్ ఎంఐఎస్టీ-2020

ఏటా లక్షలాదిమంది విద్యార్థులు ఇంజినీరింగ్ పూర్తిచేస్తున్నారు. కానీ పరిశ్రమకు కావల్సిన నైపుణ్యాలు ఎక్కువమందిలో ఉండటం లేదు. ఆయా కంపెనీల్లో చేరిన తర్వాత వారికి శిక్షణ ఇచ్చుకోవల్సిన పరిస్థితి. దీంతో చాలా సమయం వృథా అవుతుంది. ఈ సమస్యకు పరిష్కారంగా ఐదు యూనివర్సిటీలు సంయుక్తంగా అందించే కోర్సు మిస్ట్ (ఎంఐఎస్టీ). దీని ద్వారా పరిశ్రమకు అవసరమైన నైపుణ్యాలను ప్రాక్టికల్‌గా నేర్చుకోవడమే కాకుండా కోర్సు పూర్తయిన వెంటనే ఆయా కంపెనీలలో బాధ్యతలను స్వీకరించే స్కిల్స్‌ను నేర్పడమే ఈ కోర్సు ఉద్దేశం. పీజీ స్థాయిలో బాగా క్రేజీ ఉండటమే కాకుండా వందశాతం ప్లేస్‌మెంట్స్ కూడా లభించడం మరో విశేషం. ఈ పీజీ కోర్సు విశేషాలను తెలుసుకుందాం..
ఎంఐఎస్టీ
మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఎంఐఎస్టీ) లేదా ఎంఎస్ ఇన్ ఐటీ అని పిలుస్తారు. ఇది రెండేండ్ల కోర్సు. కంప్యూటర్ సైన్స్‌లో పీజీ ప్రోగ్రామ్. దీన్ని 2001లో ప్రారంభించారు. ఎంఐఎస్టీ ఒక వినూత్నమైన బహుళ విశ్వవిద్యాలయ ఇంటర్ డిసిప్లినరీ పీజీ ప్రోగ్రామ్. ఐదు విశ్వవిద్యాలయాలతో ఏర్పడిన కన్సార్టియం ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ (సీఐహెచ్ఎల్) ద్వారా ఈ ప్రోగ్రామ్‌ను అందిస్తున్నారు.అమెరికాలోని కార్నెగి మెలన్ యూనివర్సిటీ పరిశోధకులు ఈ కోర్సుకు మార్గదర్శకత్వం అందిస్తున్నారు.
ప్రత్యేకతలు: ఎప్పటికప్పుడు మారుతున్న మార్కెట్ డిమాండ్లకు అనుగుణంగా సాంకేతికంగా సమర్థులైన, పరిశ్రమకు కావల్సిన అన్ని రకాల నైపుణ్యాలను ఈ కోర్సులో అందిస్తారు.
కోర్సు ప్రత్యేకతలు
ఈ కోర్సు ప్రధానంగా లెర్నింగ్ బై డూయింగ్ మెథడ్‌లో అందిస్తున్నారు. ఈ కోర్సు ప్రాజెక్ట్ కేంద్రంగా నిర్వహిస్తారు. దీనిలో విద్యార్థులకు కాన్సెప్టులను అర్థం చేసుకుని అప్లయ్ చేయడం అలవాటు చేస్తారు. ప్రతి కోర్సును మాడ్యూల్స్‌గా విభజించారు. ప్రతి మాడ్యూల్ ఒక ప్రాజెక్ట్‌గా చేపడుతారు. కార్పొరేట్ వాతావరణం కల్పించి, విద్యార్థుల టీమ్‌లుగా విభజించి టాస్క్‌లు ఇస్తారు. నిర్ణీత గడువులోగా ఆయా ప్రాజెక్టులను పూర్తిచేయాలి. ఈ క్రమంలో అవసరమైన సహాయాన్ని మెంటార్స్ అందిస్తారు. ప్రతి పదిమంది విద్యార్థులకు ఒక మెంటార్ ఉంటాడు. వీరు పూర్తిస్థాయిలో అవసరమైనప్పుడల్లా విద్యార్థులకు తగిన మార్గదర్శకత్వం చేస్తుంటారు. ప్రతి విద్యార్థికి ల్యాప్‌టాప్‌లు అందిస్తారు. దీంతోపాటు 24X7 ఇంటర్నెట్ సౌకర్యం, డిజిటల్ కంటెంట్‌ను అందుబాటులో ఉంచుతారు. అవసరమైన ప్రతి సందర్భంలో వారు నేర్చుకునే అంశానికి సంబంధించిన రంగంలో నిపుణులతో లెక్చర్స్‌ను అందిస్తారు. దీంతో విద్యార్థులు పూర్తి నైపుణ్యాలను గడించడానికి అవకాశం ఏర్పడుతుంది.
కోర్సును అందించే యూనివర్సిటీలు
హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ-హెచ్), జేఎన్టీయూ హెచ్, జేఎన్టీయూ కాకినాడ, జేఎన్టీయూ అనంతపురం, తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీలు సంయుక్తంగా ఈ కోర్సును అందిస్తున్నాయి.
కోర్సు అండ్ స్ట్రక్చర్
- ఈ కోర్సు ఒక సీక్వెన్షియల్ లెర్నింగ్ విధానంలో కన్సార్టియం అందిస్తుంది.
- ఇది సంప్రదాయ పద్ధతిలోని బీటెక్/ఎంటెక్‌లకు పూర్తి వ్యతిరేకంగా ఉంటుంది.
- ఈ కోర్సులో విద్యార్థి మొదటి అంశంలో పూర్తిస్థాయి నిపుణత్వం సాధిస్తేనే తదుపరి అంశంలోకి వెళ్తారు.
- ఈ సీక్వెన్షియల్ ప్యాట్రన్‌తో విద్యార్థికి ఆ కోర్సులో ప్రావీణ్యం పొందడంతోపాటు సంబంధిత కాన్సెప్టులను అర్థం చేసుకోవడానికి అవకాశం లభిస్తుంది.
- కోర్ కాన్సెప్టులను లోతుగా అర్థం చేసుకుని అన్వేషించి తదుపరి తర్వాత కోర్సులోకి వెళ్తారు.
- ఈ కోర్సులో ప్రతి స్థాయిలో విద్యార్థి అసెస్మెంట్కు 70 లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ సాధించాలి.
- ఈ కనీస పర్సంటేజీ విద్యార్థి సామర్థ్యాలను విస్తరించడానికి ప్రేరేపిస్తుంది.
- అకడమిక్ ఇయర్‌ను ఆరు మినీ సెమిస్టర్లుగా విభజిస్తారు. ప్రతి మినీ సెమిస్టర్ వ్యవధి ఎనిమిది వారాలు.
- మొదటి విద్యాసంవత్సరంలో ఐదు ఐటీ, సాఫ్ట్‌స్కిల్స్ సెమిస్టర్లు, ఒక ప్రాక్టికల్ మినీ సెమిస్టర్ ఉంటుంది.
- రెండో సంవత్సరంలో నాలుగు ఐటీ, సాఫ్ట్‌స్కిల్స్ మినీ సెమిస్టర్లు, రెండు ప్రాక్టికల్ సెమిస్టర్లు ఉంటాయి.
- ఏడాదికి నాలుగు వారాల సెలవు ఉంటుంది.
సర్టిఫికేషన్
ఎంఐఎస్టీ రెండేండ్ల పీజీ ప్రోగ్రామ్. దీన్ని ఐదు విశ్వవిద్యాలయాల కన్సార్టియం అందిస్తుంది. ప్రతి యూనివర్సిటీలో ఒక లెర్నింగ్ సెంటర్ ఉంటుంది. అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఇవి ఉంటాయి. రెండేండ్లు పూర్తయిన తర్వాత ఏ యూనివర్సిటీలో చదువుకున్నారో ఆ యూనివర్సిటీ ఎంఐఎస్టీ డిగ్రీని ప్రదానం చేస్తుంది.
కోర్సు విశేషాలు
- ఈ కోర్సు ప్రాజెక్ట్ సెంట్రిక్ కరికులమ్‌లో అందిస్తున్నారు.
- అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, నిపుణుల బృందంతో లెక్చర్స్, ప్రాక్టికల్స్, ప్రాజెక్టులను అందిస్తారు.
- సమాచార ఆధారిత ఆర్థిక వ్యవస్థలో సాంకేతిక పరిజ్ఞానం, కస్టమర్ ఆధారితంగా ఉంటాయి. దీంతో పనిచేసే ప్రదేశంలో అవసరమైన సాఫ్ట్‌స్కిల్స్‌పై ఈ కోర్సులో ప్రత్యేకంగా నేర్పిస్తారు.
- ఈ కోర్సులో ఎల్ఎస్ఆర్డబ్ల్యూ (లిజనింగ్, రీడింగ్, రైటింగ్) స్కిల్స్‌తోపాటు లైఫ్స్కిల్స్పై కూడా శిక్షణ ఇస్తారు.
- దీనికోసం ప్రతి వారం అసెస్మెంట్లో భాగంగా ప్రజంటేషన్స్, గ్రూప్ డిస్కషన్లు ఉంటాయి. వీటిని మీడియేటర్/ఫెసిలిటేటర్లు నిర్వహిస్తారు.
- సాఫ్ట్‌స్కిల్స్‌కు సంబంధించిన మెంటార్లు ప్రతి వారం విద్యార్థుల స్కిల్స్‌ను విశ్లేషించి, సెల్ఫ్ ఇంప్రూవ్‌మెంట్‌కు సూచనలు ఇస్తారు.
- జీవితంలో వచ్చే సమస్యలను ఎదుర్కోవడానికి విద్యార్థులను సిద్ధం చేస్తారు. దీనికోసం లైఫ్స్కిల్స్కు సంబంధించిన నిపుణులతో లెక్చర్స్, మోటివేషనల్ వీడియోలు తదితరాలు విద్యార్థులకు అందిస్తారు.
- అధునాతనమైన థియేటర్ బేస్డ్ సాఫ్ట్‌స్కిల్స్‌లో శిక్షణ ఇస్తారు. విద్యార్థులకు అవసరమైన వ్యాపార మర్యాద నైపుణ్యాలను నేర్పిస్తారు.
- విద్యార్థులకు సృజనాత్మకంగా ఆలోచించే స్వేచ్ఛను కల్సిస్తారు. తార్కిక, విమర్శణాత్మక ఆలోచనలు మెరుగుపర్చడానికి అవకాశం కల్పిస్తారు.
కోర్సులో స్పెషలైజేషన్లు
- మెషిన్ లెర్నింగ్
- డాటా సైన్స్
- బ్లాక్‌చైన్ టెక్నాలజీస్
- ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్
- మొబైల్ యాప్ డెవలప్మెంట్
- ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ
- సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్
- కంప్యూటర్ నెట్వర్క్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ
- ఈ బిజినెస్ టెక్నాలజీస్
- సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్
- డాటా అనలిటిక్స్ అండ్ డాటా విజువలైజేషన్
- మెషిన్ లెర్నింగ్
- మొబైల్ టెక్నాలజీస్
కోర్సు ఫీజు వివరాలు
ఐఐఐటీహెచ్‌లో ఏడాదికి రూ.2 లక్షలు
జేఎన్టీయూహెచ్లో ఏడాదికి రూ.1.70 లక్షలు
జేఎన్టీయూకే, జేఎన్టీయూఏ, ఎస్వీయూలో ఏడాదికి రూ.1.30 లక్షలు
అడ్మిషన్ ఫీజు కింద కౌన్సెలింగ్ సమయంలో రూ.30 వేలు చెల్లించాలి.
పరీక్ష విధానం
- పరీక్ష 50 మార్కులకు నిర్వహిస్తారు.
- పరీక్షలో రెండు సెక్షన్లు ఉంటాయి. సెక్షన్-1లో క్రిటికల్ రీడింగ్+రైటింగ్, సెక్షన్-2లో క్వాంటిటేటివ్ ఎబిలిటీపై ప్రశ్నలు ఇస్తారు.
- పరీక్ష కాలవ్యవధి 60 నిమిషాలు.
- నెగెటివ్ మార్కింగ్ విధానం లేదు.
- ప్రశ్నలను మల్టిపుల్ చాయిస్ విధానంలో ఇస్తారు.
నోట్: జీఆర్ఈ జూలై 2017 తర్వాత రాసి దానిలో 301/3.5 స్కోర్ సాధించినవారికి నేరుగా ప్రవేశాలు కల్పిస్తారు. వీరు జీఏటీ రాయాల్సిన అవసరం లేదు.
అర్హతలు
బీఈ/బీటెక్‌లో ఏదైనా బ్రాంచీలో ఉత్తీర్ణులు.
ప్రవేశ విధానం
గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (జీఏటీ) ద్వారా చేస్తారు.
జీఏటీ: ఇది రెండురకాలుగా నిర్వహిస్తారు.
1. వాక్ ఇన్ ఎంట్రెన్స్- అభ్యర్థులు ఎంచుకున్న తేదీలో పరీక్ష నిర్వహించడం
2. రెగ్యులర్ జీఏటీ ఎంట్రెన్స్- కన్సార్టియం నిర్ణయించిన తేదీన ఎంట్రెన్స్ నిర్వహించి దాని ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు.
నోట్: ఈసారి కొవిడ్-19 లాక్డౌన్ నేపథ్యంలో రెండు రకాల జీఏటీ ఎంట్రెన్స్‌లను ఆన్లైన్ పద్ధతిలో నిర్వహిస్తున్నారు.
అభ్యర్థులు వాక్ ఇన్స్ను మూడుసార్లు, రెగ్యులర్ జీఏటీని ఒక్కసారి అంటే మొత్తం మీద నాలుగుసార్లు మాత్రమే రాయడానికి వీలుంటుంది. ఈసారి నాలుగుసార్లకు బదులు కేవలం వాక్ ఇన్స్ ఒకసారి, రెగ్యులర్ ఒకసారి మాత్రమే అనుమతిస్తారు. దీనిలో వచ్చిన ర్యాంకింగ్స్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
వాక్-ఇన్ ఎంట్రెన్స్ టెస్ట్
మే 15 నుంచి ప్రారంభమయ్యాయి. జూన్ 26తో ముగుస్తాయి.
రెగ్యులర్ జీఏటీ దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీ జూన్ 15
ఆన్లైన్ పరీక్షతేదీ జూన్ 28
ప్రాక్టీస్ టెస్టులు ఇతరత్రా కోసం ప్లేస్‌మెంట్స్
2017-19 బ్యాచ్ వివరాలు పరిశీలిస్తే..
మొత్తం 203 విద్యార్థులు రిజిస్టర్ అయ్యారు. వీరిలో 187 మందికి ప్లేస్‌మెంట్స్ లభించాయి.
ప్లేస్‌మెంట్స్‌కు వచ్చే కంపెనీలు
అమెజాన్, ఆపిల్, ఐబీఎం, హువావే టెక్నాలజీస్, టెక్మోజో, టీసీఎస్, వ్యాల్యూ మొమెంటం, జాన్సన్ కంట్రోల్స్, జీఈ, పేటీఎం, సీడాక్, హెచ్ఎస్బీసీ, ఏవీఐ, ఈపీఏఎం తదితర ఎంఎన్‌సీలు వస్తాయి.
https://online.cbexams.com/RPS/MSIT/Default.aspx
PracticeTests: https://online.cbexams.com/RPS/MSIT/Practice_Instructions.aspx
-ఎడ్యుకేషన్ డెస్క్
Sl. No Learning Center University Number of seats available 2-Year
1 IIIT-Hyderabad, - 110
2 JNTU- Hyderabad, - 100
3 JNTU Kakinada- 50
4 JNTU Anantapur- 50
5 SV University Tirupati- 50
తాజావార్తలు
- సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ దళ సభ్యుడి అరెస్ట్
- రైతు నేత రాకేశ్ తికాయత్ నిరాహార దీక్ష
- కాశీ గంగా హారతిలో పాల్గొన్న సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులు
- 'థ్యాంక్ యూ బ్రదర్' ట్రైలర్ రివ్యూ..!
- సీఎం కేసీఆర్ ప్రతి ఆలోచన ప్రజల అభివృద్ధి కోణంలోనే
- ఖమ్మం నగరాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం
- బ్రాండ్ బెస్ట్‌లో జియోకు ఐదో స్థానం.. కోకాకోలాకు ఫోర్త్ ర్యాంక్
- సూపర్‌స్టార్ జాకీచాన్ తో దిశాపటానీ
- ఏపీలో కొత్తగా 117 కరోనా పాజిటివ్ కేసులు
- నిజాంసాగర్‌కు పూర్వవైభవం తెస్తాం